»   »  దాసరిని కలిసిన పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్...ఏం జరుగుతోంది?

దాసరిని కలిసిన పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్...ఏం జరుగుతోంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాసరి నారాయణరావుకు చెందిన సినిమా నిర్మాణ సంస్థ కోసం ఓ సినిమా చేస్తానని చాలా రోజుల క్రితమే కమిటైన సంగతి తెలిసిందే. 'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో ఫంక్షన్ సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని స్పష్టం చేసారు. పవన్ కళ్యాణ్‌కు సూటయ్యే సరైన కథ దొరకక పోవడంతో సినిమా ఇంకా పట్టాలెక్కలేదు.

ఇప్పటికీ పవన్ కళ్యాణ్ తో దాసరి చేయబోయే సినిమా ఓ కొలిక్కి రాలేదు. తన బర్త్ డే ఇంటర్వ్యూలో దాసరి మాట్లాడుతూ...పవన్‌ కల్యాణ్‌ సినిమా ఈ ఏడాది ఉంటుంది. ఈ చిత్రానికి దర్శకుడెవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. అయితే ఆ చిత్రం యొక్క స్క్రిప్ట్‌ వర్క్‌ వేగంగా జరుగుతోంది అని తెలిపారు.

దాసరి పుట్టినరోజును పురస్కరించుకుని పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఇటీవల ఆయన నివాసానికి వెళ్లి కలిసారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్భంగా వారు సినిమా గురించిన విషయాలపై కూడా మాట్లాడినట్లు సమాచారం.

వీరి మీటింగ్ తర్వాత ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. దాసరి సినిమా కోసం పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మరోసారి కలిసి పని చేయబోతున్నారని స్పష్టమయినట్లయింది. అయితే ఈ సినిమాకు త్రివిక్రమ్ కేవలం స్క్రిప్టు వర్క్ మాత్రమే చేస్తారని టాక్.

మరో వైపు 'గబ్బర్ సింగ్' దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి పవన్ కళ్యాణ్ సినిమా దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు దాసరి వైపు నుండి ప్రయత్నాలు చేస్తున్నాడట. హరీష్ శంకర్ అంటే పవన్ కళ్యాణ్‌కు కూడా ఎలాంటి అభ్యంతరం ఉండదని అంటున్నారు.

దాసరిని కలిసిన పవన్-త్రివిక్రమ్

దాసరిని కలిసిన పవన్-త్రివిక్రమ్


దాసరి నారాయణరావు పుట్టినరోజును పురస్కరించుకుని పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఇటీవల ఆయన నివాసంలో కలిసారు.

కొలిక్కిరాని ప్రాజెక్ట్

కొలిక్కిరాని ప్రాజెక్ట్


దాసరి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చే సినిమా ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పవన్‌ కల్యాణ్‌ సినిమా ఈ ఏడాది ఉంటుంది. ఈ చిత్రానికి దర్శకుడెవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. అయితే ఆ చిత్రం యొక్క స్క్రిప్ట్‌ వర్క్‌ వేగంగా జరుగుతోంది అని దాసరి తెలిపారు.

త్రివిక్రమ్ స్క్రిప్టు

త్రివిక్రమ్ స్క్రిప్టు


ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రిప్టు రైటర్ గా పని చేస్తారని అంటున్నారు.

హరీష్ శంకర్ ప్రయత్నాలు

హరీష్ శంకర్ ప్రయత్నాలు


దాసరి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కే సినిమాకు దర్శకుడిగా అవకాశం దక్కించుకోవడానికి హరీష్ శంకర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

English summary
It is known that Pawan Kalyan has promised to do a film in the production of Dasari Narayana Rao, sometime back. During the release of Sardaar Gabbar Singh, the actor affirmed that he is still sticking to it and said Dasari is in search of good scripts
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu