»   » నాగ్, వెంకీ, మహేష్ కాస్త జాగ్రత్త అంటూ హెచ్చరికలు వచ్చినట్టేనా

నాగ్, వెంకీ, మహేష్ కాస్త జాగ్రత్త అంటూ హెచ్చరికలు వచ్చినట్టేనా

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  సెలబ్రిటీలు.. ఎండార్స్ మెంట్లు.. ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంటుంది. సెలబ్రిటీలు ఏదో ఒక ఉత్పత్తికి బ్రాండ్ అంబాసడర్లుగా ఉండడం ఏళ్లుగా కొనసాగుతున్న తంతే. తామున్న రంగం నుంచి భారీగా సొమ్ము అందుకుంటూనే ప్రకటనల ద్వారా జేబులు నింపుకుంటున్న నటీనటులు, క్రీడాకారులు, మోడల్స్ కు కొదువలేదు. బడా కంపెనీలకే కాక మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన ఉత్పత్తులకూ ప్రచారం చేసి పెడుతూ బాగానే సొమ్ము చేసుకుంటున్నారు వీరు. ఇదిలా ఉంటే, విపణిలో నిలదొక్కుకునేందుకు తయారీదారులు వాస్తవదూర ప్రకటనలు రూపొందించేందుకే మొగ్గుచూపుతున్నారు.

  డబ్బు వస్తుంది కదా అని సదరు ఉత్పత్తి గురించి ఏం తెలుసుకోకుండానే దానికి సంబంధించిన అడ్వర్టైజ్ మెంట్లలో నటించేస్తున్నారు చాలామంది. ఇలాంటి ప్రకటనల్లో నటిస్తున్న సెలబ్రిటీలపై కేంద్రం కొరడా ఝళిపించేందుకు రెడీ అవుతోంది. బ్రాండ్ అంబాసిడర్లుగా మారేందుకు సెలబ్రిటీలుగా ఎదుగుతారో.. సెలబ్రిటీలుగా మారారు కాబట్టి అండార్స్ మెంట్ చేసే అవకాశం వచ్చిందో చెప్పడం.. ఆయా ప్రకటనలు ఇచ్చేవాళ్లకు కూడా కష్టమే. అంతగా ఆ కంపెనీలు ఇచ్చే డబ్బులకు అలవాటు పడిపోతారు మన స్టార్లు.

  ముందూ వెనక చూసుకోకుండా:

  ముందూ వెనక చూసుకోకుండా:

  తమ అభిమాన నటుడు, నటి చెప్పారు కనుక ఆ ఉత్పత్తి అద్భుతంగా ఉంటుందని నమ్మేవారు కోకొల్లలు. ముందూ వెనక చూసుకోకుండా వాణిజ్య ఒప్పందాలు కుదర్చుకుంటూ వెళితే ఒక్కోసారి పరిస్థితి తలకిందులు కావచ్చు. ఆ మధ్య ఒక ప్రసిద్ధ నగల దుకాణ సంస్థ తూకాల్లో మోసం చేస్తోం దంటూ పతిక్రలు, టీవీల్లో వార్తలు వచ్చాయి. సంబం ధిత అధికారులు కూడా రంగంలోకి దిగి విచారణ జరిపారు. దానిని ప్రమోట్ చేస్తూ వచ్చింది టాలీవుడ్, కోలీవుడ్ అగ్రహీరోలే ..

  అభిమాన నటుడు ప్రారంభించడం వల్లనే:

  అభిమాన నటుడు ప్రారంభించడం వల్లనే:

  ఇలాంటి సందర్భాల్లో ఆ దుకాణ ప్రచార కర్త ఇమేజిపై ప్రభావం పడుతుంది. ఒక ప్రసిద్ధ నటుడు ఒకానొక చిట్‌ ఫండ్‌ సంస్థను తన అమృత హస్తాలతో ప్రారంభించాడు. ఏడాది తిరక్కుండానే సంస్థ బోర్డు తిప్పేసింది. ఖాతాదారులు లబోదిబో మన్నారు. అభిమాన నటుడు ప్రారంభించడం వల్లనే అతడిపై నమ్మకంతో ఆ సంస్థలో చిట్టీ వేసామని చాలామంది గగ్గోలు పెట్టారు.

  ఏడాది పాటు నిషేధం:

  ఏడాది పాటు నిషేధం:

  నియమ నిబంధనలను ఉల్లంఘించన ప్రకటనల్లో నటించన వారికి మొదటి సారి 10 లక్షల జరిమానా.. ఏడాది పాటు నిషేధం విధిస్తారట. తర్వాత 50 లక్షల జరిమానా 3 ఏళ్ల నిషేధం వర్తించేలా బిల్లులో మార్పులు చేసి పార్లమెంట్ అనుమతి పొందనుంది కేంద్రం. ఇక్కడ నిషేధం స్థానంలో జైలు శిక్ష ఉండేది. అయినా.. జైలు శిక్ష విధిస్తామంటేనే ఏడాది కాలంగా యాడ్స్ లో ఏ మాత్రం తేడా కనిపించలేదు.. ఇప్పుడు నిషేధం అంటే పట్టించుకుంటారా మన స్టార్ హీరోలు అండ్ హీరోయిన్సూ!!

  రెండేళ్ల జైలు శిక్ష :

  రెండేళ్ల జైలు శిక్ష :

  తప్పుదోవ పట్టించే యాడ్స్ లో నటించిన ప్రముఖులపై ఏడాది వరకు బ్యాన్ విధించాలని సర్కార్ నిర్ణయించుకుంది. మంత్రులతో కూడిన ప్యానెల్ ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. సెలబ్రిటీలపై నిషేదంతో పాటూ తయారీదారులపై రూ.10లక్షల జరిమానా విధించాలని తీర్మానించింది. భారీ జరిమానాలకు తోడు రెండేళ్ల జైలు శిక్ష విధించాలన్న సూచనను కూడా కమిటీ పరిశీలించింది.

  కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్:

  కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్:

  అయితే జైలు శిక్ష అంశాన్ని పక్కనపెట్టి జరిమానాలతోనే ఇలాంటి ప్రకటనలకు అడ్డుకట్టవేయాలని నిర్ణయించారు మంత్రులు. మిస్ లీడింగ్ యాడ్స్ ప్రచురించే పబ్లిషర్లకూ ఈ పెనాల్టీని వర్తింపజేయాలనుకున్నా ఈ నిర్ణయం వివాదాస్పదమవుతుందన్న భావనతో వెనక్కితగ్గారు. ఈ ప్రతిపాదనలన్నింటినీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ బిల్ లో త్వరలోనే పొందుపరచనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

  సీరియళ్ళ నటులూ :

  సీరియళ్ళ నటులూ :

  ఏ ఉత్పత్తికైనా బ్రాండ్‌ అంబా సిడర్లు గా ఉండటానికి సినిమా నటీనటులు తెగముందు కొచ్చేస్తున్నారు. వారితో పాటు తామేమీ తక్కువ తిన్నావని అంటూ గాయనీ గాయకులు జతకలుస్తున్నారు. మాకు మాత్రం అభిమానులు కొదవా అంటూ క్రీడాకారులూ వాణిజ్య ప్రకట నల్లో ఎంచక్కా నటించేస్తున్నారు. బుల్లి తెర భామలూ, జీడిపాకం సీరియళ్ళ నటులూ యధాశక్తీ అవకాశాలను వదలకుండా ప్రచారపర్వంలో పంజాలు విసురుతున్నారు. ప్రకటనలకే పరిమితం కాకుండా చిన్ని తెరతో మొదలిడి పెద్ద తెరకు వలస ప్రయాణాలు సాగిస్తున్న వారూ ఉన్నారు. పెద్ద తెరపై చక్రం తిప్పాక, బుల్లితెర కార్యక్రమాల నిర్వాహ కులుగా కొత్త అవతారాల్లో జిగేల్మనిపిస్తున్నవారూ ఉన్నారు.

