»   » రెండో పెళ్లివాడితో స్టార్ హీరోయిన్ నిశ్చితార్థం

రెండో పెళ్లివాడితో స్టార్ హీరోయిన్ నిశ్చితార్థం

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బెంగళూరు : 'ముంగారుమలే'(తెలుగు వాన) ఫేం పూజాగాంధీ పెళ్లి కూతురు కాబోతోంది. స్టార్ హీరోయిన్ గా , ప్రతిభావంతురాలైన నటిగా, రాజకీయ నాయకురాలిగా మూడు పదుల వయసులోపే ఎదిగిన ఉత్తరాది భామ పూజాగాంధీ... కన్నడిగుడితోనే ఏడడుగులకు సిద్ధమైంది. స్థిరాస్థి వ్యాపారి, జేడీఎస్‌ నేత ఆనందగౌడతో ఆమె వివాహ నిశ్చితార్థం గురువారం ఆడంబరంగా జరిగింది. నగరంలోని కత్రిగుప్పెలోని పూజాగాంధీ నివాసంలో ఉదయం పదిన్నరకు నడుమ నిశ్చితార్థం జరిగింది. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన వారెవ్వరూ కనిపించకపోవడం గమనార్హం. రెండు కుటుంబాల సభ్యులు మాత్రమే హాజరైనారు. మీడియాను కూడా దూరంగా ఉంచారు. సినీ ప్రముఖులు, మిత్రులకు త్వరలో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాదిలో వివాహం జరగనుంది.

  ఆమెను చేసుకోబోయే ఆనందగౌడ కి ఇది రెండో వివాహం. అలనాటి ప్రముఖ నటి బి.సరోజాదేవి మనుమరాలు ఇందిరతో తొమ్మిదేళ్ల క్రితం ఆనందగౌడ వివాహం జరిగింది. కుటుంబ కలహాలతో ఇద్దరూ వేరుపడ్డారు. గౌడ జనతాదళ్‌(ఎస్‌) పార్టీ క్రియాశీలం కార్యకర్త. పూజా కూడా జేడీఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అక్కడే ఆమెతో పరిచయమై ప్రేమగా మారింది. ప్రస్తుతం పూజాగాంధీ నటిస్తున్న మూడు సినిమాలు వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని పూర్తి చేసిన తరువాతనే వివాహం జరుగుతుందని సమాచారం. జనతాదళ్‌(ఎస్‌) పార్టీ నేత అయిన ఆనందగౌడ స్వగ్రామం శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి. బెంగళూరులోనే స్థిరపడ్డారు. హిందీ సినిమాలకు డబ్బు సమకూర్చడం, స్థిరాస్తి వ్యాపార రంగంలో ఉన్నారు.

  పంజాబీ అమ్మాయి అయిన పూజాగాంధీ ఢిల్లీలో చదివారు. ముంగారుమలే చిత్రంలో అవకాశం రావడంలో చదువు మధ్యలో నిలిపేసింది. ముంగారుమలే చిత్రం కన్నడ నాట విజయఢంకా మోగించింది. ఒక్క సినిమాతో పూజాగాంధీ సాండల్‌వుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరింది. అనంతరం పలు సినిమాల్లో నటించినా.. ఇటీవల అవకాశాలు తగ్గాయి. పూజా తోబుట్టువుల్లో ఒకరు రాధిక సినిమాల్లో నటిస్తుండగా, మరో సోదరి చదువుతోంది. పూజాగాంధీ నటించి దండుపాళ్య చిత్రం ఇటివల విడుదలై సంచల విజయం సాధించింది. ఈ సినిమా తెలుగులో దండుపాళ్యంగా విడుదలకు సిద్ధమైంది.


  ప్రేమ నుంచి...పెద్దలు కుదిర్చిన పెళ్లిగా దీన్నీ పూజాగాంధీ అభివర్ణిస్తోంది. ఆమె తమ నిశ్చితార్థానికి ముందు పూజాగాంధీ మీడియాతో మాట్లాడుతూ తమది ప్రేమ, పెద్దలు కుదిర్చిన సంబంధమని చెప్పారు. ఆనందగౌడతో వివాహం నిశ్చయం కావడం తనకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. పెళ్లి ఎప్పుడని అడగ్గా... ఇంకా నిర్ణయించలేదని తెలిపింది. తాను తొలినుంచీ కన్నడిగుడినే వివాహం చేసుకుంటానని చెబుతున్నట్లుగానే, ఆనందగౌడను పెళ్లాడుతున్నట్లు పేర్కొన్నారు.

  English summary
  
 Gorgeous Pooja Gandhi got engaged with her beau Anand Gowda. The function was restricted to their family members and friends and media was not uninvited to the function.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more