»   » చెన్నై: సూపర్ స్టార్లతో సమానంగా చిన్న హీరోయిన్ విరాళం

చెన్నై: సూపర్ స్టార్లతో సమానంగా చిన్న హీరోయిన్ విరాళం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మనసారా, బస్టాప్, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు చిత్రాల్లో హీరోయిన్ గానటించిన శ్రీదివ్య గురించి అందరికీ తెలిసిందే. తెలుగు అమ్మాయే అయినా తమిళంలో హీరోయిన్ గా ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటోంది. ఇటీవల భారీ వరదలతో చెన్నై నగరం అతలాకులం అయి అక్కడ ప్రజలు నిరాశ్రయులైన నేపథ్యంలో చలించిపోయిన ఆమె రూ. 10 లక్షల విరాళం ప్రకటించింది.

Sri Divya

శ్రీదివ్య చిన్న హీరోయిన్ అయినా.... దాతృత్వంలో మాత్రం తెలుగు, తమిళంలో కొందరు సూపర్ స్టార్లతో సమానంగా ఉండటం అందరినీ ఆశ్చర్య పరించింది. ఆ పెద్ద పెద్ద స్టార్లు తాము సంపాదించే దానితో పోలిస్తే విరాళంగా ఇచ్చింది చాలా చిన్న మొత్తమే. కానీ శ్రీదివ్య తాను సంపాదించే దానితో పోలిస్తే ఇచ్చిన మొత్తం చాలా ఎక్కువే.

సౌత్ లో పెద్ద హీరోలైన అల్లు అర్జున్ 25 లక్షలు, సూర్య, కార్తి కలిపి రూ. 25 లక్షలు, జూ ఎన్టీఆర్, మహేష్ బాబు చెరో 10 లక్షలు విరాళం విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరికి ఏ మాత్రం తీసిపోకుండా చిన్న సినిమాల హీరోయిన్ శ్రీదివ్య కూడా విరాళం అందించడం విశేషం.

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన చెన్నై నగరం, తమిళనాడులోని ఇతర ప్రాంతాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ విపత్తుతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. చెన్నై నగరంలోని కొన్ని పరిస్థితులు మునుపటి స్థితికి రావడానికి కొన్ని నెలల సమయం పడుతుందని అంటున్నారు.

English summary
While actors Suriya and Allu Arjun donated Rs 25 lakh each to help the flood victims, Mahesh Babu and Junior NTR promised Rs 10 lakh each. But a small time actress has shocked everyone by donating 10 lakh rupees for the flood relief. She is none other than Sri Divya who is famous for heroine roles in small budget films.
Please Wait while comments are loading...