»   » అంజలి సోదరి ఈవిడే, హీరో జైతో ప్రేమ-పెళ్లి విషయమై తేల్చేసింది (ఫోటోస్)

అంజలి సోదరి ఈవిడే, హీరో జైతో ప్రేమ-పెళ్లి విషయమై తేల్చేసింది (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం చిత్రాంగద. తమిళంలో యార్నీ పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 10న విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్ లో మీడియా మీట్ ఏర్పాటు చేసారు. ఇక్కడ అంజలికి 'చిత్రాంగద' సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. తమిళ హీరో జైతో అంజలి ప్రేమాయణం గురించి అంజలి స్పందించక తప్పలేదు.

ఇప్పుడే ఏమీ చెప్పలేను అంటున్న అంజలి

ఇప్పుడే ఏమీ చెప్పలేను అంటున్న అంజలి

తమిళ హీరో జైతో మీరు లవ్ రిలేషన్ షిప్ లో ఉంటున్నట్లు, త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు చెబుతున్నారు, ఇందులో నిజం ఎంత? అనే ప్రశ్నకు అంజలి స్పందిస్తూ.... ఇప్పుడే నేను ఏ విషయం చెప్పలేను, ఇప్పుడే పెల్లి చేసుకోవాలనే ఆలోచన లేదు, ప్రస్తుతం సినిమా అవకాశాలు బావున్నాయి, నా దృష్టంతా వాటి మీదే ఉంది అని అంజలి తెలిపారు.

జైతో ప్రేమాయణం నిజమే

జైతో ప్రేమాయణం నిజమే

ఇప్పుడే పెళ్లి ఆలోచన లేదు అని చెప్పినప్పటికీ...జైతో ప్రేమాయణం గురించి ఖండించలేదు అంజలి. ప్రస్తుతం ఇద్దరూ డేటింగులో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఆ మధ్య జై కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసారు. జై చెప్పిన వివరాల కోసం క్లిక్ చేయండి.

అంజలి సోదరి ఈవిడే

అంజలి సోదరి ఈవిడే

అజంలి లవ్ మేటర్ పక్కన పెడితే... హైదరాబాద్ లో జరిగిన చిత్రంగద మూవీ ప్రి రిలీజ్ ఫంక్షన్ కు స్వయంగా అంజలి సోదరి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆమె ఎన్టీవీలో యాంకర్ గా కూడా పని చేస్తున్నారు.

చిత్రాంగద

చిత్రాంగద

చిత్రంగద సినిమా వివరాల్లోకి శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ పతాకంపై గంగపట్నం శ్రీధర్, రెహమాన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మార్చి 10న విడుద‌ల‌వుతోంది.

సినిమా గురించి అంజలి

సినిమా గురించి అంజలి

అంజ‌లి మాట్లాడుతూ - ``సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు నంది అవార్డు వ‌చ్చినందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి థాంక్స్‌. గీతాంజ‌లి త‌ర్వాత నేను న‌టించిన హీరోయిన్ సెంట్రిక్ మూవీ చిత్రాంగ‌ద‌. నాకు ప‌ర్స‌న‌ల్‌గా చాలా ఇష్టమైన సినిమా. సినిమా కోసం హార్డ్ వ‌ర్క్‌చేశాను. నా గ‌త చిత్రాల‌కు భిన్నంగా ఉండే సినిమా. అశోక్ గారు సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. అంద‌రికీ న‌చ్చేలా సినిమా ఉంటుంది`` అన్నారు.

డైరెక్టర్

డైరెక్టర్

దర్శకుడు జి.అశోక్ మాట్లాడుతూ - ``అంజ‌లి మెయిన్ లీడ్ చేసిన చిత్రాంగ‌ద‌లో అంజ‌లి చాలా డేర్‌తో న‌టించింది. హార‌ర్‌, కామెడి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. అమెరికాలో క్లిష్ట‌మైన వాతావ‌ర‌ణ పరిస్థితుల్లో మంచి లోకేష‌న్స్‌లో సినిమాను తీశాం. స‌ప్త‌గిరి మెయిన్ క‌మెడియ‌న్‌గా న‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని కాన్సెప్ట్‌. చిత్రాంగ‌ద త‌న‌కు మ‌రో హిట్ చిత్రంగా నిలుస్తుంది`` అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ

నిర్మాత మాట్లాడుతూ

నిర్మాత మల్కాపురం శివ‌కుమార్ మాట్లాడుతూ - ``గీతాంజ‌లి వంటి ఉమెన్ సెంట్రిక్ మూవీలో న‌టించిన అంజ‌లి. అంత కంటే ఎక్కువ క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా చిత్రాంగ‌ద‌. స‌ప్త‌గిరి ఈ సినిమాలో డిఫ‌రెంట్ పెర్‌ఫార్మెన్స్‌తో మంచి కామెడిని పండించారు. అశోక్‌గారు సినిమాను చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించారు. మార్చి 10న సినిమా విడుద‌ల‌వుతుంది. సినిమాపై న‌మ్మ‌కంతో డిస్ట్రిబ్యూట‌ర్స్, ఎగ్జిబిట‌ర్స్‌ సినిమాను విడుద‌ల చేయ‌డానికి ముందుకు వ‌చ్చారు.` అన్నారు.

English summary
When asked about opening up her relationship with Jai, Anjali turned diplomatic and told Gulte, "I have not confirmed anything." On questioning whether she will confirm soon, she remained silent.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu