»   »  రోగ్: పూరి సినిమా నుండి ఆమె ఔట్

రోగ్: పూరి సినిమా నుండి ఆమె ఔట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం ‘లోఫర్' మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 17న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం పూరి ‘రోగ్' పేరుతో తెలుగు, కన్నడలో ఓ సినిమా చేస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ కూడా ప్రారంభం అయింది.

నిర్మాత సిఆర్ మనోహర్ అన్న కొడుకు ఇషాంత్ ఇషాన్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘రోగ్' మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఐషా శర్మ హీరోయిన్ గా చేస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి ఐషా శర్మ తప్పుకున్నట్లు సమాచారం. అయితే ఆమె ఎందుకు తప్పుకుంది అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

 Aisha Sharma walks out of Puri’s Rogue

డేట్స్ అడ్జెస్ట్ చేయడం సమస్య వల్లనే ఆమె తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ షెడ్యూల్ లో ఐషా శర్మ తో బ్యాంకాక్ లో కొంత షూటింగ్ కూడా చేసారు. మరి ఎందుకు ఇలా జరిగింది అనేది తెలియాల్సి ఉంది. ఇంతకు ముందు రామ్ ‘శివం' మూవీలో కూడా ఐషా శర్మ హీరోయిన్ గా ఎంపికైంది కానీ ప్రాజెక్టు మొదలవ్వక ముందే తప్పుకుంది.

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఇప్ప‌టికే అమైరా ద‌స్తూర్ నుఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. మరో హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేస్తారు అనేది తేలాల్సి ఉంది.

English summary
Film Nagar source said that, Aisha Sharma walks out of Puri Jagannadh’s upcoming film Rogue.
Please Wait while comments are loading...