»   » చిరు 150వ మూవీ గొడవ: కేథరిన్ మాటల్లో ఆంతర్యం ఏమిటి?

చిరు 150వ మూవీ గొడవ: కేథరిన్ మాటల్లో ఆంతర్యం ఏమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి ల్యాండ్ మార్క్ మూవీ 'ఖైదీ నెం.150' చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ కెరీర్లోనే ఈ చిత్రం అతిపెద్ద హిట్. ఇలాంటి సినిమాలో నటించే అవకాశం దక్కడమే గొప్ప అనుకుంటే..... ఇందులో అవకాశం దక్కించుకుని మధ్యలో ఓ చిన్న గొడవ కారణంగా తప్పుకునే పరిస్థితి తెచ్చుకుంది హీరోయిన్ క్యాథరిన్.

చిరంజీవి 150వ సినిమాలో క్యాథరిన్‌ను ఐటం సాంగు కోసం తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు కాస్టూమ్ డిజైనర్‌గా పని చేసిన చిరంజీవి కూతురు సుష్మితతో ఆమెకు ఏవో విబేధాలు వచ్చాయని, ఆ కారణంగానే క్యాథరిన్ తప్పుకోవాల్సి వచ్చిందని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి.

తెలివిగా స్పందించిన క్యాథరిన్

తెలివిగా స్పందించిన క్యాథరిన్

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోయిన క్యాథరిన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ అంశానికి సంబంధించి ఓ ప్రశ్న ఎదురవ్వగా తెలివిగా స్పందించారు. ఈ విషయంలో నేను ఏమీ మాట్లాడదలుచుకోలేదు. దీని గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, నేను ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో వాళ్లనే(ఖైదీ నెం.150 టీం) అడగంటి అంటూ సమాధానం ఇచ్చింది.

Khaidi no 150 talkie part wraps up | Chiranjeevi | Telugu Filmibeat
క్యాథరిన్ మాటల్లో అర్థం ఏమిటి?

క్యాథరిన్ మాటల్లో అర్థం ఏమిటి?

పై విధంగా వ్యాఖ్యానించడం ద్వారా ఆ సినిమా నుండి తప్పుకోవడంలో తన తప్పేమీ లేదని చెప్పకనే చెప్పింది క్యాథరిన్. మరి ఆమె మాటలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? తప్పంతా 150వ సినిమా యూనిట్ సభ్యులదేనా?

చిరు కూతురుతో విబేధాలను ఖండించలేదు

చిరు కూతురుతో విబేధాలను ఖండించలేదు

మీరు చిరంజీవి కూతురుతో కాస్టూమ్స్ విషయంలో గొడవ పడ్డారా? అనే అంశంపై ప్రశ్నించినపుడు క్యాథరిన్ ఆ విషయాన్ని ఖండించడం కానీ, సమర్ధించడం కానీ చేయకుండా సైలెంటుగా ఉండిపోయారట. కాస్టూమ్స్ విషయంలో గొడవ జరిగిందనే విషయాన్ని క్యాథిరన్ ఖండించలేదు కాబట్టి అది నిజమే అని చాలా మంది భావన.

మూవీస్

మూవీస్

క్యాథరిన్ ప్రస్తుతం తెలుగులో మంచి జోరుమీద ఉంది. ఆమె నటించిన ‘గౌతమ్ నందా' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలే సాధిస్తోంది. ఆమె నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి', ‘జయ జానకి నాయక' సినిమాలు ఈ నెల 11న విడుదలవుతున్నాయి.

English summary
Actress Catherine responds on Khaidi No. 150 issueWhen Catherine was asked the same, she responded saying, "I have nothing to say. Only they should talk about that matter."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu