»   » హీరోయిన్ అంజలితో లవ్... అఫీషియల్‍‌గా ప్రకటించిన హీరో, పెళ్లి ఎప్పుడంటే?

హీరోయిన్ అంజలితో లవ్... అఫీషియల్‍‌గా ప్రకటించిన హీరో, పెళ్లి ఎప్పుడంటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: హీరోయిన్ అంజలి, తమిళ హీరో జై మధ్య కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే అప్పటి వరకు రహస్యంగా, చాటు మాటుగా యవ్వారం సాగించిన ఈ ఇద్దరు ఇటీవల దోశ చాలెంజ్ సందర్భంగా ఓపెన్ అయిపోయారు.

తాజాగా జై స్వయంగా అంజలితో ప్రేమలో ఉన్న విషయాన్ని అంగీకరించారు. జై, అంజలి జంటగా నటించిన 'బెలూన్' చిత్రం ప్రమోషన్స్ సందర్బంగా వీరి ప్రేమ విషయాన్ని పాత్రికేయులు ప్రస్తావించారు. వారి ప్రశ్నలపై జై పాజిటివ్ గా స్పందించారు.

ఇద్దరి మధ్య చాలా కాలం నుండి మంచి స్నేహం ఉందని, అంజలి అంటే తనకు చాలా ఇష్టమని, అంజలికి కూడా తానంటే ఇష్టమని జై చెప్పుకొచ్చారు. ఎంగేయుమ్ ఎప్పోదుమ్(తెలుగులో 'జర్నీ') సమయంలోనే తమ స్నేహం మొదలైందని జై తెలిపారు.

అజంలి అలాంటిది కాదు

అజంలి అలాంటిది కాదు

జర్నీ సినిమాలో అంజలి తనను మాటి మాటికి కొడుతూ ఉంటుంది... కానీ రియల్ లైఫ్ లో అంజలి అలా ఉండదని, ఆమె చాలా మెత్తనైన మనసున్న వ్యక్తి అని జై చెప్పుకొచ్చారు. ఒకవేళ అంజలికి కోపం వస్తే జోక్స్ వేసి నవ్విస్తాను అని జై తెలిపారు.

జై ఫ్యామిలీతో అంజలి అనుబంధం

జై ఫ్యామిలీతో అంజలి అనుబంధం

జైతో మాత్రమే కాదు... జై ఫ్యామిలీకి కూడా అంజలి చాలా క్లోజ్. అంజలి చేసే వంట అంటే జై తండ్రికి చాలా ఇష్టమట. జై ముగ్గురు సిస్టర్స్ తో కూడా ఆమె చాలా క్లోజ్ గా ఉంటుంది. ఈ విషయాన్ని జై స్వయంగా వెల్లడించారు.

పెళ్లి ఎప్పుడు అంటే?

పెళ్లి ఎప్పుడు అంటే?

పెళ్లి గురించి ఇంకా ఆలోచించలేదని... ఇండస్ట్రీలో తమకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారని, ఆ ముగ్గురి పెళ్లిళ్లయ్యాక తమ పెళ్లి గురించి ఆలోచిస్తామని జై తెలిపారు. అంజలి, జై ఇద్దరూ పెళ్లి కంటే ప్రొఫెషనల్ గా ఎదిగేందుకే ఆసక్తి చూపుతున్నట్లు స్పష్టమవుతోంది.

దోశ సాక్షిగా...: అతడితో హీరోయిన్ అంజలి లవ్

దోశ సాక్షిగా...: అతడితో హీరోయిన్ అంజలి లవ్

అంజలి, జై ప్రేమాయణం దోశ చాలెంజ్ వల్ల అందరికీ తెలిసిపోయింది. ఈ దోశ చాలెంజ్ ఏమిటి, దానికి వెనక ఉన్న కథేమిటి? ఫోటోలు, వివరాల కోసం క్లిక్ చేయండి.

లవ్ ప్రపోజల్స్, అతడితో రిలేషన్, కారు గిఫ్టు‌పై హీరోయిన్ అంజలి స్పందన!

లవ్ ప్రపోజల్స్, అతడితో రిలేషన్, కారు గిఫ్టు‌పై హీరోయిన్ అంజలి స్పందన!

లవ్ ప్రపోజల్స్, కారు గిఫ్టు‌పై హీరోయిన్ అంజలి స్పందించారు. అంజలి అప్పట్లో బిఎండబ్ల్యూ కారు కొనుక్కోవడం హాట్ టాపిక్ అయింది. ఆ కారు ఆమె కొన్నది కాదని, ఎవరో గిఫ్టుగా ఇచ్చారనే ప్రచారం జరిగింది... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Tamil actor Jai confirms his love effair with telugu actress Anjali. Jai confirmed that he liked Anjali ever since he met her at the sets of engaeyum eppothum.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu