twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Elnaaz Norouzi నగ్నంగా మారిన నటి.. దుస్తులను ఒక్కొక్కటిగా విప్పేసి నిరసన.. ఎందుకోసమంటే? (వీడియో)

    |

    బుర్ఖాతోపాటు తలకు వస్త్రం (హిజబ్) ధరించాలనే నిబంధనను వ్యతిరేకిస్తూ ఇరాన్‌ నటి ఎల్నాజ్ నరౌజీ నగ్నంగా నిరసన వ్యక్తం చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. నా దేహం.. నా ఇష్టం అంటూ హిజబ్ వ్యతిరేక నిరసనకు మద్దతు తెలిపింది. ఇన్స్‌టాగ్రామ్‌లో తన నిరసనను వ్యక్తం చేస్తూ.. తన దుస్తులను తొలగించి నగ్నంగా మారింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఎల్నాజ్ నరౌజీ నగ్నంగా మారడం వెనుక అసలు వివాదం ఏమిటంటే?

    ఇరాన్‌లో హిజబ్ చట్టంపై నిరసన

    ఇరాన్‌లో హిజబ్ చట్టంపై నిరసన

    ఇరాన్‌లో ఇటీవల మోరల్ పోలీసుల దాడిలో యువతి మరణించడం అనేక నిరసనలకు దారి తీసింది. ఇరాన్‌లో బలవంతంగా అమలు చేస్తున్న హిజబ్‌ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు నిరసన వ్యక్తం చేశారు. తమ తలకు చుట్టుకొన్న క్లాత్‌ను తొలగించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోరల్ పోలీసులు చేసిన దాడిలో మాహ్సా అమిని అనే 22 ఏళ్ల అమ్మాయి మరణించింది. ఈ ఘటనపై ఎల్నాజ్ నోరౌజీ తీవ్రంగా స్పందించింది.

    ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నా

    ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నా


    ఇరాన్‌లో పరిస్థితిపై ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎల్నాజ్ నరౌజీ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. హిజబ్ చట్టాన్ని వ్యతిరేకించే నిరసనకారులపై పోలీసుల దుశ్చర్య దారుణంగా ఉంది. ఇరాన్‌లో పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్నది. మహిళల హక్కులను కాలరాస్తున్న చట్టాలపై చాలా మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. 40 ఏళ్లుగా మహిళలు అణిచివేతకు గురి అవుతున్నారు. టెహ్రాన్‌లో పుట్టి పెరిగిన నాకు ఇలాంటి చేదు అనుభవాలు ఎన్నో ఉన్నాయి. చిన్నతనంలోనే నేను కూడా హిజబ్ ధరించాల్సి వచ్చింది అని ఎల్నాజ్ నోరౌజీ తెలిపింది.

     మోరల్ పోలీసుల ఆగడాలు..

    మోరల్ పోలీసుల ఆగడాలు..


    నా చిన్నతనం, యవ్వనంలో మోరల్ పోలీసుల ఆగడాలకు బలి అయ్యాను. విద్యనభ్యసించేందుకు వెళ్తుంటే మోరాలిటీ పోలీసులు (ముస్లిం సంప్రదాయవాదులు) నన్ను అడ్డుకొని దారుణంగా ప్రవర్తించారు అని ఎల్నాజ్ నోరౌజీ తెలిపారు. తాజాగా ఇరాన్‌లో పెద్ద ఎత్తున జరుగుతున్న నిరసనలకు తన మద్దతు తెలిపారు. తన నిరసనను వ్యక్తం చేస్తూ నగ్నంగా మారిన వీడియోను ఆమె షేర్ చేశారు.

    ఇన్స్‌టాగ్రామ్‌లో నగ్నంగా మారిన వీడియో

    ఇన్స్‌టాగ్రామ్‌లో నగ్నంగా మారిన వీడియో


    ఇన్స్‌టాగ్రామ్‌లో ఎల్నాజ్ నోరౌజీ షేర్ చేసిన వీడియోలో.. తొలుత తన తలపై ఉన్న హిజబ్‌ను తొలగించింది. ఆ తర్వాత బుర్ఖాను, ఆ తర్వాత తన ఒంటిపై పొరలు పొరలుగా ఉన్న దుస్తులను ఒక్కొక్కొటిగా ఒలిచి బయటపడేసింది. ఈ సందర్భంగా.. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎవరైనా సరే.. ఏ దేశం వారైనా సరే.. వారికి ఇష్టం వచ్చిన దుస్తులు ధరించే హక్కు ఉండాలి. తన మనసుకు నచ్చిన దుస్తులను ధైర్యంగా ధరించాలి. ఎలాంటి బెదిరింపులకు, ఆంక్షలు లోబడి జీవించ వద్దు అని సందేశాన్ని ఇచ్చారు.

    నగ్నత్వాన్ని ప్రమోట్ చేయడం లేదు అంటూ

    నగ్నత్వాన్ని ప్రమోట్ చేయడం లేదు అంటూ


    ప్రపంచంలో భూమీ మీద జీవించే ప్రతీ ఒక్కరికి సొంత అభిప్రాయాలు ఉంటాయి. తమకంటూ కొన్ని నమ్మకాలు ఉంటాయి. వాటిని ఎదుటి వాళ్లు గౌరవించాలి. ప్రజాస్వామ్యమంటే.. దేనినైనా ఆచరించే పవర్ అని అర్థం. తన శారీరానికి సంబంధించి ఏం ధరించాలనే హక్కు, పవర్ మహిళకు ఉండాలి. ఈ వీడియో ద్వారా నేను నగ్నత్వాన్ని ప్రమోట్ చేయడం లేదు. స్వేచ్ఛగా జీవించే హక్కు కోసం పోరాటం చేస్తున్నాను అని ఎల్నాజ్ నోరౌజీ ఇన్స్‌టాగ్రామ్‌లో వివరణ ఇచ్చారు.

    English summary
    Iran Actress Elnaaz Norouzi goes nude to support Anti Hijab movement in Iran. She wrote in Instagram that, Every Woman, anywhere in the world, regardless of where she is from, should have the right to wear whatever she desires and when or wherever she desires to wear it. No man nor any other woman has the right to judge her or ask her to dress otherwise.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X