జర్నలిస్టుపై దాడిచేసిన నటుడు ఆదిత్య పంచోలి

ఆదిత్య పంచోలి తనయుడు సూరజ్ పంచోలి జియా ఖాన్ సూసైడ్ కేసులో పలు ఆరోపణలు ఎదర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతన్ని ప్రశ్నించేందుకు జీ మీడియా రిపోర్టర్ పంచోలి నివాసానికి వెళ్లాడు. దీంతో సహనం కోల్పోయిన పంచోలి రిపోర్టర్‌తో పాటు అతని టీంను దుర్భాషలాడారు. రిపోర్టర్‌పై దాడి చేసాడు.
కొత్త కాలం క్రితం.....ఆదిత్య పంచోలిపై ఐపీసి సెక్షన్ 452, 323 కింది కేసు నమోదైన సంగతి తెలిసిందే. తన పొరుగున ఉండే భార్గవ్ పటేల్‌పై దాడి చేసిన కేసులో అప్పుడు ఆ కేసు నమోదైంది. ఇటీవల తన కారును చుట్టుముట్టిన జర్నలిస్టులపై కూడా అనుచితంగా ప్రవర్తించారాయన.
జియా ఖాన్, ఆదిత్య పంచోలి తనయుడు సూరజ్ పంచోలి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్య సంఘటన చోటు చేసుకోవడంతో సూరజ్ పంచోలి అరెస్టు అయ్యాడు. తన కొడుకు కేసుకు సంబంధించి మీడియా అతి చేస్తోందంటూ ఆదిత్య పంచోలి ఆగ్రహంగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











