»   »  వీళ్ళు ఫ్యాన్సా?: చుట్టుముట్టి ఆదాశర్మ ని టచ్ చేయాలని...

వీళ్ళు ఫ్యాన్సా?: చుట్టుముట్టి ఆదాశర్మ ని టచ్ చేయాలని...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సమంత, తాప్సీ, హెబ్బా పటేల్ ఈ మధ్యకాలంలో ప్రెవేట్ ఈవెంట్స్ లో చుట్టూ మూగిన అభిమానులమటూ మూగిన జనంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అలాంటి సమస్యే అదాశర్మకు ఎదురైంది. తన తాజా చిత్రం క్షణం ప్రమేషన్ కోసం షాపింగ్ మాల్ కు వెళ్లిన ఆమెకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది.

దాదాపు ఇరవై మంది సెక్యూరిటీ ఉన్నా చుట్టూ చేరిన జనాలని కంట్రోలు చేయలేకపోయారు. చాలా మందిని ఆమె దగ్గరగా వెళ్లాలని ముట్టుకోవాలని ఆత్రతపడటంతో ఆమె ఇబ్బందుల్లో పడింది. కొందరైతే అంతపనీ చేసారు. ఈ సంఘటనతో కంగారు పడ్డ అదా శర్మ ..వెంటనే ఎయిర్ పోర్ట్ కు వచ్చి హైదరాబాద్ ప్లైట్ ఎక్కేసింది.

 Adah Sharma mobbed in Vijayawada

హార్ట్ ఎటాక్ చిత్రంతో పరిచయమై, రీసెంట్ గా గరం, క్షణం చిత్రాలతో పలకరించిన భామ అదాశర్మ. అదాశర్మ నటించిన క్షణం చిత్రం మంచి సక్సెస్‌ కాగా ఆ ఆనందాన్ని ప్రేక్షకులతో పంచుకనేందుకు విజయవాడలోని ఓ షాపింగ్‌ మాల్‌కు వెళ్లింది. ఇక విజయవాడ వెల్లబోయే విషయాన్ని ముందుగా తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది ఆదా.

ఆదాశర్మ వస్తుందని తెలుసుకున్న అభిమానులు అక్కడికి భారీగా చేరుకోవటమే సమస్యగా మారింది. అటువంటి పరిస్ధితుల్లోనూ ఆదా అభిమానులతో అలాగే కాసేపు సందడి చేయగా తిరుగు ప్రయాణంలో విపత్కర పరిస్థితిని ఎదుర్కొందట. ఆదాను కలిసేందుకు కొందరు జనాలు ఆమె మీదకు దూసుకు రావడంతో వాళ్ళని కంట్రోల్ చేయలేక సెక్యూరిటీ చేతులు ఎత్తేయటమే సమస్యగా మారిందని చెప్తున్నారు.

English summary
Actress Adah Sharma has to face the wrath of these barbaric fans who always stand tall to molest heroines in the name of admiration.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu