»   » వెన్నెల వెలుగులో మునిగి.. సొంత బ్రా వల్ల ఊపిరి ఆడక చనిపోయింది

వెన్నెల వెలుగులో మునిగి.. సొంత బ్రా వల్ల ఊపిరి ఆడక చనిపోయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  స్టార్‌ వార్స్ ప్రపంచ సినిమాలో ఒక ముద్ర వేసుకున్న సినిమా. వసూళ్ళలో కింక్ ఆఫ్ ద కింగ్స్ అనిపించుకున్న ఈ సినీ సిరీస్ లో నటించిన ప్రఖ్యాత హాలీవుడ్ నటి క్యారీ ఫిషర్ మంగళవారం ఉదయం గుండెపోటుతో తనువు చాలించింది. స్టార్‌వార్స్‌ ప్రిన్సెస్ లీయా ఆర్గానాగా నటించిన ఆమెకు 60 ఏళ్లు. ఆమెకు హారిసన్ ఫోర్డ్‌తోపాటు ఇతర స్టార్ వార్స్‌ సిరీస్‌ నటులు నివాళులర్పిస్తుండగా.. తాజాగా ఆమె చివరి వింత కోరిక ఒకటి వెలుగుచూసింది. అదేమిటో తెలుసుకునే ముందు అసలు స్టార్ వార్స్ సినిమా గురించి చెప్పుకోకుంటే ఎలా??

  'స్టార్‌వార్స్‌' సిరీస్‌ కూడా మేకింగ్‌లో విభిన్నతని చూపిస్తూ విశేష ప్రేక్షకాదరణతో వందల కోట్ల డాలర్లని కొల్లగొట్టింది. ఈ సిరీస్‌లో ఏడవ చిత్రంగా 'స్టార్‌ వార్స్‌: ద ఫోర్స్‌ అవేకెన్స్‌' ఇటీవల విడుదలై సూపర్‌డూపర్‌ సక్సెస్‌ని నమోదు చేసుకోవడంతోపాటు ఏకంగా 150 కోట్ల డాలర్లకు పైగా కలెక్ట్‌ చేసి రికార్డ్‌ సృష్టించింది.. ఈ నేపథ్యంలో 'స్టార్‌వార్స్‌' సిరీస్‌ గురించి...

  ఏ న్యూ హోప్‌:

  ఏ న్యూ హోప్‌:

  1977లో 'స్టార్‌ వార్స్‌' అనే ఈ హాలీవుడ్ సినిమా మొదలయ్యింది డైరెక్టర్ జార్జ్‌ లుకాస్‌ కొన్ని వందల ఏళ్ళ క్రితం అంతరిక్షంలో ఉన్న గ్రహాలపై ఆధిపత్యం కోసం రెండు వర్గాల మధ్య జరిగే యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. 1977లో మొదటి సారి 'స్టార్‌ వార్స్‌' చిత్రం విడుదలైంది. తర్వాత ఈ చిత్రానికి 'స్టార్‌ వార్స్‌ ఎపిసోడ్‌ -4 : ఏ న్యూ హోప్‌'గా టైటిట్‌ని మార్చారు.

  సీక్వెల్‌గా 'స్టార్‌ వార్స్‌ - 5:

  సీక్వెల్‌గా 'స్టార్‌ వార్స్‌ - 5:

  తొలిసారి రూపొందిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుని రికార్డులు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందడంతో 1980లో ఇర్విన్‌ క్రెష్నర్‌ దర్శకత్వంలో ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'స్టార్‌ వార్స్‌ - 5: ద ఎంపర్‌ స్ట్రైక్స్‌ బ్యాక్‌' సినిమాని రూపొందించారు. ఈ రెండు చిత్రాలూ విమర్శకుల ప్రశంసలందుకోవడంతో పాటు భారీ కలెక్షన్లను రాబట్టడంతో..

  రిటర్న్స్‌ ఆఫ్‌ ద జెడీ:

  రిటర్న్స్‌ ఆఫ్‌ ద జెడీ:

  వరుసగా 1983లో రిచర్డ్‌ మార్క్వూండ్‌ దర్శకత్వంలో 'స్టార్‌ వార్స్‌ -6: రిటర్న్స్‌ ఆఫ్‌ ద జెడీ', జార్జ్‌ లుకాస్‌ దర్శకత్వంలో 1999లో 'స్టార్‌ వార్స్‌ ఎపిసోడ్‌ -1: ద ఫాంటమ్‌ మెనాస్‌' చిత్రం, 2002లో 'స్టార్‌ వార్స్‌ ఎపిసోడ్‌ - 2: ఎటాక్‌ ఆఫ్‌ ద క్లోన్స్‌', 2005లో 'స్టార్‌ వార్స్‌ ఎపిసోడ్‌ -3: రివేంజ్‌ ఆఫ్‌ ద సిత్‌', ఈ ఏడాది జె.జె అబ్రామ్స్‌ దర్శకత్వంలో 'స్టార్‌ వార్స్‌: ద ఫోర్స్‌ అవేకెన్స్‌' వంటి ఏడు చిత్రాలు వచ్చాయి. ఈ సిరీస్‌లో భాగంగా 2017లో ఎనిమిదవ చిత్రం, 2019లో తొమ్మిదవ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

  కంప్యూటర్‌ వీడియో గేమ్స్‌ :

  కంప్యూటర్‌ వీడియో గేమ్స్‌ :

  'స్టార్‌వార్స్‌'కు సర్వత్రా ఆదరణ ఉండటంతో కామిక్‌బుక్స్‌, కంప్యూటర్‌ వీడియో గేమ్స్‌ కూడా ఈ సిరీస్‌పై వచ్చి అత్యధిక సేల్స్‌ని సాధించాయి. అలాగే టెలివిజన్‌లోనూ సీరియల్స్‌ రూపంలో 'ద క్లోన్‌ వార్స్‌', 'రెబర్స్‌', స్పెషల్‌ విభాగంలో 'స్పార్క్‌ ఆఫ్‌ రెబలియన్‌', 'ద సై ఆఫ్‌ లోథల్‌', లెజెండ్స్‌ విభాగంలో 'డ్రాయిడ్స్‌', 'ఎవోక్స్‌', 'క్లోన్‌ వార్స్‌', 'స్టార్‌ వార్స్‌ హాలీడే స్పెషల్‌', 'కారవన్‌ ఆఫ్‌ కరేజ్‌', 'ద బ్యాటిల్‌ ఫర్‌ ఎండోర్‌' వంటి సీరియల్స్‌ స్పెషల్‌ లెజెండ్స్‌ విభాగంలో వచ్చి బుల్లితెర ప్రేక్షకుల్ని సైతం అలరించాయి.

  ఫిల్మ్‌ సిరీస్‌లో అత్యధిక కలెక్షన్లు :

  ఫిల్మ్‌ సిరీస్‌లో అత్యధిక కలెక్షన్లు :

  'స్టార్‌ వార్స్‌' సిరీస్‌లో ఇప్పటి వరకు వచ్చిన ఏడు సినిమాలు దాదాపు ఆరు బిలియన్‌ డాలర్ల కలెక్షన్లను రాబట్టాయి. 'స్టార్‌ వార్స్‌'కి మొత్తం ప్రాంఛైజ్‌లను కలుపుకుంటే దాదాపు 32 బిలియన్‌ డాలర్లు వసూలు చేసినట్లు అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు వచ్చిన అన్ని రకాల ఫిల్మ్‌ సిరీస్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఐదవ సిరీస్‌గా 'స్టార్‌ వార్స్‌' రికార్డు సృష్టించింది.

  53కోట్ల డాలర్లు:

  53కోట్ల డాలర్లు:

  అంతే కాదు విజయవంతమైన సినిమాల జాబితాలోనూ ముందంజలో ఉంది. సినిమాల వారిగా చూస్తే మొదటి చిత్రం 'స్టార్‌ వార్స్‌ ఎపిసోడ్‌ -4 : ఏ న్యూ హోప్‌' వరల్డ్‌ వైడ్‌గా 78కోట్ల డాలర్లను వసూలు చేసి 1977 వరకు అత్యధిక కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం కేవలం 11 మిలియన్ల బడ్జెట్‌తోనే తెరకెక్కడం విశేషం. రెండవ చిత్రం 'స్టార్‌ వార్స్‌ - 5: ద ఎంపర్‌ స్ట్రైక్స్‌ బ్యాక్‌' 53కోట్ల డాలర్లు వసూలు చేసి గ్రేటెస్ట్‌ ఫిల్మ్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌గా నిలిచింది.

  హాలీవుడ్‌ సినీ చరిత్రలో:

  హాలీవుడ్‌ సినీ చరిత్రలో:

  మూడవ చిత్రం 'స్టార్‌ వార్స్‌ -6: రిటర్న్స్‌ ఆఫ్‌ ద జెడీ' 57కోట్ల డాలర్లు కలెక్ట్‌ చేయగా, నాల్గవ సిరీస్‌ చిత్రం 'స్టార్‌ వార్స్‌ ఎపిసోడ్‌ -1: ద ఫాంటమ్‌ మెనాస్‌' ఒక బిలియన్‌ డాలర్లను, ఐదవ చిత్రం 'స్టార్‌ వార్స్‌ ఎపిసోడ్‌ - 2: ఎటాక్‌ ఆఫ్‌ ద క్లోన్స్‌' 65కోట్ల డాలర్లను, ఆరవ చిత్రం 'స్టార్‌ వార్స్‌ ఎపిసోడ్‌ -3: రివేంజ్‌ ఆఫ్‌ ద సిత్‌' 85కోట్ల డాలర్లను, ఏడవ చిత్రం 'స్టార్‌ వార్స్‌: ద ఫోర్స్‌ అవేకెన్స్‌' ఇటీవల విడుదలై 150కోట్ల డాలర్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది. సిరీస్‌లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన 2వచిత్రంగా, హాలీవుడ్‌ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్ళను రాబట్టిన 4వ చిత్రంగా నిలిచింది.

  ప్రిన్సెస్ లీయా ఆర్గానా:

  ప్రిన్సెస్ లీయా ఆర్గానా:

  అయితే ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పవలసి వచ్చిందీ అంటే ఈ సిరీస్ లో హీరోయింగా నటించిన హాలీవుడ్ నటి క్యారీ ఫిషర్ మంగళవారం ఉదయం గుండెపోటుతో తనువు చాలించింది. స్టార్‌వార్స్‌ ప్రిన్సెస్ లీయా ఆర్గానాగా నటించిన ఆమెకు 60 ఏళ్లు. ఆమెకు హారిసన్ ఫోర్డ్‌తోపాటు ఇతర స్టార్ వార్స్‌ సిరీస్‌ నటులు నివాళులర్పిస్తుండగా.. తాజాగా ఆమె చివరి వింత కోరిక ఒకటి వెలుగుచూసింది.

  సొంత బ్రా వల్ల:

  సొంత బ్రా వల్ల:

  'వెన్నెల వెలుగులో మునిగి.. సొంత బ్రా వల్ల ఊపిరి ఆడక చనిపోయింది' అని తన గురించి శ్రద్ధాంజలిలో రాయాలని కోరుకుంటున్నట్టు ఆమె పేర్కొంది.
  ఈ విషయాన్ని 2008లో తాను ప్రచురించిన ఆత్మకథ 'విష్‌ఫుల్ థింకింగ్'లో పేర్కొంది. 1997నాటి స్టార్‌వార్‌ సినిమాలో పిన్సెస్‌ లీయా పాత్ర అంతరిక్షంలో తెల్లని దుస్తులు ధరిస్తుంది. ఈ దుస్తులు ఎంతో ప్రసిద్ధి పొందాయి.

  లోదుస్తులు వేసుకోవద్దని:

  లోదుస్తులు వేసుకోవద్దని:

  అయితే, సినిమా దర్శకుడు జార్జ్ లుకాస్‌ ఈ దుస్తుల గురించి తనతో చర్చిస్తూ.. వీటిని వేసుకునేటప్పుడు లోదుస్తులు వేసుకోవద్దని, ఎందుకంటే అంతరిక్షంలో వాటిని వేసుకోబోరని చెప్పాడని తెలిపింది. 'ఈ డ్రెస్‌ వేసుకొనేటప్పుడు బ్రా ధరించవద్దని అతను చెప్పాడు. నిజమే అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు మీ శరీర బరువు తేలికైపోతుంది.

  . బ్రా అలా పెరిగిపోదు:

  . బ్రా అలా పెరిగిపోదు:

  అప్పుడు మీ శరీరం ఉబ్బిపోవొచ్చు. కానీ బ్రా అలా పెరిగిపోదు. అందుకే నేను ఎలా చనిపోయినా పర్వాలేదు కానీ, బ్రా వల్ల ఊపిరి ఆడక చనిపోయిందని శ్రద్ధాంజలిలో రాయమని నా స్నేహితులకు చెప్పాను' అంటూ తన పుస్తకంలో సరదాగా వివరించింది ఫిషర్‌. స్వతహాగా రచయిత్రి కూడా అయిన ఫిషర్ మరనం లోనూ తన ప్రత్యేకతని అలా చూపించింది

  English summary
  arrie Fisher, the actress best-known for playing Princess Leia in the Star Wars franchise, has died aged 60, four days after she suffered a cardiac arrest on a flight.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more