»   » పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ ముఖానికి రంగేసుకొన్న శ్రీదేవి

పదిహేను ఏళ్ళ తర్వాత మళ్ళీ ముఖానికి రంగేసుకొన్న శ్రీదేవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

సుమారు రెండు దశాబ్దాల పాటు తన అందచందాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన శ్రీదేవి, పదిహేను సంవత్సరాల తర్వాత నిన్న మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. ఆమె తాజాగా నటిస్తున్న'ఇంగ్లిష్ వింగ్లిష్' సినిమా షూటింగ్ ముంబైలోని యష్ రాజ్ స్టూడియోస్ లో ప్రారంభమైంది. బాలీవుడ్ ఫిలిం మేకర్ బాల్కీ భార్య గౌరీ షిండే దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

చాలా కాలం తర్వాత మళ్లీ తను నటిస్తుండడంతో శ్రీదేవి భర్త బోనీకపూర్, ఫిలిం మేకర్ బాల్కీ కూడా స్టూడియోలో ఆమె చెంత వున్నారు. అలాగే, బాలీవుడ్ ప్రముఖుడు యష్ చోప్రా, అతని తనయుడు ఆదిత్య చోప్రా కూడా స్టూడియోకొచ్చి శ్రీదేవిని కలిశారు. చాలా కాలం తర్వాత సొంతింటికి వచ్చిన దానిలా శ్రీదేవి ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపించింది. తను మళ్లీ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేస్తుందని ఆమె భర్త బోనీకపూర్ ఈ సందర్భంగా నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.

English summary
Sridevi came back in front of the camera. Having stayed away from the flashlights for fifteen long years, the actress shot the first scene for her comeback film, Gauri Shinde's English Vinglish.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu