»   » బుల్లి మగధీరుడు ఇపుడు స్కూల్లో, కష్టపడ్డ రామ్ చరణ్ (ఫోటోస్)

బుల్లి మగధీరుడు ఇపుడు స్కూల్లో, కష్టపడ్డ రామ్ చరణ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య సోషల్ మీడియాలో బుల్లి మగధీర చేసిన హడావిడి చూసేవుంటారు. నల్గొండ జిల్లాకు చెందిన పరశురాం అనే  బుడతడు మగధీర చిత్ర క్లైమాక్స్ సన్నివేశాల డైలాగులను గుక్కతిప్పుకోకుండా చెప్పాడు. ఈ వీడియో దృశ్యాలు చూసిన రామ్ చరణ్ అతన్ని కలిసాడు కూడా. బాగా చదువుకో నేను నిన్ను హీరోని చేస్తా అని మాటిచ్చాడు.

ఇచ్చిన మాట ప్రకారం అతన్ని ముందు స్కూల్లో కూడా చేర్పించాడు. పరశురాంను స్కూల్లో చేర్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అతడు బాగా చదువుకుంటాడని ఆశిస్తున్నట్లు రామ్ చరణ్ తన సోషల్ నెట్వర్కింగ్ పేజీలో చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన విషయాలను రామ్ చరణ్ తన సోషల్ నెట్వర్కింగులో పోస్టు చేసాడు. రామ్ చరణ్ సినిమాలోని మగధీర డైలాగుతో పాటు పలువురు స్టార్ హీరోల డైలాగులను అవలీలగా చెప్పేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన బుడతడు బుద్దిగా చదువుకుంటాడో? లేదో?

Meeku ee abhai gurthunada?? After a lot of convincing we managed to put him in a school...now let's hope this kid studies well ..

Posted by Ram Charan onThursday, July 2, 2015

ఆ సంగతి పక్కన పెడితే...రామ్ చరణ్ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ చిత్రానికి బ్రూస్ లీ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

English summary
Did you remember that young cute kid who said the dialogue with perfection emotion, "Maatistunna Share Khan.."? He is little boy named Parasuram from Aiza who met Ram Charan sometime back as the star hero desired to find this kid at any cost and meet him
Please Wait while comments are loading...