»   » ఇండియాలో అత్యంత ఖరీదైన మూవీ టికెట్స్: లిస్టులో ‘బాహుబలి 2’ టాప్!

ఇండియాలో అత్యంత ఖరీదైన మూవీ టికెట్స్: లిస్టులో ‘బాహుబలి 2’ టాప్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాక్సాఫీసు వద్ద మూవీ కలెక్షన్ల విషయంలో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఏ హీరో సినిమా ఎక్కువ కలెక్షన్లు సాధిస్తే అంత గొప్ప. అభిమానులు కూడా ఈ విషయాన్ని చాలా ప్రెస్టీజియస్‌గా చెప్పుకుంటూ ఉంటారు.

ఇండియాలో ప్రతి ఏడాది వివిధ భాషల్లో ఎన్నో సినిమాలు విడుదలవుతుంటాయి. ఈ సినిమాల్లో బాలీవుడ్ ఖాన్ త్రయం నటించిన సినిమాలే కలెక్షన్ల విషయంలో టాప్ పొజిషన్లో ఉంటూ ఉంటాయి. ఈ కలెక్షన్ల వివరాలు పక్కన పెడితే.... తాజాగా ఇండియాలో అత్యంత కాస్లియెస్ట్ టికెట్స్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది.


ఇండియాలో ఖరీదైన థియేటర్

ఇండియాలో ఖరీదైన థియేటర్

ఇండియాలో అత్యంత ఖరీదైన సినిమా థియేటర్ ఏదైనా ఉంది అంటే... అది ఢిల్లీలోని ‘పివిఆర్ డైరెక్టర్స్ కట్' అనే థియేటర్. ఇందులో సినిమా చూడాలంటే వేలల్లో ఖర్చు పెట్టాల్సిందే. సినిమాకు ఉన్న డిమాండును బట్టి ఈ థియేటర్లో టికెట్స్ రేటు మారుతూ ఉంటుంది.


Baahubali 2 Movie Dandalayya Song By Jabardasth Fame Venu Wonders
బాహుబలి మూవీ టాప్

బాహుబలి మూవీ టాప్

ఇప్పటి వరకు ఈ థియేటర్లో అత్యంత ఎక్కువ ధరకు టికెట్స్ అమ్మకానికి పెట్టిన సినిమాల్లో ‘బాహుబలి 2' మూవీ టాప్ పొజిషన్లో ఉంది. బాహుబలి 2 విడుదలైన సమయంలో డిమాండ్ భారీగా ఉండటంతో ఒక్కో టికెట్ రూ. 2400 ధరకు అమ్మారు. ఇండియాలో అఫీషియల్‍‌గా అత్యంత ఎక్కువ టికెట్ రేటు నమోదైన సినిమా ఇదే.


షారుఖ్ మూవీకి కూడా

షారుఖ్ మూవీకి కూడా

త్వరలోనే విడుదల కాబోతున్న షారుక్ ఖాన్ మూవీ ‘జబ్ హ్యారీ మెట్ సెజల్' మూవీకి డిమాండ్ అదే స్థాయి ఉంది. ఇప్పటికే ఈ థియేటర్లో అడ్వాన్స్ బుకింగ్ మొదలయ్యాయి. ఒక్కో టికెట్ ధర రూ. 2400గా ఉంది.


రెండవ స్థానంలో ఐశ్వర్యరాయ్ మూవీ

రెండవ స్థానంలో ఐశ్వర్యరాయ్ మూవీ

ప్రభాస్ ‘బాహుబలి 2', షారుక్ ‘జబ్ హ్యారీ మెట్ సెజల్' తర్వాత ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్ మూవీ ‘యే దిల్ హై ముష్కిల్' మూవీ అత్యంత ఎక్కువ ధర పలికిన సినిమాగా సెకండ్ ప్లేసులో ఉంది. ఈ సినిమా టికెట్ ‘పివిఆర్ డైరెక్ట్స్ కట్' థియేటర్లో రూ. 2200లకు అమ్మడయింది.


మూడో స్థానంలో సుల్తాన్

మూడో స్థానంలో సుల్తాన్

సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్' మూవీ పివిఆర్ డైరెక్టర్స్ కట్ థియేటర్లో ఒక్కో టిక్కెట్ రూ. 1800లకు అమ్ముడు పోయింది.రయీస్

రయీస్

షారుక్ ఖాన్ నటించిన ‘రయీస్' మూవీ పివిఆర్ డైరెక్టర్స్ కట్ థియేటర్లో ఒక్కో టికెట్ రూ. 1500లకు అమ్ముడయింది.ట్యూబ్ లైట్

ట్యూబ్ లైట్

ఇటీవల భారీ అంచనాలతో విడుదలైన సల్మాన్ ఖాన్ మూవీ ‘ట్యూబ్ లైట్' టికెట్ రూ. 1500లకు అమ్ముడయింది.
English summary
The craze over box-office collection is escalating year by year! Movie buffs are darn crazy to know which movie earned how much and when it comes to the actors, it's mostly the three Khans, who come out with flying colours. But you will be surprised that last year, Aishwarya Rai Bachchan beat Superstar Salman Khan, when it came to costliest movie ticket, with a very good margin.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu