»   » 9 కోట్లు ఇస్తేనే సరే.. లేదంటే మీదారి మీదే.. మెగాస్టార్‌కు తేల్చిచెప్పిన ఐశ్వర్య

9 కోట్లు ఇస్తేనే సరే.. లేదంటే మీదారి మీదే.. మెగాస్టార్‌కు తేల్చిచెప్పిన ఐశ్వర్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకుడు, రాజమౌళి, అందాల నటి శ్రీదేవి వివాదం ఓ పక్క కొనసాగుతుండగానే.. చిరంజీవికి ఐశ్వర్యరాయ్ బచ్చన్ పెట్టిన రెమ్యునరేషన్ డిమాండ్ అంశం మీడియాలో చర్చనీయాంశమైంది. కొణిదెల బ్యానర్‌పై అత్యంత ప్రతిష్థాత్మకంగా రూపొందించనున్న ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి చిత్రంలో హీరోయిన్‌ పాత్ర కోసం ఐశ్వర్యరాయ్ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేశారనే విషయం మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు అగ్రతారల రెమ్యునరేషన్ డిమాండ్ వివాదాస్పదం కావడంపై సినీ వర్గాలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఐశ్వర్య 9 కోట్ల డిమాండ్

ఐశ్వర్య 9 కోట్ల డిమాండ్

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి జీవిత కథను కొణిదెల బ్యానర్‌పై మెగాస్టార్ తనయుడు రాంచరణ్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఐశ్వర్యరాయ్‌ను తీసుకోవాలని భావించారు. ఈ మేరకు సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే చిరంజీవి పక్కన నటించడానికి ఆమె ఆసక్తిని చూపించారు. కానీ రూ. 9 కోట్ల రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేసినట్టు సమాచారం.

అందాల సుందరితో ఉయ్యాలవాడకు రేంజ్

అందాల సుందరితో ఉయ్యాలవాడకు రేంజ్

ఐశ్యర్య రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేసినప్పటికీ ఆమెతో రెమ్యునరేషన్ తగ్గింపు విషయంలో ఇంకా సంప్రదింపులు జరుతున్నట్టు సమాచారం. ఎందుకంటే ఐశ్వర్యరాయ్ హీరోయిన్‌గా నటిస్తే బాలీవుడ్‌లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఉయ్యాలవాడకు రేంజ్ పెరుగుతుందనే అంచనాను మెగా ఫ్యామిలీ వేస్తున్నది. బిజినెస్ పరంగా కూడా వర్కవుట్ అయ్యే అవకాశం ఉంటుందనే కోణంలో ఆలోచిస్తున్నారట.

ప్రతిష్ఠాత్మకంగా చిరంజీవి 151వ చిత్రం

ప్రతిష్ఠాత్మకంగా చిరంజీవి 151వ చిత్రం

ఖైదీ నంబర్ 150 చిత్రం భారీ సక్సెస్ సాధించడంతో చిరంజీవి 151వ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే భారీ హంగులతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించేందుకు కొణిదెల బ్యానర్ ప్లాన్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఐశ్వర్య రాయ్ రెమ్యునరేషన్ అంశం మీడియాలో నానుతుండటంతో చిత్ర యూనిట్‌కు సంబంధించిన వారు స్పందించారు. ఐశ్యర్యరాయ్ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందనే వార్తలో వాస్తవం లేదు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

న్యూయార్క్ పర్యటనలో ఐశ్వర్య

న్యూయార్క్ పర్యటనలో ఐశ్వర్య

ఐశ్వర్య రాయ్ బచ్చన్‌తో సంప్రదింపులు జరిపింది నిజమే. సినిమా కథకు సంబంధించిన స్కిప్ట్‌ను ఆమె చదివారు. ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ న్యూయార్క్ ట్రిప్‌లో ఉన్నారు. ఆమె తిరిగి వచ్చిన తర్వాత చిరంజీవి ఐశ్యర్యను కలిసే అవకాశం ఉంది అని కొణిదెల బ్యానర్‌కు సంబంధించిన వారు వెల్లడించారు.

ప్రియాంక, సోనాక్షి పేర్ల పరిశీలన

ప్రియాంక, సోనాక్షి పేర్ల పరిశీలన

ఇదిలా ఉండగా, ఐశ్వర్యరాయ్‌తోపాటు ఈ చిత్రంలో చిరంజీవి పక్కన హీరోయిన్‌గా ఎంపిక చేయడానికి ప్రియాంక చోప్రా, సోనాక్షి సిన్హా పేర్లను కూడా పరిశీలిస్తున్నారనేది తాజా సమాచారం. ఒకవేళ ఐశ్వర్యరాయ్ రెమ్యునరేషన్‌ విషయంలో తేడా వస్తే ప్రియాంకను తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారట. ఎందుకంటే హాలీవుడ్‌లో ప్రస్తుతం ప్రియాంక జోరు కొనసాగుతున్నది కావున ఆమెను తీసుకొంటే సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది.

English summary
Reports have been doing the rounds that Aishwarya Rai Bachchan has quoted Rs 9 crores for starring in Chiranjeevi’s next film, based on freedom fighter Uyyalawada Narsimha Reddy. Reports suggest that Aishwarya's high fees are mere speculation and nothing else.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu