»   » శృతిహాసన్, కుష్భూ సిగపట్లు.. అందాల భామల మధ్య సంఘమిత్ర చిచ్చు

శృతిహాసన్, కుష్భూ సిగపట్లు.. అందాల భామల మధ్య సంఘమిత్ర చిచ్చు

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  అందాల తార శృతిహాసన్‌పై సీనియర్ నటి కుష్భూ పరోక్షంగా విరుచుకుపడింది. సంఘమిత్ర చిత్రంపై అవాకులు, చెవాకులు పేలుతుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. సంఘమిత్ర చిత్రం నుంచి శృతి హాసన్ తప్పుకొన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారమే. సంఘమిత్ర దర్శకుడు సుందర్ సీ భార్య కుష్బూ అన్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఇంకా శృతిహాసన్ స్పందించకపోవడం గమనార్హం. ఒకవేళ స్పందిస్తే వారిద్దరి మధ్య వివాదం జోరందుకునే అవకాశం ఉందని తమిళ సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

  బాంబులా పేలిన శృతి నిష్క్రమణ

  బాంబులా పేలిన శృతి నిష్క్రమణ

  తమిళ చిత్ర పరిశ్రమలో గతంలో మునుపెన్నడూ లేని విధంగా సంఘమిత్ర చిత్రాన్ని రూ.400 కోట్ల బడ్జెట్ రూపొందించాలని సంకల్పించారు దర్శకుడు సుందర్ సీ. కేన్స్ ఫిలిం ఫెసివల్‌లో చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆవిష్కరణను అంగరంగ వైభవంగా చేశారు. అంతా సవ్యంగా సాగుతుందని అనుకుంటున్న సమయంలోనే ఈ చిత్రం నుంచి ప్రధాన పాత్రధారి శృతిహాసన్ తప్పుకోవడం బాంబులా పేలింది.

  Shruti Hassan Teaching Life Truths | Filmibeat Telugu
  సంఘమిత్రపై నీలినీడలు

  సంఘమిత్రపై నీలినీడలు

  సంఘమిత్ర స్క్రిప్టుపై క్లారిటీ లేదు. ఆ స్క్రిప్టు ఎప్పటికీ పూర్తవుతుందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మరో రెండేళ్లు కెరీర్‌ను పణంగా పెట్టలేను. అందుకే ఈ చిత్రం నుంచి తప్పుకొంటున్నాను అని శృతిహాసన్ కారణాలు చెప్పింది. దాంతో సంఘమిత్ర ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. సినీ వర్గాల్లో ఈ సినిమాపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.

  శృతి హాసన్‌పై పరోక్ష్య వ్యాఖ్యలు

  శృతి హాసన్‌పై పరోక్ష్య వ్యాఖ్యలు

  ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో శృతిహాసన్‌పై కుష్భూ టార్గెట్ చేయడం చర్చానీయంశమైంది. ఈ రోజుల్లో సినిమా అంటే 70 శాతం ప్రీ ప్రొడక్షన్ వర్క్, 30 శాతం షూటింగ్ ఉంటుంది అని చాలా మందికి తెలియదు. సంప్రదాయ సినిమా ఫ్యామిలీ నుంచి ఒకరికి సరైన అవగాహన లేదు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పబ్లిక్ ఫోరమ్‌లను ఉపయోగించుకోకూడదు అని కుష్భూ అన్నారు.

  తప్పులు సరిద్దిద్దుకుంటే మంచిది

  తప్పులు సరిద్దిద్దుకుంటే మంచిది

  తమ తప్పులు సరిదిద్దుకోంటే మంచిది. సినీ పరిశ్రమలో చాలా కాలం మనుగడ కొనసాగించడానికి అవకాశం ఉంటుంది అని శృతీహాసన్‌కు పరోక్షంగా సలహా ఇచ్చారు. వివాదం ముగుస్తుందనుకున్న నేపథ్యంలో కుష్బూ మళ్లీ ఆ అంశాన్ని గెలికి రచ్చ చేయడంపై సినీ వర్గాలు రకరకాలుగా చెప్పుకొంటున్నారు. కుష్భూ వ్యాఖ్యలపై శృతీ ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

  ఒకే సినిమాతో శృతి

  ఒకే సినిమాతో శృతి

  తమిళ చలన చిత్ర చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో జయం రవి, ఆర్య హీరోలుగా నటిస్తున్నారు. తెనందల్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మన్ సంగీతం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రం నుంచి తప్పుకొన్న శృతిహాసన్ ప్రస్తుతం సుభాష్ నాయుడు చిత్రలో నటిస్తున్నది. తండ్రి కమల్ హసన్ ఈ చిత్రానికి నిర్మాత అనే సంగతి తెలిసిందే.

  English summary
  Actor Khushboo targetted Shruti Haasan in twitter in over Sanghamitra. She tweeted that These people should know that in films of this genre, the pre-production work itself is 70 per cent while the actual shoot is just 30 per cent.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more