  భాషకొక పాపులర్‌ హీరో:

  భాషకొక పాపులర్‌ హీరో:

  అన్ని భాషల్లో దేశమంతటా ప్రచారం కావలసిన ఉత్పత్తుల కోసం అన్ని ప్రాంతాల వారికి తెలిసిన హిందీ నటీనటులను ఎంపిక చేస్తున్నారు. కొన్నిసార్లు ఉత్తరాది నటుడితో దక్షిణాది నటుడు కూడా కలిసి ప్రచారం చేస్తు న్నారు. కొన్ని సంస్థలు భాషకొక పాపులర్‌ హీరోను ప్రచార కర్తగా నియమించుకుంటున్నాయి. నట వారస కుటుంబం నుంచి వచ్చిన మన్మథ పుత్రుడుని తొలి సినిమా విడుదలకు ముందే ఏదో ఒక దుకాణానికి ప్రచార కర్తగా పత్రంపై సైన్ చేసాడు. ముందే మేల్కొనకుంటే ఆ నటుడు చేజారిపోతాడేమోననే వెంపర్లాట వ్యాపార వర్గాలది.

  రిలాక్స్‌! హావ్‌ ఏ చార్మినార్‌:

  రిలాక్స్‌! హావ్‌ ఏ చార్మినార్‌:

  సిగరెట్ వల్ల ఉండే ప్రమాదం గురించి ఎక్కువ అవగాహన లేని కాలం లో సిగరెట్లు తాగటం అంటే గొప్పగా అలోచించే వారు అన్నదానికి సింబల్ గా ఉండేది. సిగరెట్ తాగటం అనేది క్రియేటివ్ మైండ్ కి నిదర్శనం అని భావించేవారు ‘రిలాక్స్‌! హావ్‌ ఏ చార్మినార్‌' అంటూ జాకీ షరాఫ్‌ హుందాగా హోర్డింగుల్లోనూ, పత్రికల్లోనూ కన్పించేవాడు. ఇక సరదాయే సరదా ముగ్గురు నేస్తాలూ కలిస్తే... మీరూ నేనూ ఇంకా బ్యాగ్ పైపర్ అంటూ సునీల్ శెట్టి కనిపిస్తే. "థమ్సప్ ఉరిమే ఉత్సాహం" అంటూ చిరంజీవి అప్పట్లో, "ఏదైనా అదరగొడదాం" అంటూ సూపర్స్టార్ మహేష్ బాబూ కనిపిస్తున్నారు. ఇక ఆ మధ్య పవన్ కల్యాణ్ కూడా పెప్సీకోలా అడ్వర్తజ్మెంట్ లో కనిపించినా తర్వాత వదిలేసాడు. ఇక కళ్యాణ్ జువెల్లర్స్, మనప్పురం అనే పేర్లు వినగానే నాగార్జునా, వెంకీ గుర్తురాక మానరు..

  రమ్మీ ఆడండీ:

  రమ్మీ ఆడండీ:

  ఇక మొన్నటికి మొన్న "రమ్మీ ఆడండీ" అంటూ ఆహ్వానించి రానా, ప్రకాశ్ రాజ్ ఇద్దరూ కేసులో ఇరుక్కున్నారు కూడా‘నేను నమ్మాను, మీరూ నమ్మండి; నేను విన్నాను, స్వయంగా పరీక్షించి చూశాను' వంటి మాటలతో నటీనటులు వినియోగ దారులను ఆకర్షిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా, గ్లామర్‌ కరగముందే, చెదరక ముందే సొమ్ము చేసుకోవా లన్న తాపత్రయం, ఆరాటం చాలామంది నటుల్లో కనిపిస్తోంది. ఒకే నటుడు వివిధ రకాల ఉత్పత్తుల ప్రకటనల్లో కనువిందు చేస్తుండటానికి కారణం ఇదే. సబ్బులు, శీతల పానీయాలు, చెప్పులు వంటి ఐదారు రకాల ఉత్పత్తుల్లో కన్పిస్తూ సందడి చేస్తున్నారు.

  నిర్దిష్ట మార్గదర్శక సూత్రాలు:

  నిర్దిష్ట మార్గదర్శక సూత్రాలు:

  బ్రాండ్‌ అంబాసిడర్లను కూడా వినియోగదారుల పరిరక్షణ చట్టం పరిధిలోకి తేవాలని అఖిల భారత వాణిజ్యవేత్తల సమాఖ్య (సి.ఎ.ఐ.టి.), వినియోగదారుల వ్యవహారాల మంత్రి రాం విలాస్‌ పాశ్వాన్‌ను ఇటీవల డిమాండ్‌ చేసింది. ఉత్పత్తి నాణ్యతతో సంబంధం లేకుండా వీరు ఆమోద ముద్ర వేస్తుండటంతో వినియోగదారులు నష్టపోతున్నారని ఈ సంస్థ పేర్కొంది. బ్రాండ్‌ అంబాసిడర్లు కూడా బాధ్యత వహించేలా చూసేందుకు నిర్దిష్ట మార్గదర్శక సూత్రాలు జారీ చేయాలని సి.ఎ.ఐ.టి. కోరింది.

  సమంజస డిమాండే:

  సమంజస డిమాండే:

  ప్రభుత్వం తగిన చర్య తీసుకోకుంటే కోర్టుకు కూడా వెళతామని హెచ్చరించింది. లక్షలు, కోట్లలో ప్రతిఫలం తీసుకుని ఎడాపెడా హామీలు గుప్పిస్తున్న బ్రాండ్‌ అంబాసిడర్లను వినియోగదారుల చట్టం పరిధిలోకి తేవాలనడం సమంజస డిమాండే. విశాల ప్రజా ప్రయోజనాలకు భంగం వాటిల్లుతున్నపుడు తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం తప్పని సరి అవాల్సిందే అన్న అభిప్ర్యాం వ్యక్తమౌతుంది. అని ఒక సీనియర్ పాత్రికేయులు దినపత్రికలో ప్రచ్రితమైన వ్యాసం లో పేర్కొన్నారు.

  ప్రజా చైతన్య ప్రకటనల్లో:

  ప్రజా చైతన్య ప్రకటనల్లో:

  ప్రజల ఆదరాభిమానాల ఛత్రఛాయల్లో వెలుగొందుతున్న ప్రచార కర్తలైన నటీనటులు ప్రకటనల ఒప్పందాలు కుదుర్చుకునే ముందు సంస్థ చరిత్ర, ఉత్పత్తి నాణ్యత, ఇతర ప్రమాణాలు వంటి అన్ని విషయాలు అవలోకించి ఆచితూచి అడుగువేయాలి. అలాగే సామాజిక బాధ్యతగా తమ వంతుగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజా చైతన్య ప్రకటనల్లో భాగం పంచుకోవాలి.

  సిగరెట్లు మానండి:

  సిగరెట్లు మానండి:

  ‘సిగరెట్లు మానండి, మీ కుటుంబాలను అనాధలను చేయకండి'. ‘తాగి వాహనాలు నడపకండి, కోరి ప్రమాదాలను తెచ్చుకోకండి' అంటూ ప్రకటనల ద్వారా హితవు చెప్తే వారి మాటల ప్రభావం ఎంతో కొంత ఉండక పోతుందా? గ్రామాన్ని దత్తత తీసుకుంటే ఆ గ్రామ వికాసానికే అది పరిమిత మవుతుంది. అందరి బాగును కోరి చెప్పే మంచి మాటల ప్రభావం పదుగురిపై పడుతుంది.

  క‌నీస బాధ్య‌త:

  క‌నీస బాధ్య‌త:

  చిన్న చాక్లెటు నుంచి విమాన ప్ర‌యాణం వ‌ర‌కూ వినియోగ‌దారుల మీద ప్ర‌క‌ట‌న‌ల ప్ర‌భావాన్ని గుప్పిస్తున్నాయి కార్పొరేట్ కంపెనీలు. ఒక్కోసారి నాణ్య‌త క‌న్నా ఈ యాడ్ ప్ర‌భావం వ‌ల్లే పిల్లలు, పెద్ద‌లు స‌ద‌రు వ‌స్తు సేవ‌ల‌పై మ‌ళ్లుతున్నారు. మ‌రి ఇంత ప్ర‌భావవంత‌మైన మాధ్య‌మానికి సెల‌బ్రిటీలు ప‌నిచేస్తున్న‌ప్పుడు వారికి క‌నీస బాధ్య‌త ఉండాల‌ని సామాజిక‌వేత్త‌లు కోరుతున్నారు.

  ఎక్కువ డ‌బ్బు రావ‌డ‌మే:

  ఎక్కువ డ‌బ్బు రావ‌డ‌మే:

  ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో అగ్ర‌శ్రేణి న‌టులు సైతం సినిమాల‌తో స‌మానంగా ప్ర‌క‌ట‌న‌ల‌కు స‌మ‌యం వెచ్చిస్తుండ‌టం బ‌ట్టి చూస్తే అందులో ఎంత ఆదాయం వ‌స్తుందో వెల్ల‌డిస్తోంది. వ్యాపార ప్ర‌క‌ట‌న‌ల్లో త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ డ‌బ్బు రావ‌డ‌మే దీనికి కార‌ణం. నేడు ఆరోగ్య ప‌ర‌మైన ఉత్ప‌త్తుల్లో కూడా విప‌రీత‌మైన ప్ర‌క‌ట‌న‌లు ఉండ‌టం అస‌లు వివాదాల‌కు కార‌ణాలుగా ఉంటుంన్నాయి. ఒక‌వేళ ఆ నాణ్య‌త లేక‌పోతే ఎలా? అనేదే ఇక్క‌డ ప్ర‌శ్న‌. దీంతో సెల‌బ్రిటీలు ఇక‌పై ప్ర‌క‌ట‌న‌లు చేసే ముందు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించ‌క త‌ప్ప‌దేమో.

  10 లక్షల జరిమానా:

  10 లక్షల జరిమానా:

  ఇన్ని రోజులు ప్ర‌క‌ట‌న‌లను ఒక ప్ర‌వృత్తిగా పెట్టుకుని సులువుగా న‌టించిన‌ట్లుగా ఇక‌పై సెల‌బ్రిటీల‌కు కుద‌ర‌క‌పోవ‌చ్చు. ఎందుకంటే ప్రముఖ వ్యక్తులు, సెలబ్రిటీలు న‌టించిన ప్ర‌క‌ట‌న‌ల్లో వినియోగ‌దారుల‌ను త‌ప్పు ప‌ట్టించే అంశాలు ఏవైనా ఉంటే మొదటి సారి 10 లక్షల జరిమానా.. ఏడాది పాటు నిషేధం విధిస్తారట. తర్వాత 50 లక్షల జరిమానా 3 ఏళ్ల నిషేధం వర్తించేలా బిల్లులో మార్పులు చేసి పార్లమెంట్ అనుమతి పొందనుంది కేంద్రం.

  కఠిన నిర్ణయాలు:

  కఠిన నిర్ణయాలు:

  జనాలను తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో కేంద్ర ప్రభుత్వం గతేడాది కఠిన నిర్ణయాలు తీసుకుంటూ.. కన్జూమర్ ప్రొటెక్షన్ బిల్ 2015ను ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా తప్పుడు సమాచారం ఇస్తూ ఆయా ప్రకటనల్లో కనిపించిన వారికి జైలు శిక్ష కూడా విధించే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడీ బిల్లుపై కేంద్రం ఆలోచనలో పడింది. ప్రపంచంలో ఎక్కడా లేనంత కఠినంగా.. జైలు శిక్షలు విధించే బిల్లును ప్రవేశపెట్టడం సరికాదని భావించడంతో.. ఈబిల్లులో కీలకమార్పులను ప్రతిపాదిస్తున్నారు.

  English summary
  In its report on the Consumer Protection Bill 2015, the Parliamentary Standing Committee has suggested fines up to Rs 50 lakh, or even more, and jail terms of five years or more for repeat offenders making false claims about products in advertisements.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more