డ్రీమ్ గర్ల్ అమ్మమ్మ అయింది, ఫుల్ హ్యాపీ...
హైదరాబాద్: బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ గా కీర్తి గడించిన హేమా మాలిని అమ్మమ్మ అయింది. హేమా మాలిని, ధర్మేంద్ర దంపతుల కూతురు అహనా డియోల్ జూన్ 11 మగ బిడ్డకు జన్మనిచ్చింది. గతేడాది ఫిబ్రవరిలో అహనా డియోల్ బిజినెస్ మేన్ వైభవ్ వోహ్రాను పెళ్లాడిన సంగతి తెలిసిందే.
తాను అమ్మమ్మ అయిన విషయాన్ని హేమా మాలిని తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేసింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని హేమా మాలిని ట్వీట్ చేసారు. అహనా డియోల్ తల్లయిన విషయం వినగానే ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా ఉంది. ఆమె సోదరి ఈషా డియోల్ కూడా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసారు.

అహనా డియోల్ గురించిన వివరాల్లోకి వెళితే..తల్లిదండ్రులు ధర్మేంద్ర, హేమమాలిని, సోదరి ఇషా డియోల్‌లా బాలీవుడ్ దారి పట్టకుండా తనదైన ప్రత్యేక దారిని ఎంచుకుంది అహనా. ఆమె ఒడిస్సీ నృత్య కళాకారిణి, ఫ్యాషన్ డిజైనర్. వైభవ్ వోరాతో అహనా డియోల్ స్నేహం పెళ్లికి ముందు నుండే ఉంది. స్నేహం కాస్త ప్రేమగా మారి జీవిత భాగస్వాములయ్యారు.


Click it and Unblock the Notifications











