»   » ఇండస్ట్రీలో అలాంటి నీచులున్నారు: హీరోయిన్ కాజల్

ఇండస్ట్రీలో అలాంటి నీచులున్నారు: హీరోయిన్ కాజల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినీ ఇండస్ట్రీలో ఏళ్ల తరబడి సాగుతున్న....ఇప్పటికీ కొనసాగుతున్న నీచమైన వ్యవహారం ఏదైనా ఉంది అంటే అది 'కాస్టింగ్ కౌచ్'. హీరోయిన్ గా అవకాశం కావాలంటే తనతో పడుకోవాలని అడిగే దర్శకులు, తనకు సెక్స్ సుఖం అందించాలని కోరే స్టార్ హీరోలు, నిర్మాతలు సినీ పరిశ్రమలో చాలా మందే ఉన్నారు.

ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చాలా మంది పెద్ద పెద్ద హీరోయిన్లు సైతం ఒప్పుకుంటున్నారు. తమకు అలాంటి సంఘటనలు ఎదురయ్యాయని పలు ఇంటర్వ్యూల్లో చెబుతున్నారు. అయితే ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడే సదరు దర్శకులు, నిర్మాతల పేర్లను బయట పెట్టే సాహసం మాత్రం ఎవరూ చేయడం లేదు.

కెరీర్ మీద ఎఫెక్టు పడుతుందనే

కెరీర్ మీద ఎఫెక్టు పడుతుందనే

అయితే ఇలాంటి వ్యవహారాల్లో పేర్లు బయట పెడితే అదో పెద్ద వివాదం అయి తమ సినీ కెరీర్ మీద ప్రభావం చూపుతుందనే భయంతోనే ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడే దర్శకులు, హీరోలు, నిర్మాతల పేర్లు బయట పెట్టడం లేదు.

కాజల్ స్పందన

కాజల్ స్పందన

కాస్టింగ్ కౌజ్ మీద ఇటీవల ఇంటర్వ్యూలో కాజల్ కు కూడా ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి కాజల్ స్పందిస్తూ... ఇప్పటి వరకు తనకు అలాంటి అనుభవం ఎదురు కాలేదని తెలిపారు. అయితే ఇతర హీరోయిన్లు తమకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనట్లు తనతో చెప్పారని కాజల్ వెల్లడించారు.

అలాంటి నీచులు ఇండస్ట్రీలో ఉన్నారు

అలాంటి నీచులు ఇండస్ట్రీలో ఉన్నారు

కొందరు అవకాశాలు ఇవ్వాలంటే...సెక్సువల్ ఫేవర్ కావాలని కోరుతానే విషయం నా దృష్టికి కూడా వచ్చింది. ఇలాంటి పరిస్థితులు ఇంకా ఇండస్ట్రీలో ఉండటం చాలా బాధాకరం అని కాజల్ చెప్పుకొచ్చారు.

60ప్లస్ చిరంజీవితో జతకట్టడంపై

60ప్లస్ చిరంజీవితో జతకట్టడంపై

60 ప్లస్ చిరంజీవితో ‘ఖైదీ నెం 150' సినిమాలో జతకట్టడంపై కాజల్ స్పందిస్తూ.... మెగాఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా అందరు హీరోలతో చేయడం ఆనందంగా ఉంది అని తెలిపారు.

English summary
'Personally, I hadn't faced casting couch. But, Other Actresses had shared their experiences with Me. Few people sought sexual favors for film offers. It's very unfortunate that such things have been happening even now'. Kajal said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu