»   » పబ్లిక్‌గా ప్రొడ్యూసర్‌కు ఐ లవ్ యూ చెప్పిన హెబ్బా పటేల్.. ఆ నిర్మాత ఎవరంటే..

పబ్లిక్‌గా ప్రొడ్యూసర్‌కు ఐ లవ్ యూ చెప్పిన హెబ్బా పటేల్.. ఆ నిర్మాత ఎవరంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమాలో అవకాశం ఇచ్చిన ఏ నిర్మాతనైనా హీరోయిన్ పొగడ్తలతో ముంచెత్తడం సహజం. కానీ పొగడ్తల విషయంలో కుర్ర హీరోయిన్ హెబ్బా పటేల్ స్టైయిల్ మాత్రం చాలా డిఫరెంట్. శుక్రవారం జరిగిన మిస్టర్ ప్రీ రిలీజ్ వేడుకలో కుమార్ 21 ఎఫ్ ఫేమ్ హెబ్బా హడావిడి చేసింది. ఈ వేడుకలో ఒకడుగు ముందేసి నిర్మాత నల్లమలుపు బుజ్జికి ఐ లవ్ యూ చెప్పి అందర్ని ఆశ్చర్యపరిచింది.

బుజ్జి సార్ ఐ లవ్ యూ..

బుజ్జి సార్ ఐ లవ్ యూ..

ప్రీరిలీజ్ ఫంక్షన్‌లో సహనటి లావణ్య త్రిపాఠితో కలిసి వేదిక మీదకు వచ్చింది. చాలా హుషారుగా మాట్లాడి అందర్ని ఆకట్టుకున్నది. కుమారి 21 ఎఫ్ చిత్రం తర్వాత నిర్మాత బుజ్జి మిస్టర్ చిత్రంలో అవకాశం ఇవ్వడం మరచిపోలేనటువంటి సంఘటన అని చెప్పింది. నాకు ఈ చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ బుజ్జి సార్.. ఐ లవ్ యూ అని వ్యాఖ్యలు చేసింది. హెబ్బా మాటలకు వేదిక పక్కనే ఉన్న నిర్మాత నల్లమలుపు బుజ్జి ముసిముసి నవ్వులు నవ్వుతు కనిపించారు.

వేదికపై చలాకీగా

వేదికపై చలాకీగా

హెబ్బా మాటలపై యాంకర్ శిల్ప చక్రవర్తి స్పందిస్తూ.. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా బుజ్జికి ఐ లవ్ యూ చెప్పడం చూడలేదు. తొలిసారి బుజ్జికి ఈ అవకాశం హెబ్బా కల్పించింది అని ఆమె అన్నారు. దాంతో ప్రేక్షకులు నవ్వుల్లో మునిగిపోయారు. బహిరంగంగా వేదికపై చాలా చలాకీగా హెబ్బా మాట్లాడటం ఫిలింనగర్‌లో చర్చనీయాంశమైంది.

 నిర్మాత బుజ్జి అంటే..

నిర్మాత బుజ్జి అంటే..

ఇక అంతటితో ఆగకుండా బుజ్జికి ఐలవ్ యూ అని ఇంగ్లీష్‌లో కాకుండా తెలుగులో చెప్పాలని హెబ్బాను శిల్ప కోరింది. దాంతో తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడుతూ ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన నిర్మాత బుజ్జి అంటే నాకు చాలా చాలా ఇష్టం అని చెప్పడంతో మరోసారి వేదికపై నవ్వులు పూచాయి. దీనిని బట్టి హెబ్బాకు నటనే కాకుండా మంచి మార్కెటింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయనే మాట వినిపించింది.

అచ్చ తెలుగు అమ్మాయిలా..

అచ్చ తెలుగు అమ్మాయిలా..

కుమారి 21 ఎఫ్ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది. ఆ సినిమాలో అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించింది. దాంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా హెబ్బా పటేల్ పేరు మార్మోగింది. మిస్టర్ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కార్యక్రమానికి చాలా పద్ధతిగా ముస్తాబై వచ్చింది. అచ్చ తెలుగు అమ్మాయిలా చీర కట్టు, బొట్టుతో అభిమానులనే కాకుండా సినీ ప్రముఖుల దృష్టిని ఆకర్షించింది.

English summary
Mister Pre release funtion conducted at Hyderabad on Friday. In this event actress Hebba Patel comments become sansational in Tollywood. She says to I Love You to Producer Nallamalupu Bujji become talk of town.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu