»   » ఔను..! నాపెళ్ళి నిజమే: స్వయంగా ఇలా చెప్పేసింది

ఔను..! నాపెళ్ళి నిజమే: స్వయంగా ఇలా చెప్పేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

కన్నడ సినిమాల్లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ బార్నా రమ్య పై ఓ సంచలన వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. ఆమె రహస్యంగా పెళ్లి చేసుకుందని పలు మీడియాల్లో ప్రత్యేక కథనాలు వచాయి. అయితే కొద్ది గంటల పాటు అసలు ఇది నిజమా రూమరా అన్న కన్ ఫ్యూజన్ లోనే ఉండిపొపయారంతా. అంత రహస్యంగా పెళ్ళి చేసుకోవాల్సిన అవసరమేముందీ అంటూ ఆశ్చర్య పోయాఉ కొంత మంది. అయితే రమ్య కారణాలు రమ్యకి ఉన్నాయేమో గానీ. నిజంగానే పెళ్ళి జరిగి పోయిందన్న విషయం స్వయంగా తానే చెప్పేసింది.

కొంత కాలంగా పరిశ్రమకు దూరంగా ఉంటోంది. మే 29న జేడీఎస్ బహిష్కృత ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ బంధువైన వ్యాపారవేత్త ఫహాద్ అలీఖాన్ ను బెంగళూరులోని శివాజీనగర్ లో ఆమె వివాహం చేసుకుంది. స్థానికంగా ఉన్న రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరు రహస్య వివాహం చేసుకున్నట్టు కథనాలు ప్రసారమయ్యాయి. కాగా, టీవీల్లో వార్తలు రావడంతో రమ్య స్పందించారు.

Actress Ramya Barna secretly marries politician's son Fahad

తాను ఫహద్‌ను పెళ్లి చేసుకున్న మాట నిజమేనని స్పష్టం చేశారు. ''మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు. కాబట్టి రిజిస్ట్రార్ ఆఫీస్‌లో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నాం. అమ్మ ఆరోగ్యం కుదుటపడ్డాక కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీలోని ముఖ్యులను పిలిచి రిసెప్షన్‌ను నిర్వహిస్తాం'' అని ఆమె చెప్పారు. దీనిపై స్పందించిన జమీర్ అహ్మద్ ఖాన్.. ఫహద్ రహస్య పెళ్లి గురించి తనకే వివరాలు తెలియవని, టీవీల్లో వార్తలు చూశాకే ఆ విషయం తనకు తెలిసిందని చెప్పారు. కాగా, గత బీబీఎంపీ మున్సిపల్ ఎలక్షన్లలో ఫహద్ అలీ ఖాన్ కూడా పోటీ చేసి ఓడిపోయారు.

English summary
The marriage of Ramya and Fahad was registered in the office of the registrar of marriages at Shivajinagar here. It is gathered that Fahad is a relative of MLA, Zameer Ahmed Khan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu