»   » ఆ ఇద్దరు భామలతో వరుణ్ తేజ్.. అంతరిక్షంలో రొమాన్స్

ఆ ఇద్దరు భామలతో వరుణ్ తేజ్.. అంతరిక్షంలో రొమాన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తొలిప్రేమ ఘనవిజయం సక్సెస్ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రానికి ఘాజీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అంతరిక్ష కథా నేపథ్యంగా సాగే చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన అందాల భామలు అదితిరావు హైదరీ, లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు.

ఈ చిత్రం ఏప్రిల్ చివరివారంలో సెట్స్‌పైకి వెళ్తుంది. ఈ చిత్రాన్ని ఏడాది చివర్లో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి వై రాజీవ్ రెడ్డి, దర్శకుడు క్రిష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Aditi Rao Hydari, Lavanya Tripathi to work with Varun Tej in Sankalp Reddy movie

అంతరిక్ష నేపథ్యం కావడంతో జీరో గ్రావిటీ పరిస్థితులకు అనుగుణంగా షూటింగ్ చేయాల్సి ఉంటుంది. దానికి కోసం శిక్షణ పొందేందుకు వరుణ్ తేజ్, సంకల్ప్ కజకిస్థాన్ వెళ్తున్నారు. ఈ చిత్రాన్ని అమెరికాలో షూట్ చేయాలని నిర్ణయించారు. జార్జియాలో ప్రత్యేకంగా వేసే సెట్లలో సినిమా చిత్రీకరిస్తారు. యాక్షన్ సీక్వెన్సుల కోసం హలీవుడ్ సాంకేతిక నిపుణులను ఎంపిక చేశారు.

అదితిరావు ప్రస్తుతం సుధీర్‌బాబుతో కలిసి సమ్మోహనం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మే చివరి వారంలో గానీ, జూన్ మొదటివారంలో గానీ రిలీజ్ కానున్నది.

English summary
Varun Tej-director Sankalp Reddy space drama has new additions to its star cast. Actors Aditi Rao Hydari and Lavanya Tripathi are all set to join the team. The makers on Monday officially announced via a statement that Aditi and Lavanya have been signed as the leading ladies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X