twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా దేహం.. నా ఇష్టం.. త్వరలో మీ చెంతకు.. మీరెవరు ప్రశ్నించడానికి..

    1947లో దేశ విభజన సమయంలో కుటుంబానికి దూరమైన బ్రోతల్ యజమాని కథనే ఈ చిత్ర కథ. ఈ చిత్రానికి శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. బెంగాలీలో రాజ్ కహినిగా రూపొందిన చిత్రం బేగం జాన్‌కు మాత‌ృక.

    By Rajababu
    |

    'నా దేహం.. నా ఇల్లు.. నా దేశం.. నా రూల్స్' అంటూ విడుదలైన బేగం జాన్ ఫస్ట్‌లుక్ పోస్టర్ బాలీవుడ్‌లో ఆసక్తిని రేపుతున్నది. కహానీ, డర్టీ పిక్చర్, కహానీ2 చిత్రాల తర్వాత బేగం జాన్‌గా బ్రోతల్ పాత్రలో విద్యాబాలన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఏప్రిల్ 14న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు.

    కసి కసిగా.. బేగం జాన్‌గా

    కసి కసిగా.. బేగం జాన్‌గా

    కహానీ2 చిత్రానికి తగినంత ఆదరణ లభించని నేపథ్యంలో కసితో బేగం జాన్ చిత్రంలో నటించినట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం. బేగం జాన్ చిత్రంలో వేశ్యాగృహానికి సంబంధించిన యజమానురాలి పాత్రలో కనిపించనున్నారు.

    ఫస్ట్ లుక్‌కు విపరీతమైన క్యూరియాసిటీ

    ఫస్ట్ లుక్‌కు విపరీతమైన క్యూరియాసిటీ

    ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ విపరీతమైన క్యూరియాసిటిని పంచింది. మీరెవరూ ప్రశ్నించడానికి అనే అర్థం వచ్చే రీతిలో నశం పొడి రంగు గాగ్రా చోళిని ధరించిన ఆమె ఒక చేతిలో హుక్కాతో ఇచ్చిన ఫొటో నెటిజన్లను ఆకర్షిస్తున్నది.

    దేశ విభజన సమయంలో బ్రోతల్..

    దేశ విభజన సమయంలో బ్రోతల్..

    1947లో దేశ విభజన సమయంలో కుటుంబానికి దూరమైన బ్రోతల్ యజమాని కథనే ఈ చిత్ర కథ. ఈ చిత్రానికి శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. దేశ విభజన సమయంలో బ్రోతల్ కంపెనీ నడిపే యజమానిగా విద్య నటించారు. కొందరు మహిళలను బలవంతంగా పాకిస్థాన్‌కు, మరికొందరిని ఇండియాకు పంపిన తీరును ఈ చిత్రంలో చక్కగా చిత్రీకరించారట.

    త్వరలో మీ చెంతకు వస్తున్నా..

    త్వరలో మీ చెంతకు వస్తున్నా..

    బేగం జాన్ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఇటీవల విద్యాబాలన్ ట్వీట్ చేసింది. త్వరలోనే మీ చెంతకు వస్తున్నా అంటూ ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, ఇలా అరుణ్, గౌహర్ ఖాన్, పల్లవి శ్రద్ధ, రజిత్ కపూర్, ఆషిష్ విద్యార్థి, వివేక్ ముష్రాన్, చంకీ పాండే, పూనమ్ సింగ్ రాజ్‌పుత్, రిధీమా తివారీ తదితరులు నటించారు.

    బెంగాలీ వెర్షన్‌లో రాజ్ కహినీగా..

    బెంగాలీ వెర్షన్‌లో రాజ్ కహినీగా..

    బెంగాలీలో రాజ్ కహినిగా రూపొందిన చిత్రం బేగం జాన్‌కు మాత‌ృక. బెంగాలీ చిత్రంలో విద్యా బాలన్ ప్రస్తుతం పోషించే పాత్రను రీతుపర్ణ సేన్‌గుప్త పోషించారు. ఈ చిత్రాన్ని హిందీలో రూపొందించాలని భావించినప్పుడు కేవలం విద్యా బాలన్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకొన్నారట.

    పవర్ పాత్ర కేవలం విద్యకే సాధ్యం

    పవర్ పాత్ర కేవలం విద్యకే సాధ్యం

    అలాంటి పవర్‌ఫుల్ పాత్రలను పోషించాలంటే విద్యా బాలన్ లేదా రాణీ ముఖర్జీకే సాధ్యమవుతుంది. నా తొలి ఛాయిస్ విద్య. మరో నటి నా దృష్టికి రాలేదు నఅి దర్శకుడు ముఖర్జీ తెలిపారు.

    English summary
    The first look poster of Vidya Balan's Begum Jaan is out. Begum Jaan, a Hindi adaptation of Mukherji’s stellar Bengali offering Rajkahini, stars Vidya in the lead, a brothel’s madam in Punjab during India’s partition in 1947.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X