శ్రీదేవి విషాదం: ఆమె స్థానంలో మాధురి దీక్షిత్... భావోద్వేగంతో వెల్లడించిన జాహ్నవి!
Recommended Video

శ్రీదేవి మరణంతో ఇండియన్ సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆమెతో సినిమాలు ప్లాన్ చేసిన ఫిల్మ్ మేకర్స్ ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ శ్రీదేవితో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ చిత్రానికి '2 స్టేట్స్' ఫేం అభిషేక్ వర్మన్ దర్శకుడిగా ఖరారయ్యాడు కూడా. అయితే అంతలోనే ఎవరూ ఊహించని విషాదం చోటు చేసుకుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.... శ్రీదేవి స్థానాన్ని ప్రముఖ నటి మాధురి దీక్షిత్‌తో భర్తీ చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ కూడా ఖరారు చేశారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగంతో కూడిన ఒక పోస్టు చేసింది జాహ్నవి.

మాధురికి ధాంక్స్ చెప్పిన జాహ్నవి
శ్రీదేవి, మాధురి కలిసి దిగిన ఫోటోను జాహ్నవి కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అభిషేక్ వర్మన్ చేయబోయే సినిమా కథ అమ్మ హృదయానికి ఎంతో దగ్గరయింది. ఈ అందమైన చిత్రంలో భాగం కాబోతున్న మాధురిజీకి... డాడీ, ఖుషి, నేను థాంక్స్ చెబుతున్నాం అంటూ జాహ్నవి భావోద్వేగంతో వ్యాఖ్యలు చేశారు.

శ్రీదేవికి ట్రిబ్యూట్
ఈ సినిమాలోని పాత్రకు మాధురి దీక్షిత్ పర్‌ఫెక్టుగా సూటవుతుంది. శ్రీదేవితో చేయాలనుకున్న ఈ పాత్రను ఆమెతో రీప్లేస్ చేయడం..... దివంగత నటికి గొప్ప ట్రిబ్యూట్ లాంటిది అని కరణ్ జోహార్ పేర్కొన్నారు.

ఇంతకు ముందు ఏమన్నారంటే...
మాధురి దీక్షిత్ ఈ పాత్రకు ఫైనల్ కావడానికి ముందు చిత్ర యూనిట్ మాట్లాడుతూ.... ‘అభిషేక్ వర్మన్ సినిమా తారాగణం విషయంలో చాలా రూమర్స్ విన్నాం, ఆ వార్తలన్నీ అవాస్తం, ఇప్పటి వరకు ఈ సినిమాలోని ప్రధాన పాత్ర కోసం ఎవరినీ సంప్రదించలేదు. శ్రీదేవి మరణంతో కరణ్ చాలా భాధలో ఉన్నారు. ఆయన అఫీషియల్‌గా చెప్పే వరకు ఏ విషయం నమ్మవద్దు' అని ప్రకటించారు. ఇపుడు కరణ్ జోహార్ స్వయంగా కాకుండా శ్రీదేవి కూతురు జాహ్నవి ద్వారా మాధురి దీక్షిత్ పాత్ర గురించి అఫీషియల్‌గా వెల్లడయ్యేలా చేశారు.

కరణ్ జోహార్ కల నెరవేరకుండానే...
గతంలో ఓ ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ మాట్లాడుతూ...‘శ్రీదేవితో సినిమా చేయాలని చాలా కాలంగా ఓ కోరిక ఉండిపోయింది. ఆమె తెరపై మ్యాజిక్ చేస్తుంది. ఆమెలా మరెవరూ చేయలేరు. అలాంటి గొప్ప నటితో సినిమా చేయాలనే ఒక డ్రీమ్‌తో జీవిస్తున్నాను' అని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు కరణ్ జోహార్ కల నెరవేరక ముందే శ్రీదేవి మరణించారు.

అభిషేక్ వర్మన్ సినిమా విశేషాల్లోకి వెళితే...
ఈ చిత్రానికి ‘సిద్ధాంత్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. సంజయ్ దత్, మాధురి దీక్షిత్, అలియా భట్, వరుణ్ ధావన్, ఆదిత్య రాయ్ కపూర్, సోనాక్షి సిన్హా నటించబోతున్నట్లు సమాచారం.

సంజయ్ దత్-మాధురి దీక్షిత్
బాలీవుడ్లో ఒకప్పుడు సంజయ్ దత్, మాధురి దీక్షిత్ మోస్ట్ ఐకానిక్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక చిత్రాల్లో కలిసి నటించారు. ఇద్దరూ కలిసి చివరగా 1997లో వచ్చిన ‘మహంత' చిత్రం చేశారు. ఇన్నాళ్ల తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ కలిసి నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











