For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అంజలి క్యారెక్టర్‌పై వ్యాఖ్యలు, గొడవల వెనక అసలు స్టోరీ!

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగి పలు అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్ అంజలి ఉన్నట్టుండి వివాదంతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన సంగతి తెలిసిందే.

  ఇన్నాళ్లు తనకు తల్లిగా ప్రపంచానికి పరిచయం ఉన్న భారతీ దేవి తన తల్లి కాదని, ఆమె తన పిన్ని అని, దర్శకుడు కళంజియంతో కలిసి పిన్ని తనను వేధిస్తోందని, తనను డబ్బు సంపాదించే యంత్రంగా చూస్తున్నారని, తాను కరెంట్ షాకకొట్టి అనారోగ్యానికి గురైనా షూటింగులకు వెళ్లి డబ్బు సంపాదించాలని హింసిస్తున్నారని అంజలి మీడియా ముందు సంచలన ఆరోపణలు చేసారు.

  అంజలి ఆరోపణలతో ఖంగుతిన్న దర్శకుడు కళంజియం ఆమె తన పరువు తీసిందంటూ చెన్నై పోలీస్ కమీషనర్‌కు ఫిర్యాదు చేసారు. అంజలి క్యారెక్టర్ మంచిది కాదని, పబ్బులు, పార్టీలకు తిరగడం అలవాటయిందని, ఆమె శ్రేయోలాభిషిగా పద్దతి మార్చుకోవాలని మందలించినందుకే తనపై ఇలాంటి ఆరోపణలు చేసిందన ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు కళంజియం.

  అయితే చెన్నై ఫిల్మ్ సర్క్యూట్‌‍తో వినిపిస్తున్న వార్తలు మరోలా ఉన్నాయి. దర్శకుడు కళంజియం ద్వారా అంజలి తమిళ సినిమాలకు పరిచయం అయినప్పటికీ ఆ తర్వాత అతని వ్యవహార శైలి నచ్చక అతనికి దూరంగా ఉంటూ వచ్చిందని, అయితే కళంజియం భారతీదేవికి సలహాలు ఇచ్చేవాడని, ఆ సలహాలను భారతీదేవి ఇష్టం లేకన్నా అంజలిపై రుద్దేదని... ఈ క్రమంలోనే అంజలి తీవ్ర మనస్థాపానికి గురయ్యేదని టాక్.

  అంజలి తమిళనాడు వదలి హైదరాబాద్ రావడానికి కారణం కూడా భారతీదేవి, కళంజియం అనే వాదన బలంగా వినిపిస్తోంది. కళంజియం తానే హీరోగా ఓ తమిళ సినిమాను మొదలు పెట్టాడని, ఇందులో తన పక్కన అంజలిని హీరోయిన్‌గా నటించాలని ఒత్తిడి తెస్తున్నాడని, భారతీ దేవి కూడా ఇదే విషయమై ఆమెపై ఒత్తిడి తెచ్చేదని, కళంజియంతో కలిసి నటించడం ఇష్టం లేకనే అంజలి హైదరాబాద్ వచ్చినట్లు చర్చించుకుంటున్నారు.

  మిగతా వివరాలు స్లైడ్ షోలో...

  ఈ క్రమంలో అంజలికి వేధింపులు ఎక్కువ అయ్యాయని సమచారం.

  ఇంత కాలం తను సినిమాల్లో నటించి కష్టపడి డబ్బు సంపాదిస్తే లగ్జరీగా బ్రతికిన భారతీదేవి ఇప్పుడు తనను వేధించడం మొదలు పెట్టడంతో తట్టుకోలేక పోయిన అంజలి ఆమెతో తెగదెంపులు చేసుకుందని టాక్.

  ఈ క్రమంలో ఆమె నిన్న మీడియా ముందుకు వచ్చి తన గోడును వెల్లబోసుకున్నట్లు సమచారం.

  అయితే ప్రస్తుతం అంజలి అదృశ్యం కావడం వెనక మిస్టరీ మాత్రం వీడటం లేదు.

  ఆమె అదృశ్యం వెనక భారతీ దేవి హస్తం ఉందని ఆరోపిస్తూ ఆమె సోదరుడు రవిశంకర్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు.

  మరో వైపు అంజలి కావాలనే అజ్ఞాతంలోకి వెళ్లిందనే వాదన కూడా లేక పోలేదు. ఆమె రేపు జరుగబోయే బోల్ బచ్చన్ రీమేక్ షూటింగుకు హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

  ఏది ఏమైనా అదృశ్యమైన అంజలి మళ్లీ మీడియా ముందుకు వస్తే గానీ పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు.

  English summary
  Anjali has given a twist to her controversial harassment story as the actress is missing from Monday (April 8). Well, from yesterday morning the actress is untraceable, which has raised questions over her family's hand in the missing case. The actress had informed on Monday in Hyderabad that she was being harassed by her step-mother Bharathi Devi and director Kalanjiyam. But soon after that Anjali is not seen anywhere and even she could not be reached over phone. She was in Hyderabad to take part in shooting of her forthcoming Telugu project. Anjali was accompanied by her uncle, as per reports circulating on the internet. It has to be noted that the actress had claimed that her life is under threat and she would not come to Chennai soon. On the other end, Anjali's brother Ravi Shankar has said that he is ready to file a formal complaint.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X