»   » నిజమా రూమరా? ఫిదా కోసం సాయిపల్లవికి ఇచ్చింది మరీ అంత తక్కువా??

నిజమా రూమరా? ఫిదా కోసం సాయిపల్లవికి ఇచ్చింది మరీ అంత తక్కువా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

"ఫిదా" తరువాత సాయి పల్లవికి డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది, మిగతా హీరోయిన్లు ఆమెను చూసి భయపడే పరిస్థితి! మలయాళం ప్రేమమ్ సినిమాతో మంచి క్రేజ్ పొందిన సాయి పల్లవి ఆ సినిమాతో సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది.

Sai Pallavi Photo Gallery


ఇక ఆ సినిమా ఇమేజ్ తో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా అంటూ ప్రేక్షకులని తన మాయలో పడేసింది సాయి పల్లవి. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఫిదా సక్సెస్ లో ప్రధాన కారణం అయిన సాయి పల్లవి తనకు కోటి రూపాయల పారితోషికం ఇచ్చినా సరే నచ్చని పాత్రలో చేయనని అంటున్నది.


చిన్న విష‌యం కాదు

చిన్న విష‌యం కాదు

హీరోలు రాజ్య‌మేలుతున్న ఈ ఇండ‌స్ట్రీలో ఓ సినిమాను హీరోయిన్ సింగిల్ హ్యాండ్ గా త‌న భుజాల‌పై మోయ‌డం అనేది చిన్న విష‌యం కాదు. కానీ సాయిప‌ల్ల‌వి అది చేసి చూపించింది. అదే ఫిదా రూపంలో ఇప్పుడు మ‌న‌కు క‌నిపిస్తుంది. ఈ చిత్రం ఈ రోజు ఇంత పెద్ద విజ‌యం సాధించిందంటే కార‌ణం సాయిప‌ల్ల‌వి అన‌డంలో ఆశ్చ‌ర్య‌మే లేదు.


Sai Pallavi In Fidaa Movie Sets
ఫుల్ క్రేజ్ పెరిగిపోయింది

ఫుల్ క్రేజ్ పెరిగిపోయింది

శేఖ‌ర్ క‌మ్ముల కూడా త‌న సినిమాకు గుండె సాయిప‌ల్ల‌వి అయితే బాడీ వ‌రుణ్ తేజ్ అన్నాడు. ఈ ఒక్క మాట చాలు సినిమాకు పల్లవి చేసిన కృషి ఏంటో చెప్ప‌డానికి. ఇక ఇప్పుడు ఈమెకు ఫుల్ క్రేజ్ పెరిగిపోయింది.ఇలాంటి సమయంలోనే మిగతా హీరోయిన్లు తమ పారితోషికాన్ని విపరీతంగా పెంచేసి ‘దీపముండగానే ఇల్లు చెక్కబెట్టుకోవాలి' అన్న చందంగా వ్యవహరిస్తుంటారు.


25 లక్షలేనట

25 లక్షలేనట

కానీ సాయి పల్లవి మాత్రం తన రెమ్యునరేషన్‌ అందరికీ అందుబాటులో ఉండే విధంగానే చూసుకుంటోంది. ఈ సినిమాకి ముందు ఆమె డిమాండ్ 25 లక్షలేనట ఈ సినిమాకి కూడా ఆమె చార్జ్ చేసింది అదే అమౌంట్. . ఈ సినిమా తరువాత 70 లక్షలు అడుగుతోందట.


క్యాష్‌ చేసుకోకుండా

క్యాష్‌ చేసుకోకుండా

కేవలం డబ్బు కోసమే సినిమా సినిమాకు రెమ్యునరేషన్ పెంచేసే భామలున్న ఈరోజుల్లో పల్లవి రెమ్యునరేషన్‌ తక్కువగా ఉండడం, ఆమె ఉంటే సినిమా హిట్‌ అన్న టాక్‌ రావడం ఇన్ని కారణాలతో టాలీవుడ్‌లో చిన్న పెద్దా దర్శకనిర్మాతలు ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారట. ఈ అవకాశాన్ని క్యాష్‌ చేసుకోకుండా సాయి పల్లవి ఆచి తూచి వ్యవహరిస్తోందనీ, ఓ విధంగా చెప్పాలంటే సినిమా లెక్కలపై తెలివిలేకుండా వ్యవహరిస్తోందని కొందరు అంటున్నారు.


English summary
Fidaa Sai Pallavi Fidaa Movie Shocking Remuneration, She got just 25 Lacks for this Movie as Remuneration
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu