»   »  బావల మనసుల్లో, రాజకీయాల్లో...: నమిత ఇంట్రెస్టింగ్ కామెంట్!

బావల మనసుల్లో, రాజకీయాల్లో...: నమిత ఇంట్రెస్టింగ్ కామెంట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ నమిత ఎంత లావెక్కి పోయిందంటే.... ఆమెకు సినిమా అవకాశాలు ఇవ్వాలంటేనే భయపడేంత. దీంతో రియలైజ్ అయిన నమిత తన లోపాన్ని సరిద్దుకునే ప్రయత్నం చేస్తోంది. బరువు తగ్గి అవకాశాలు దక్కించుకునేందుకు తన కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ తెలుగు ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

తమిళ సినిమా ఇండస్ట్రీ అంటే తనకు ఎంతో ఇస్టమని, అందుకే గుజరాత్ వదిలి ఇక్కడే సెటిలయ్యాను, ఇదే నా పుట్టినిల్లు అంటోంది. గుజరాత్ లో జరిగే పండుగల గురించి మరిచిపోయాను. తమిళంలో అన్ని పండుగల గురించి నాకు తెలుసు. పొంగల్ అంటే ఎంతో ఇష్టం. తమిళ జనాలు తనను ఎంతో ఆదరించారని, తాను ఇతర భాషా చిత్రాల్లో నటించినా... తమిళనాడు బావల మనసుల్లో పదిలంగా ఉండిపోతాను అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Actress Namitha interview

ఈ మధ్య అవకాశాలు లేక డైట్ మెయింటేన్ చేయక పోవడంతో బరువు పెరిగాను. ప్రస్తుతం బరువు తగ్గేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. 94 కిలోల నుండి 76కు తగ్గాను. ఇపుడు అవకాశాలు మళ్లీ వస్తున్నాయి. మళయాలంలో పులిమురుగన్ అనే చిత్రంలో నటిస్తున్నాను అని తెలిపింది.

తాను నిర్మాతగా మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, తనకు నటించడం తప్ప సినిమా నిర్మించడం తెలియదని నమిత చెప్పింది. పలు రాజకీయ పార్టీలు నన్ను పార్టీలో చేరమని కోరుతున్నారు. ఏదో ఒక రోజు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాను. ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదు అన్నారు.

English summary
Actress Namitha interview about movies and politics.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu