»   » నయనతార మార్ఫింగ్ ఫోటో హల్ చల్....

నయనతార మార్ఫింగ్ ఫోటో హల్ చల్....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ హాట్ బ్యూటీ నయనతార పై ఎప్పుడూ ఏదో ఒక పుకార్లు ప్రచారంలో ఉంటాయి. ముఖ్యంగా ఆమె చెట్టూ లైవ్ ఎఫైర్లు హల్ చల్ చేస్తుంటాయి. తాజాగా ఆమెకు సంబంధించిన మార్ఫింగ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కోతి జాకెట్ లాగుతున్న ఫోటో అది. అది నయనతార ఫోటోనే అంటూ కొందరు ఫేస్ బుక్, ట్విట్టర్లలో రచ్చ మొదలెట్టారు. అయితే నయనతార అభిమానులు అసలు విసయం కనిపెట్టారు. అది నయనతార ఫోటో కాదని, వేరే ఫోటోను నయనతార ఫేసుతో మార్ఫింగ్ చేసారని తేల్చేసారు.

నయనతార సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె వరుస తమిళ సినిమాలతో బిజీగా గడుపుతోంది. మొత్తం ఆరు సినిమాల్లో నటిస్తోంది. అందులో మూడు సినిమాలు ‘మాయ', ‘నానుమ్ రౌడీధాన్', ‘తాని ఒరువన్' షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. మరో మూడు సినిమాలు ఐదు నమ్మ ఆలు, కాశ్మోరా, తిరునాల్ చిత్రీకరణ దశలో ఉన్నాయి.

 Actress Nayantara's morphing photo

మాయ సినిమా విషయానికొస్తే..
నయనతార ప్రధాన పాత్రలో తమిళంలో తెరకెక్కుతున్న హారర్ మూవీ ‘మాయ'. అశ్విన్ శరవనణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, మళయాలంలోకి డబ్ చేసి విడుదల చేయనున్నారు.

నయనతార గత చిత్రాలకు భిన్నంగా పూర్తి హారర్ కాన్సెప్టుతో ఈచిత్రం సాగుతుంది. దయ్యాల కాన్సెప్టుతో తెరకెక్కిన ఈచిత్రం ట్రైలర్ భయ పెట్టే విధంగా ఉంది. ప్రస్తుతం తమిళ వెర్షన్ ట్రైలర్ మాత్రమే విడుదలైంది. త్వరలో తెలుగు వెర్షన్ ట్రైలర్ కూడా విడుదల చేయనున్నారు.

అశ్విన్ శరవణన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో ఆరి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ‘అనామిక' తర్వాత నయనతార నటిస్తున్న ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ఇది. పోటెన్షియల్ స్టూడియోస్ పతాకంపై ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమాపై తమిళ ప్రేక్షకులలో మంచి అంచనాలు ఉన్నాయి. నయనతార ఉండటంతో తెలుగులోనూ మంచి బిజినెస్ అవుతుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం హారర్ చిత్రాల ట్రెండ్ నడుస్తోందన్నది పరిశ్రమ వర్గాల మాట. ఆ మధ్య వచ్చిన పిజ్జా, విల్లా, యామిరుక్కభయమే, ఆ, పిశాచు లాంటి చిత్రాల నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టాయి. ఈమధ్య తెలుగులో రూపొందిన గీతాంజలి లాంటి చిత్రాలు కాసులు తెచ్చిపెట్టాయి. దీంతో ఈ తరహా హార్రర్ చిత్రాల నిర్మాణాల సంఖ్య పెరుగుతోందనే చెప్పాలి. తాజాగా నటినయనతార మాయ చిత్రంతో భయపెట్టడానికి రెడీ అవుతున్నారు.

English summary
Actress Nayantara's morphing photo going viral on the internet.
Please Wait while comments are loading...