»   » జూ ఎన్టీఆర్ గురించి చెబుతూ కంటతడి పెట్టిన ప్రముఖ నటి!

జూ ఎన్టీఆర్ గురించి చెబుతూ కంటతడి పెట్టిన ప్రముఖ నటి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటి, తల్లి పాత్రలతో అలరిస్తున్న తులసి... ఇటీవల ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన్ను కలవడానికి వెళ్లినపుడు ఎంతో గొప్పగా రిసీవ్ చేసుకున్నాడని తెలిపారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ... తులసి కాస్త ఎమోషన్ అయ్యారు. అప్పటి వరకు ఎన్టీఆర్ గురించి విన్నాను.... ఆయన్ను కలిసాక ఇంకా అర్థమైంది. నాకు కళ్లలో నీళ్లు తిరగడం చూసి ఆయన కళ్లు కూడా చెమర్చాయని తులసి తెలిపారు.

నేనున్నాననే భరోసా ఇచ్చారు

నేనున్నాననే భరోసా ఇచ్చారు

నా కోసం షూటింగ్ వదిలేసి మరీ మీరిలా వచ్చారు అని అంటే మీకెందుకమ్మా నేనున్నాను అనే భరోసా ఇచ్చారు. కంట్లో ఆ తడి ఎందుకు రావాలమ్మా అని అన్నారు. అదే నన్ను బాగా కదిలించేసింది అని తులసి తెలిపారు.

మహనీయుడు అవుతాడు

మహనీయుడు అవుతాడు

జూ ఎన్టీఆర్ గురించి నేను చాలా చోట్ల విన్నాను. ఆయన మాటిస్తే మాటే. చాలా పద్ధతి గల మనిషి. చాలా మంచి మనిషి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. అన్ని విద్యలు తెలిసిన వ్యక్తి. ఆ అబ్బాయి ఇక్కడితో ఆగడు. మహనీయుడు అవుతాడు. ఆయన ఒట్టి యాక్టర్‌గానే కాదు.. సమాజానికే ఓ స్ఫూర్తిగా నిలుస్తారు అని తులసి తెలిపారు.

ప్రభాస్ గురించి అప్పుడే చెప్పాను

ప్రభాస్ గురించి అప్పుడే చెప్పాను

నేనింత వరకు చెప్పినవన్నీ జరిగాయని తులసి అన్నారు. మనసులో ఏ చెడు లేనప్పుడు ఎవ్వరు చెప్పినా జరుగుతాయి. డార్లింగ్ చేసేటప్పుడు ప్రభాస్ గురించి కూడా చెప్పాను. ఇప్పుడు ఆయనెక్కడున్నారో తెలుసు. అలా అని నేను చెబుతున్నాను కాబట్టి అలా జరిగింది అని నేను అనడం లేదు అని తులసి వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్ బంగారం

ఎన్టీఆర్ బంగారం

నేను ఎన్టీఆర్‌ను కలవడం అదే మొదటి సారి అయినా... నాకోసం ప్రత్చేకంగా వచ్చి కలిశారు. ఆయన అమ్మా అని నన్ను పిలిచారు. నిజమే నేను ఆయనకు అమ్మ లాంటిదాన్నే. ఎన్టీఆర్ బంగారం. ఈ అబ్బాయి మీరు చూసే అబ్బాయి కాదు. ఎక్కడో ఉండాల్సిన అబ్బాయి'' అని అంటూ ఎంతో గొప్పగా చెప్పారు తులసి.

English summary
Actress Tulasi Expresses Real Behavoiur of Jr NTR in an Interview.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu