»   » జూ ఎన్టీఆర్‌ రాకుండా కుట్ర, అతడో జోకర్ ....నటి తులసి సంచలనం!

జూ ఎన్టీఆర్‌ రాకుండా కుట్ర, అతడో జోకర్ ....నటి తులసి సంచలనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గత రెండు దఫాలుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో జరుగుతున్న రాజకీయాలు సాధారణ ప్రేక్షకులను విస్మయానికి గురి చేస్తున్నాయి. అప్పట్లో రాజేంద్రప్రసాద్ ఎన్నిక సమయంలో జరిగిన రచ్చ ఇప్పటికీ ఇంకా ఎవరూ మరిచిపోలేదు.

తర్వాత 'మా' అధ్యక్ష పీఠాన్ని నటుడు శివాజీ రాజా దక్కించుకున్నారు. మరో దఫా రాజేంద్రప్రసాద్ కొనసాగాల్సి ఉన్నా శివాజీ రాజా తెర వెనక రాజకీయాలు చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో అలిగిన రాజేంద్రప్రసాద్.... 'మా'తో అంటీ ముట్టనట్లు ఉంటున్నారని టాక్. తాజాగా శివాజీ రాజా వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయింది.

శివాజీ రాజాపై సంచలన ఆరోపణలు

శివాజీ రాజాపై సంచలన ఆరోపణలు

‘శంకరాభరణం' సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్‌ నటి తులసి తాజాగా ‘మా' అధ్యక్షుడు శివాజీరాజాపై తీవ్ర ఆరోపణలు చేశారు. అతణ్ని ఓ జోకర్‌గా అభివర్ణించారు.

శివాజీ రాజా కుట్ర చేశాడు

శివాజీ రాజా కుట్ర చేశాడు

తాను తలపెట్టిన శంకరాభరణం అవార్డుల కార్యక్రమానికి యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌ను రాకుండా కుట్ర చేసింది శివాజీరాజా అని తులసి ఆరోపించారు. నటి తులసి ‘శంకరాభరణం' పేరిట ప్రతీ ఏటా ఉత్తమ నటన కనబరిచిన వారికి అవార్డులు అందజేస్తున్న సంగతి తెలిసిందే.

బోసిపోయిన వేడుక

బోసిపోయిన వేడుక

ఇటీవల హైదరాబాద్‌‌లో శంకరాభరణం అవార్డుల వేడుక నిర్వహించగా...ఆ వేడుకకు ఎన్టీయార్‌తోపాటు పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించారు తులసి. అయితే వారెవరూ ఆ వేడుకకు రాలేదు. దీంతో ఆ వేడుక కాస్తా బోసిపోయింది.

ఎదగకుండా పన్నాగాలు

ఎదగకుండా పన్నాగాలు

తాను నిర్వహిస్తున్న ఈ అవార్డులకు ప్రముఖులు వస్తే తన స్థాయి మరింత పెరుగుతుందనే ఉద్దేశ్యంతో ఎవరూ ఈ అవార్డుల వేడుకకు రాకుండా శివాజీ రాజా పన్నాగాలు పన్నారని, వారు రాకపోవడానికి కారణం ‘మా' అధ్యక్షుడు శివాజీరాజాయేనని తులసి ఆరోపించారు.

జూ ఎన్టీఆర్ గురించి చెబుతూ కంటతడి పెట్టిన ప్రముఖ నటి!

జూ ఎన్టీఆర్ గురించి చెబుతూ కంటతడి పెట్టిన ప్రముఖ నటి!

ప్రముఖ తెలుగు నటి, తల్లి పాత్రలతో అలరిస్తున్న తులసి... ఇటీవల ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే ఆమె కంటతడి పెట్టారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Actress Tulasi described Movie Artistes Association (MAA) President Shivaji Raja as a Joker. 'Sivaji Raja MAA President a joker, forgets he is a junior to me n just an actor. Sivaji Raja forgets posts are not permanent a clown,' she wrote on her Twitter handle.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu