»   » అనుష్క పెళ్లి ప్రయత్నాల జోరు.. పూజలు అందుకోసమేనా?

అనుష్క పెళ్లి ప్రయత్నాల జోరు.. పూజలు అందుకోసమేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి2 రిలీజ్ తర్వాత గతంలో ముందెన్నడూ లేని విధంగా దేవసేన అనుష్క పెళ్లి వార్తలు జోరందుకొన్నాయి. ప్రభాస్‌, అనుష్క పెళ్లి చేసుకొంటున్నారని ఓ వార్త, నిర్మాతతో అతిచనువుగా ఉంటుందని మరో వార్త మీడియాలో గుప్పుమన్నాయి. ఆ వార్తలన్నీ పక్కనపెడితే ప్రస్తుతం అనుష్క పెళ్లిపై వారి తల్లిదండ్రులు సీరియస్‌గా దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు అనుష్కతోపాటు ఆమె కుటుంబ సభ్యులు కర్ణాటకలోని ఓ ఆలయంలో ఇటీవల పూజలు నిర్వర్తించారు. అనుష్క ఏ పూజలు నిర్వహించిందో ఏమో కానీ.. పెళ్లి కోసమే నిర్వర్తించిందనే రూమర్ విస్తృతంగా ప్రచారమవుతున్నది.

మూకాంబికా గుడికి..

మూకాంబికా గుడికి..

అనుష్క శుక్రవారం సాయంత్రం కర్ణాటకలోని కొల్లూర్‌లో గల మూకాంబిక గుడికి తన కుటుంబ సభ్యులతో కలసి వెళ్లారు. హంగు, ఆర్భాటం లేకుండా సాధారణ భక్తుల మాదిరిగానే పూజలు నిర్వహించారు. వీఐపీ సందర్శకుల మాదిరిగా కాకుండా సాధారణ భక్తుల మాదిరిగానే క్యూ లైనులోనే వెళ్లి అమ్మవారిని దర్శించుకొన్నారు. ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత పూజారులు అనుష్క కుటుంబ సభ్యులకు స్వాగతం పలికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా అనుష్క బెంగళూరులోని ఇంటికి చేరుకున్నారు.


అనుష్క తండ్రి ఖండన..

అనుష్క తండ్రి ఖండన..

అనుష్క పెళ్లి కోసం పూజలు నిర్వహించందంటూ వస్తున్న వార్తలను అనుష్క తండ్రి విఠల్ శెట్టి ఖండించారు. అనుష్కకు అమ్మవారి భక్తి ఎక్కువ. రజనీకాంత్‌ ‘లింగ' షూటింగ్‌ సమయంలోనూ మూకాంబిక గుడికి వెళ్లింది. ఇప్పుడు‘బాహుబలి' సక్సెస్‌ అయిన సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంది అని అనుష్క తండ్రి విఠల్‌ పేర్కొన్నారు. మంగుళూరులోని బప్పనాడు దుర్గాపరమేశ్వరీ ఆలయాన్ని కూడా ఇటీవల అనుష్క సందర్శించారు.


సాహోలో ప్రభాస్‌తో..

సాహోలో ప్రభాస్‌తో..

వరుస హిట్లతో దూసుకెళ్లూ కెరీర్‌ పీక్‌లో ఉన్న అనుష్క ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోకపోవచ్చదనేది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం. ప్రస్తుతం ఓ చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నది. అంతేకాకుండా సాహో సినిమాలో ప్రభాస్ పక్కన నటించే అవకాశం కొట్టేసినట్టు తెలుస్తున్నది. ఒకవేళ్ల పెళ్లికి ప్రయత్నాలు చేస్తుంటే సాహో లాంటి చిత్రాలు అంగీకరించదనేది కొందరి వాదన. బాహుబలి తర్వాత బాలీవుడ్ నుంచి అవకాశాలు కుప్పలుతెప్పలుగా వస్తున్నట్టు తెలుస్తున్నది.


పెదవి విప్పని అనుష్క

పెదవి విప్పని అనుష్క

కెరీర్‌ గ్రాఫ్‌ ఎదురులేకుండా దూసుకుపోతున్న సమయంలో వస్తున్న వార్తలపై అనుష్క పెదవి విప్పడం లేదు. ఇటీవల నిర్వహిస్తున్న పూజలు పెళ్లి కోసమేనా లేక గతంలో మొక్కుల కోసం చెల్లించుకొన్నదా అనే విషయం అనుష్క స్వయంగా చెప్తేగాని ఇలాంటి వార్తలకు పుల్‌స్టాప్ పడదు. ఈ వ్యవహారంపై అనుష్క స్పందిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.English summary
After Baahubali2 release, Anushka Marriage Rumours become viral in the media. some reports suggest that Anushka, Prabhas are getting marriage is become sensational. In this occassion Anushka went Mookambika temple with her family members. spent sometime for prayers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu