»   » సీన్స్ బూతు,వెగటు..అందుకే బ్యాన్

సీన్స్ బూతు,వెగటు..అందుకే బ్యాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కరాచీ: విమర్శలు ఎదుర్కొంటున్నా, మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్న ‘క్యా కూల్‌ హై హమ్‌ 3' చిత్రానికి పాకిస్ధాన్ లో ఎదురుదెబ్బ తగలింది. దీనిపై నిషేధం విధిస్తున్నట్లు పాక్‌ సెన్సార్‌బోర్డు ప్రకటించింది. నిబంధనలను అతిక్రమించి సినిమాను ప్రదర్శించిన డిస్ట్రిబ్యూటర్లకు భారీ జరిమానా విధిస్తామని

బాలీవుడ్‌ నటులు తుషార్‌ కపూర్‌, అఫ్తాబ్‌ శివదాసని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘క్యా కూల్‌ హై హమ్‌ 3'. పోస్టర్ల విడుదల నుంచే ఎన్నో విమర్శలను ఎదుర్కొంటున్న ఈ చిత్రంలో అశ్లీలత శృతి మించి ఉంది. వెగటు పుట్టించే సన్నివేశాలు, ద్వందార్థాలు ఉండటంతో ఇది యువతపై ప్రభావం చూపుతుందని పాక్‌ సెన్సార్‌బోర్డు వ్యాఖ్యానించింది. అందుకే ఈ చిత్రాన్ని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది.

Adult comedy 'Kyaa Kool Hain Hum 3' banned in Pakistan

చిత్రం కథేమిటంటే...థాయ్‌ల్యాండ్‌లో ఎక్కువ భాగం జరిగే ఈ చిత్రం కథలో బడా బిజినెస్‌ మాగ్నెట్‌(శక్తికపూర్‌) ముద్దుల కొడుకు కన్నయ్య(కన్హయ్య- తుషార్‌ కపూర్‌). థాయ్‌ల్యాండ్‌లో ఉండే అతని ఫ్రెండ్ మైకీ (కృష్ణ అభిషేక్‌) పిలిస్తే ఇంకో ఫ్రెండ్ రాకీ (అఫ్తాబ్‌)ని తీసుకుని థాయ్‌లాండ్‌ వెళ్తాడు. ఇంతాచేసి అక్కడకి వెళ్లాక... మైకీ ఒక పోర్న్‌ ప్రొడక్షన్‌ ని రన్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఫోర్న్ అనగనే ఉత్సాహపడి..,ఫ్రెండ్స్ ఇద్దరూ తామూ బాలీవుడ్‌ హిట్‌ సినిమాల్ని ప్యారడీ చేస్తూ అక్కడ పోర్న్‌ స్టార్లుగా మారిపోతారు.మైకీ ప్రోత్సాహంతో అతని ‘పోర్న్‌' బిజినెస్ లో పార్టనర్స్ గా మారేందుకు సిద్ధమవుతారు. అదే టైంలో ఓ ట్విస్ట్...

కన్నయ్య ఓ అమ్మాయి(మందనా కరిమి)తో ప్రేమలో పడతాడు. అయితే.. అమ్మాయి వాళ్లు ట్రెడిషనల్ ఫ్యామిలీ అని తెలుస్తుంది. దాంతో తానొక పోర్న్‌ స్టార్‌ అని తెలిస్తే.. లేనిపోని తలనొప్పులు వస్తాయన్న ఉద్దేశంతో... అమ్మాయి తండ్రికి తానూ మంచి సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చానంటూ అబద్ధం చెప్పేస్తాడు. అక్కడ నుంచి ఆ అబద్ధాన్ని నిజం చేసేందుకు రకరకాల అబద్దాలు ఆడుతూ. నానా పాట్లు పడాల్సివస్తుంది. చివరకు ఏమైంది... కన్నయ్య తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

English summary
Bollywood adult comedy 'Kya Kool Hain Hum 3' has been banned in Pakistan after the censor board there decided that the movie was unsuitable for public viewing.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu