»   » ప్రేమ మోసం: సినీ నటిని గర్భవతిని చేసిన బిటెక్ బాబు అరెస్ట్!

ప్రేమ మోసం: సినీ నటిని గర్భవతిని చేసిన బిటెక్ బాబు అరెస్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రేమ పేరుతో ఓ సినీనటిని నమ్మించి మోసం చేసి, ఆమెను గర్భవతిని చేసిన బిటెక్ విద్యార్థి చివరకు కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన ఇపుడు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చర్చనీయాంశం అయింది.

తెలుగు సినిమా పరిశ్రమలో నటిగా ఇప్పుడిప్పుడే అవకాశాలు అందిపుచ్చుకుంటున్న సదరు నటికి యశ్వంత్ కుమార్ అనే బీటెక్ విద్యార్థితో ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.

కొంతకాలంగా సహజీవనం

కొంతకాలంగా సహజీవనం

ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో సదరు నటి యశ్వంత్ కుమార్ తో కలిసి సహజీవనానికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఇద్దరూ కొంతకాలంగా హైదరాబాద్ ఫిల్మ్ నగర్ సమీపంలోని రహ్మత్ నగర్లో ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు.

పసుపుతాడు కట్టి, నమ్మించి..

పసుపుతాడు కట్టి, నమ్మించి..

నటిని శారీరకంగా లొంగదీసుకోవడానికి గత డిసెంబర్ 2న పసుపుతాడు కట్టి పెళ్లి చేసుకున్నట్లు నమ్మించాడు. కొన్ని రోజుల తర్వాత పెద్దలను ఒప్పిస్తానని నమ్మించాడు.

గర్భం, అబార్షన్

గర్భం, అబార్షన్

యశ్వంత్ కుమార్ మూలంగా సదరు నటి గర్భం దాల్చడంతో ఇటీవలే ఆమెకు అబార్షన్ చేయించాడు. తనను చట్టబద్దంగా పెళ్లి చేసుకోవాలని సదరు నటి ఒత్తిడి తేవడంతో తన అసలు రూపం బయట పెట్టాడు. పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని చెప్పినట్లు సమాచారం.

పోలీసులకు ఫిర్యాదు

పోలీసులకు ఫిర్యాదు

యశ్వంత్ చేతిలో తాను మోసపోయానని రియలైజ్ అయిన నటి...జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో బిటెక్ విద్యార్థి యశ్వంత్ ను అరెస్టు చేసారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని సదరు నటి కోరుతోంది.

English summary
Tollywood Actress and dubbing artist cheated by Btech student in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu