»   » బాలీవుడ్ అందాలతారను ఎండలో నడిపించారు: ఎందుకు?

బాలీవుడ్ అందాలతారను ఎండలో నడిపించారు: ఎందుకు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మనం ఎంత సుఖంగా ఉన్నా, సంఘం లో మన స్థానం ఏదైనా కొన్ని సార్లు పరిస్థితులకు తల వంచక తప్పదు. ఎంతటి వారైనా చిన్న తప్పులకే అవమానాన్నీ పొందక తప్పదు. డ్రైవర్ చేసిన తప్పువల్ల ఆ బాలీవుడ్ హీరోయిన్ సెగలు కక్కే ఎండలో నే డిల్లీ లో నడి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఓ బాలీవుడ్ హీరోయన్‌కు ఎదురైంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ ఏమా కథ...!!?

డిల్లీ లో నడి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఓ బాలీవుడ్ హీరోయన్‌కు ఎదురైంది. తెలుగు అమ్మాయే అయినా బాలీవుడ్‌లో హీరోయిన్‌గా వెలుగుతున్న అదితి రావు నోయిడాలో ఒక పెద్ద షాపింగ్ మాల్ లో నిర్వహిస్తున్న ఫ్యాషన్‌ షోకు నడిచి వెళ్లాల్సి వచ్చింది. అదీ 45 డిగ్రీల ఎండలో..

రాంగ్ రూట్‌లో వస్తున్నందుకు ఆమె కారును పోలీసులు సీజ్ చేయడంతో ఇలా జరిగింది. నోయిడాలో అత్యంత ఖరీదైన సెక్టార్ 18లో కొత్తగా తెరిచిన మాల్‌లో నిర్వహించే ఫ్యాషన్ షోకు ఆమె వెళ్లాల్సి ఉంది. అదే సెక్టార్‌లోని ఓ ఫైవ్‌ స్టార్ హోటల్లో ఆమె ఉంది.

Adithi rao faces bad experience

అక్కడి నుంచి తన జాగ్వార్ కారులో ఆమె బయల్దేరగా, ఆమె సహాయకులు వెర్నా కారులో ఆమె వెంటే వెళ్లారు. అయితే.. త్వరగా వెళ్లాలన్న తొందరలో ఆ కారు డ్రైవర్ రాంగ్ రూట్లో కారునిఒ మళ్ళించాడట. అంతలో ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ధర్మేంద్ర యాదవ్ వీరి కారును ఆపారు. వెంటనే కేసు బుక్ చేస్తున్నట్టు కారు వివరాలను నోట్ చేసుకోవటం మొదలు పెట్టారు.

ఆపేసరికి అందులో ఎవరున్నారో తనకు తెలియదని, అయినా అలా వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆపానని ఆయన చెప్పారు. కాసేపటికే వెనకాల వెర్నాలో వచ్చిన సహచరులు.. అది బాలీవుడ్ సెలబ్రిటీ కారని, అందువల్ల వదిలేయాలని కోరారు.

కానీ, పేపర్ వర్క్ పూర్తి కాకుండా కారును పంపేది లేదని చెప్పిన ఇనిస్పెక్టర్ కారుని వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. . ఈలోపు వెనకాల వచ్చినవాళ్లు నానా హడావుడి చేసి, మాల్ యాజమాన్యానికి ఫోన్లు చేశారు. అటు నుంచి వెంటనే కారును పంపాలంటూ ఇన్‌స్పెక్టర్‌పై ఒత్తిడి వచ్చింది.

అయినా ఇన్‌స్పెక్టర్ మాత్రం కామ్‌గా తన పనిచేసుకుంటున్నారు.
వెనక వచ్చిన కారుని కూడా వెనక్కి తిప్పి వెళ్తే ఆలస్యమౌతుందని అర్థం చేసుకున్న అదితి రావు కిందకు దిగి, నడుచుకుంటూ మాల్‌కు వెళ్లిపోయిందట!అయితే ఈ కారుని ఆపిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలొ హీరో అయిపోయాడు.

English summary
Bollywood actress Adithi rao faced bad experience in Noida
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu