»   » హిందూత్వం ఎవడిసొత్తూ కాదు: నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు, బిగ్ బాస్‌కి మద్దతు

హిందూత్వం ఎవడిసొత్తూ కాదు: నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు, బిగ్ బాస్‌కి మద్దతు

Posted By:
Subscribe to Filmibeat Telugu

రజినీకాంత్ రాజకీయ ప్రవేశంపై కస్తూరి గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసి.. ఆయన అభిమానుల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు లేటెస్ట్ విషయాల మీద స్పందించటం. ఆ వ్యతిరేక వర్గం నుంచి తిట్లూ బెదిరింపులూ ఎదుర్కోవటం మామూలైపోయింది కస్తూరికి. తమిళంతో పాటు తెలుగులో కూడా అనేక సినిమాల్లో నటించిన కస్తూరి.. ఆమధ్య ప్రత్యేకించి ఒక తెలుగు హీరోపై సంచలన ఆరోపణలే చేసింది. అతడు తనను పడకగదికి రప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడని ఆమె చెప్పి ఆయన గారు ఎవరో అర్థం అయ్యేటట్టు కూడా క్లూ లు ఇచ్చి మరీ దుమ్ము దులిపేసింది.

బిగ్ బాస్ షో

బిగ్ బాస్ షో

ఈ సారి కూడా మళ్ళీ ఇంకో వివాదం తో ట్వీటర్ లో కలకలం రేపింది కస్తూరి. బిగ్ బాస్ షో ద్వారా సంస్కృతిని దెబ్బతీస్తున్నారని పేర్కొంటూ కమల్ హాసన్‌ను, ఆ షోలో పాల్గొంటున్న వారిని అరెస్ట్ చేయాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిపై నటి కస్తూరి స్పందించి. కమల్‌కు బాసటగా నిలుస్తూ.. హిందూత్వంపై తన ట్విట్టర్లో వ్యాఖ్యలు చేసింది.

Allu Arjun sharing his Emotion Towards Dil Raju for Losing his Wife
తమిళ సంస్కృతిని కాపాడండి

తమిళ సంస్కృతిని కాపాడండి

"ముందు.. సంస్కృతి పేరు చెప్పుకొని రెచ్చిపోతున్న ‘cultural extremists (సాంస్కృతిక అతివాదులు/తీవ్రవాదులు) నుంచి తమిళ సంస్కృతిని కాపాడండి. హిందూత్వం అనేది ఎవడో ఒకడి సొత్తు కాదు'' అంటూ ఒక ట్వీట్ చేసి అంతటితో ఆగకుండా ఇంకో ట్వీట్ తో మరో దెబ్బ వేసింది.

హౌస్ అరెస్ట్‌లో ఉన్నారు కదా

హౌస్ అరెస్ట్‌లో ఉన్నారు కదా

"కమల్ హాసన్‌ను, బిగ్‌బాస్‌లో పాల్గొంటున్న వారిని అరెస్ట్ చేయడం ఎందుకు..? ఇప్పటికే వారంతా 100 రోజుల పాటు హౌస్ అరెస్ట్‌లో ఉన్నారు కదా. మరి, వాళ్లు ఆ షో నిర్వహిస్తున్న విజయ్ టీవీ మీద కేసు వేస్తారా..?'' అంటూ ఈ సారి డైరెక్ట్ పాయింట్ కే వచ్చింది..

సంస్కృతీ రాబంధులు

సంస్కృతీ రాబంధులు

ఇక, సంస్కృతి పేరు చెప్పుకొంటూ తిరిగే ఇలాంటి ‘సంస్కృతీ రాబంధు'లకు రక్షణాత్మక వ్యక్తులైన కమల్ హాసన్, షో కంటెస్టెంట్లే లక్ష్యమంటూ వేసిన ట్వీట్ తో ఇక ట్విట్టర్ లో ఒక వర్గానికి కాలినట్టుంది కొందరు అప్పుడే ఆమె ట్వీట్ మీద యుద్దం మొదలు పెట్టారు కూడా...

English summary
"These self appointed culture vultures will only target defenseless individuals, ikamalhaasan and TV show participants. #PublicityStunt" Tweeted Kasthuri
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X