»   » మగబిడ్డకు జన్మనిచ్చిన ‘సూపర్’ హీరోయిన్

మగబిడ్డకు జన్మనిచ్చిన ‘సూపర్’ హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: నాగార్జున హీరోగా వచ్చిన 'సూపర్' చిత్రంలో నటించిన ఆయేషా టకియా గుర్తుందా?...ఆ సినిమా తర్వాత మరే తెలుగు చిత్రంలోనూ ఆమె నటించలేదు. పలు బాలీవుడ్ ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయింది. ఆ తర్వాత 2009లో ఫర్హాన్ అజ్మీని పెళ్లాడింది. ఈ దంపతులు ఇపుడు ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఆయేషా టకియా భర్త ఈ విషయాన్ని ట్విట్టర్లో పోస్టు చేస్తూ....'అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్...మగ బిడ్డ జిన్మించాడు' అంటూ ట్వీట్ చేసాడు. ఆయేషా టకియా తన ట్విట్టర్లో...'మేమూ మా కుమాడు అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాం' అంటూ తన ట్విట్టర్ పేజీలో పేర్కొంది.

Actress Ayesha Takia Gives Birth To Baby Boy!

గతంలో ఆయేషా టకియా గర్భవతైనట్లు రూమర్లు వినిపించాయి. అయితే అలాంటి వార్తలు వినిపించిన ప్రతి సారి ఆయేషా ఖండిస్తూ వచ్చింది. ఈ కారణంగానే కాబోలు...అసలు ఆయేషా గర్భవతైన విషయం కూడా ఇప్పటి వరకు బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచారు కుటుంబ సభ్యులు. బిడ్డ జన్మించిన తర్వాత విషయం బయటకు వెల్లడించారు.

ఆయేషా టకియా, రెస్టారెంట్ ఓనర్ ఫర్హాన్ అజ్మి వివాహం మార్చి1, 2009లో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. తెలుగులో ఆమె 'సూపర్' సినిమాతో పాటు టార్జాన్, వండర్ కార్, వాంటెడ్‌తో పాటు అనేక చిత్రాల్లో నటించింది. బిడ్డ పుట్టిన తర్వాత ఆయేషా దంపతులు చాలా ఆనందంగా ఉన్నారు.

English summary
Bollywood's sensational actress Ayesha Takia reportedly gave birth to a baby boy last week. This is Ayesha's first child with her husband Farhan Azmi. The couple took to the Twitter to announce the good news.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu