»   » సినీ నటి వేధింపుల కేసులో ప్రముఖ నటుడు, దర్శకుడి అరెస్ట్..రెండుగంటలపాటు హింస

సినీ నటి వేధింపుల కేసులో ప్రముఖ నటుడు, దర్శకుడి అరెస్ట్..రెండుగంటలపాటు హింస

Written By:
Subscribe to Filmibeat Telugu

మలయాళ నటిపై లైంగికదాడియత్నం, కిడ్నాప్ కేసులో సూపర్ స్టార్ దిలీప్‌, ప్రముఖ దర్శకుడు నాదిర్ షాను కేరళ పోలీసుల అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. దిలీప్‌ను సోమవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మలయాళ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ప్రముఖ మలయాళ హీరో దిలీప్‌ అరెస్ట్‌ అయ్యారు. ప్రముఖ నటిపై అత్యాచారయత్నం, కిడ్నాప్‌ కేసులో దిలీప్‌ నిందితుడిగా ఉన్నారు. ఆయనను సోమవారం సాయంత్రం కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి తన వాహనంలో వెళ్తున్న బాధిత నటిని కొందరు అడ్డగించి ఆమె కారులోనే రెండు గంటలపాటు లైంగికంగా వేధించారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్‌ను కొందరు కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి ఏం జరిగిందంటే..

ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి ఏం జరిగిందంటే..

కేరళలోని త్రిచూర్‌కు సమీపంలోని పత్తురైక్కల్‌లో షూటింగ్‌ ముగించుకొని హీరోయిన్ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కొచ్చి సమీపంలోని పనంపిల్లీ నగర్‌లోని తన స్నేహితురాలి ఇంటికి ఆమె బయలుదేరింది. సినీ నటి కారులో ప్రయాణిస్తుండగానే డ్రైవర్‌ మార్టిన్‌ కొందరికి ఎస్సెమ్మెస్‌లు పంపడంతో పల్సర్ సునీ గ్యాంగ్ తమ వ్యానులో వెంటాడింది. ఎస్సెమ్మెస్‌లు పంపాడు. మార్టిన్‌ ఇచ్చిన సమాచారంతో పల్సర్‌ సుని గ్యాంగ్‌ క్యాటరింగ్‌ వ్యాన్‌లో ఆమెను వెంటాడింది.

సినీ నటిని దారుణంగా హింసించారు.

సినీ నటిని దారుణంగా హింసించారు.

ఉద్దేశపూర్వకంగా రాత్రి 8.30 గంటల సమయంలో నెదుంబసరీ ఎయిర్‌పోర్ట్‌ జంక్షన్‌లో ఆమె వావానాన్ని ఆ కిరాయిమూక తమ వ్యాన్‌తో ఢీకొట్టింది. నటి కారు ఆగగానే.. ఇద్దరు నిందితులు (ఏ-2, ఏ-3) ఆమె కారులోకి చొరబడి.. తమ చేతులతో ఆమె నోటిని మూసేశారు. కేకలు వేయొద్దంటూ ఆమెను బెదిరించారు. ఆమె ఫోన్‌ను బలవంతంగా లాక్కున్నారు. ఆ కారు కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఏ-3 నిందితుడు కలంసెరీ వద్ద కారులోంచి దిగిపోయాడు.

రెండు గంటలు వేధించి..

రెండు గంటలు వేధించి..

ఆ తర్వాత ప్రధాన నిందితుడు పల్సర్‌ సుని రంగంలోకి దిగాడు. పల్సర్‌ సుని అక్కడి నుంచి వాహనాన్ని కక్కనాడ్‌కు తీసుకెళ్లి.. అక్కడ నటిని లైంగికంగా వేధించాడు. అశ్లీలంగా, అసభ్యంగా వీడియోలు, ఫొటోలు తీశాడు. సహకరించకపోతే చంపుతామని బెదిరించారు. ఈ దారుణం దాదాపు రెండున్నర గంటలపాటు ఈ అమానుషం కొనసాగింది. అనంతరం ఆమెను కక్కనాడ్‌ సమీపంలోని పాదముద్గల్‌ వద్ద కారులోంచి బయటకు పొదల్లోకి తోసివేశారు.

తాజాగా ఆడియో టేపులతో ..

తాజాగా ఆడియో టేపులతో ..

సినీ నటి లైంగికదాడి, కిడ్నాప్ కేసు ముగుస్తుందని భావిస్తుండగా, ఈ కేసుకు సంబంధించిన ఆడియో టేపులు బయటపడటంతో మరోసారి ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు పల్సర్ సునీ, డ్రైవర్ మార్టిన్ గతంలోనే అదుపులోకి తీసుకొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన వెనుక సినీ ప్రముఖుల హస్తం ఉందనే ఆరోపణలు తలెత్తాయి.

దిలీప్ పాత్ర ఉన్నట్టు..

దిలీప్ పాత్ర ఉన్నట్టు..


ఫిబ్రవరిలో చోటుచేసుకొన్న కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించిన ఆడియో టేప్ ఒకటి బయటపడటంతో ఈ కేసును కేరళ పోలీసులు తిరగతోడిన సంగతి తెలిసిందే. తాజా టేపుల్లో ప్రముఖ దర్శకుడు నాదిర్ షాను మధ్యవర్తిత్వం జరుపాలని ఓ వ్యక్తి ఫోన్ చేశాడనే విషయం ఆడియో టేపుల్లో స్పష్టమైంది. దీంతో మలయాళ సూపర్ స్టార్ దిలీప్, దర్శకుడు నాదిర్ షా, పల్సర్ సునీలను కొద్ది రోజుల క్రితం విచారించారు.

గంటలకొద్ది విచారణ

గంటలకొద్ది విచారణ

తాజా ఆడియో టేపులు బయటపడిన తర్వాత మరోసారి కేసు విచారణ వేగం పుంజుకొన్నది. నటుడు దిలీప్, దర్శకుడు నాదిర్ షాను దాదాపు 13 గంటలపాటు విచారించారు. కేసు సంబంధించిన సమాచారాన్ని వారి నుంచి అడిగి తెలుసుకొన్నట్టు తెలుస్తున్నది. భావన కిడ్నాప్‌కు సంబంధించిన వ్యవహారంలో పల్సర్ సుని నుంచి దిలీప్ కాల్ వెళ్లిందా? ఆ కాల్‌ను దిలీప్ రిసీవ్ చేసుకొన్నాడా? ఒకవేళ మాట్లాడితే వారి మధ్య సంభాషణ ఏం జరిగింది అనే కోణంలో కేసును విచారించారు.

పక్కా ఆధారాలతో అరెస్ట్

పక్కా ఆధారాలతో అరెస్ట్

వ్యక్తిగత కక్షతోనే నటిని కిడ్నాప్‌ చేయించి.. వేధించేందుకు ఆయన కుట్ర పన్నారనే ఆరోపణలకు ఆధారాలు లభించాయి. విచారణలో అనేక విషయాలను పరిశీలించిన పిదప సూపర్ స్టార్ దిలీప్‌ను సోమవారం అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో దిలీప్‌ను అరెస్టు చేయడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది.

కీలకంగా మారిన దిలీప్ అరెస్ట్

కీలకంగా మారిన దిలీప్ అరెస్ట్

ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన పల్సర్‌ సుని అనే వ్యక్తిని, నటి వాహనం డ్రైవర్‌ మార్టిన్‌తోపాటు మొత్తం ఆరుగురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వెనుక పలువురు సినీ పెద్దల హస్తముందని గతంలోనే కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మలయాళ ప్రముఖ హీరోల్లో ఒకరిగా ఉన్న దిలీప్‌ను రెండువారాల కిందట పోలీసులు 12 గంటలపాటు విచారించారు. వ్యక్తిగత కక్షతోనే నటిని కిడ్నాప్‌ చేయించి.. వేధించేందుకు ఆయన కుట్ర పన్నినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దిలీప్‌, నాదిర్ షాను అరెస్టు చేయడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది.

English summary
Popular Malayalam actor Dileep and his close friend-producer Nadirshah were arrested in Kerala on Monday evening, with the Kerala police claiming that they have received conclusive proof linking them to the actress abduction case.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu