»   » ఈ వయసులో ఈ నమ్మకాలేంటబ్బా..?? చాన్సుల కోసం పేరు మార్చుకుంది

ఈ వయసులో ఈ నమ్మకాలేంటబ్బా..?? చాన్సుల కోసం పేరు మార్చుకుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

సదాఫ్ ఒక పదిహేనేళ్ళ కిందట తేజ జయం సినిమా తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అప్పట్లో తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వటానికి సదాఫ్ అనే పేరుని కట్ చేసి సదా గా పాపులర్ అయ్యింది. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాకు చెందిన ముస్లిం వైద్యుడు, బ్యాంకు ఉద్యోగినిల కుమార్తె అయిన సదా 'జయం' సినిమాతో తెరంగేట్రం చేసింది. జ‌యం మూవీతో సినిమాల్లో అడుగు పెట్టిన సదా ఆ త‌ర్వాత ప‌లు మూవీల్లో న‌టించింది. శంకర్ మూవీ అపరిచితుడు లో న‌టించి అంద‌ర్ని ఆక‌ర్షించింది.

చాన్సులు తగ్గాయి

చాన్సులు తగ్గాయి

ఇక తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అప్ కమింగ్ హీరోయిన్ల హవా బాగా పెరిగిపోవడంతో ఈ అమ్మడికి సినిమా చాన్సులు తగ్గాయి. ఆ తరువాత ఆమె నటించిన సినిమాలన్నీ ప్లాప్ కావడంతో బుల్లి తెరపై దృష్టి సారించింది. పలు షోలకు ఆమె జడ్జిగా వ్యవహరించింది. తాజాగా మరోసారి ఈ అమ్మడు వెండి తెరపై మెరవాలని చూస్తుంది.

ఆ కోరిక మాత్రం ఇంకా ఉంది

ఆ కోరిక మాత్రం ఇంకా ఉంది

అయితే ఆమెలో మాత్రం హీరోయిన్ గా నటించాల‌నే కోరిక మాత్రం ఇంకా ఉంది.. దీంతో ఒక వైపు గ్లామ‌ర్ షో చేస్తూ నిర్మాత‌, ద‌ర్శ‌కుల‌ను లైన్ లో పెట్టే ప‌నిలో పెట్టింది.. ప‌నిలో ప‌నిగా ఒక జ్యోతిష్యుడిని సంప్రదిస్తే పేరు మార్చుకోమ‌న్నాడ‌ట‌.. దీంతో ఆమె పేరును మార్చేసుకుంది. ఇప్పటి వరకు సదాఫ్, సదాగా ఉన్న తన పేరు ఇప్పుడు సధా సయ్యద్‌ గా మారినట్టు తెలిపింది.

33 ఏళ్ల వయసులో

33 ఏళ్ల వయసులో

కొత్తపేరుతో తనకు అంతా కలిసొస్తుందని ఆశిస్తోంది. 33 ఏళ్ల వయసులో పేరు మార్చుకున్న సదా అసలు పేరు సదాఫ్ మహమ్మద్ సయిద్. కానీ జయం సినిమా నుంచి సదా ఆని స్క్రీన్ నేమ్ మార్చుకుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత తన పేరును మార్చుకుంది. ఇప్పటికే తన పీఆర్ లకి కి కూడా ప్రమోట్ చేయమని సదా తెలిపిందట.

అనుమానమే

అనుమానమే

సాధారణంగా సినీ తారలు ఇలాంటి వాటిని చాలా నమ్ముతారు. తమన్నా కూడా తన నేమ్ లో ఒక ఆంగ్ల అక్షరాన్ని జత చేస్తే.. రకుల్ ఒక వర్డ్ ని తీసేసి చేతికి ఒక రింగ్ పెట్టుకుంది. అవకాశాలు రావాలంటే చాలా కారణాలుంటాయి. అందులోనూ ఇప్పటికే "ముదురు" మార్క్ వేసుకున్న సదాఫ్ కి ఇప్పుడు పేరు మారటం వల్ల అవకాశాలు వస్తాయా అన్నది అనుమానమే...

English summary
Acress Sada still looking out for the action opportunities and the latest we hear is that she has changed her name now after consulting a Numerologist.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu