»   »  అవును, నేను గర్భవతిగానే.... (హన్సిక ఇంటర్వ్యూ)

అవును, నేను గర్భవతిగానే.... (హన్సిక ఇంటర్వ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో హన్సిక తెలుగు సినిమాల్లో అస్సలు కనిపించడం లేదు. చాలా కాలం తర్వాత ఆమె నటించిన తమిళ చిత్రం తెలుగులో ‘కళావతి'గా అనువాదం అవుతోంది. ఈ నెల 29న సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రచారంలో భాగంగా ఆమె హైదరాబాద్ వచ్చారు. మంగళవారం మీడియాతో సినిమాకు సంబంధించిన, తనకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు.

ఈ సినిమాలో హన్సిక గర్భతిగా నటిస్తోంది. ఈ విషయమై ఆమెను ప్రశ్నించగా ......అవును. ఇందులో గర్భవతి పాత్రలో నటించాను. నా క్యారెక్టర్ చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇప్పటివరకు చేయనటువంటి కొత్త పాత్ర ఇది. ఈ పాత్రలో సహజత్వం కోసం చాలా కష్టపడాల్సివచ్చింది. గర్భవతులైన మహిళల మనస్తత్వం, నడకతీరు, కూర్చునే విధానం, హావభావల గురించి కొందరి మహిళల సలహాల్ని తీసుకున్నాను.

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు పూర్తిగా దూరం కావడంపై హన్సిక స్పందిస్తూ....మంచి కథల కోసం ఎదురుచూడటంతో తెలుగులో కొంత గ్యాప్ వచ్చింది. అంతే తప్ప తెలుగు సినిమాలకు దూరం కాలేదు. తమిళంలో బిజీగా ఉండటంతో డేట్స్ అందుబాటులో లేక ఇక్కడ కొన్ని అవకాశాల్ని వదులుకున్నాను. మంచి కథ దొరికితే త్వరలోనే తెలుగులో సినిమా చేస్తాను అన్నారు.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

త్రిషతో విబేధాలు లేవు

త్రిషతో విబేధాలు లేవు


షూటింగ్ సమయంలో త్రిషకు, నాకు మధ్య విబేధాలు వచ్చాయని, త్రిషతో నటించడానికి నేను నో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో నిజం లేదు. ఈ వార్తలు ఎవరు క్రియేట్ చేసారో అర్థ కాలేదు. త్రిష నాకు మంచి ఫ్రెండ్. ఇద్దరం షూటింగ్‌లో సరదాగానే ఉంటాం అన్నారు.

శింబు గురించి

శింబు గురించి


గతాన్ని తవ్వుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. గాసిప్స్ గురించి మాట్లాడటం నాకు నచ్చదు. శింబుకు నాకు మధ్య జరిగిన దాని గురించి ఇప్పటికే చెప్పాను. సెలబ్రిటీల జీవితంలో ఇవన్నీ మూమూలే అన్నారు హన్సిక.

బాలీవుడ్ గురిచి...

బాలీవుడ్ గురిచి...


బాలీవుడ్ వెళ్లాలనే ఆలోచన ప్రస్తుతానికైతే లేదు. తెలుగు, తమిళ భాషలతో సంతృప్తిగా ఉన్నాను. ఇక్కడే మంచి అవకాశాలు లభిస్తున్నాయి అన్నారు.

హారర్ సినినిమాలంటే భయమే...

హారర్ సినినిమాలంటే భయమే...


హారర్ సినిమాలు, దెయ్యాలంటే నాకు చాలా భయం. ఇప్పటికీ ఒంటరిగా రూమ్‌లో పడుకోవాలంటే భయపడతాను. హారర్ సినిమా చూసి పదమూడేళ్లయింది. కథ నచ్చడంతో అరాన్మణై, అరాన్మణై-2 సినిమాలు చేశాను అన్నారు.

గ్లామర్ రహస్యం

గ్లామర్ రహస్యం


ఎక్కువగా తినకపోవడమే నా గ్లామర్ రహస్యం. బరువు తగ్గడం కోసం నచ్చిన ఆహార పదార్థాలకు దూరమవ్వాల్సి వస్తోంది. ప్రతిదానిని మితంగా స్వీకరిస్తాను. ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి ఆటలు ఆడతాను.

అమ్మకోసం

అమ్మకోసం


పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. ఒత్తిడిగా అనిపించిన ప్రతిసారి పెయింటింగ్ ద్వారా రిలాక్స్ అవుతాను. మా అమ్మకు బహుమతిగా ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఆరడుగుల పొడవుతో కూడిన గురునానక్ చిత్రాన్ని గీస్తున్నాను.

English summary
Actress Hansika interview about Kalavathi movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu