twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చర్చలు జరపడం మంచిదే కానీ అలా కాదు.. చర్చనీయాంశంగా మారిన నరేష్ ట్వీట్!

    |

    తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యల మీద మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ వంటి వారు వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి భేటీ అయిన విషయం మీద మంచు విష్ణు నేరుగా స్పందించలేదు కానీ ఒక ట్వీట్ పెట్టి డిలీట్ చేయడం ఆ తర్వాత పేర్ని నాని స్వయంగా మా ఇంటికి వచ్చారు అంటూ మరో ట్వీట్ పెట్టి డిలీట్ చేయడం చర్చనీయాంశం గా మారింది. తాజాగా ఈ విషయం మీద మా మాజీ అధ్యక్షుడు నరేష్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీస్తున్నాయి ఆ వివరాల్లోకి వెళితే

    చర్చలు

    చర్చలు

    తెలుగు సినీ పరిశ్రమలో టికెట్ రేట్లు అంశంమీద ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కనుకరించినా వివాదాలు మాత్రం కనికరించేలా కనపడడం లేదు. ఫిబ్రవరి 10వ తేదీన చిరంజీవి నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక సమస్యల మీద చర్చలు జరిపారు.

    శుభం కార్డు

    శుభం కార్డు

    ఆ చర్చల అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇప్పటితో తెలుగు సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య ఉన్న అన్ని సమస్యలకు శుభం కార్డు పడినట్లే అని ప్రకటించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఫిబ్రవరి 11వ తేదీన హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహం జరిగింది. ఈ వివాహానికి వైసీపీ నేతలు అందరూ హాజరయ్యారు.

    మీడియా సమావేశంలో

    మీడియా సమావేశంలో

    మోహన్ బాబు కూడా వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్న క్రమంలో మోహన్ బాబు కుటుంబానికి కూడా మంత్రి బొత్స నుంచి ఆహ్వానం అందింది. అక్కడికి వెళ్ళిన మోహన్ బాబు, మంచు విష్ణు తమకు కనిపించిన పేర్నినానితో మాట్లాడి తమ ఇంటికి కాఫీ తాగి వెళ్లాల్సిందిగా కోరారు. మోహన్ బాబు కోరడంతో ఆయన కూడా ఇంటికి వెళ్లారు. ఈ విషయాన్ని పేర్ని నాని మీడియా సమావేశంలో వెల్లడించారు.

     ధన్యవాదాలు అని

    ధన్యవాదాలు అని

    ఇంటికి వచ్చిన పేర్ని నానిని సత్కరిస్తూ మంచు విష్ణు ఒక ఫోటో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అది పోస్ట్ చేసి తొలుత తెలుగు సినీ పరిశ్రమ చర్చల విషయాలను మాకు అప్డేట్ చేయడానికి వచ్చిన పేర్ని నాని గారికి ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు. ఈ విషయం మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ రావడంతో ఎందుకొచ్చిన టెన్షన్ అని భావించి మా ఆతిథ్యం స్వీకరించిన పేర్ని నాని గారికి ధన్యవాదాలు అని అప్డేట్ చేశారు. ఇక్కడతో సమస్య తీరిపోతుంది అనుకున్నారు కానీ ఇప్పుడు కొత్తగా నరేష్ ఈ అంశం మీద స్పందించారు.

    గుర్తిస్తారని

    గుర్తిస్తారని

    మోహన్ బాబు క్యాంప్‌కు దగ్గర వ్యక్తయిన నటుడు నరేష్ చేసిన ట్వీట్ టాలీవుడ్‌లో చర్చనీయాంశం అవుతోంది. టిక్కెట్ ధరలు ఇతర అంశాలపై ఫిల్మ్ చాంబర్‌తో చర్చించడమే ప్రజాస్వామ్యబద్ధమని.. వ్యక్తులతో చర్చించడం కరెక్ట్ కాదని ఆయన పేర్టుకొన్నారు. సమావేశం జరగడం ప్రశంసనీయమే కానీ అసలు అలా సమావేశం కావాల్సింది వ్యక్తులతో కాదన్నారు. త్వరలో ఈ విషయాన్ని ప్రభుత్వం, ఆ వ్యక్తులు గుర్తిస్తారని నరేష్ ట్వీట్ చేశారు.

    English summary
    Actor vk naresh reacts on megastar chiranjeevi meeting with andhra pradesh cm.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X