»   » అతని హత్యపై సినిమా : ఐశ్వర్యరాయ్‌కి లీగల్ నోటీసులు

అతని హత్యపై సినిమా : ఐశ్వర్యరాయ్‌కి లీగల్ నోటీసులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బిడ్డకు జన్మనిచ్చినప్పటి నుండి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఐశ్వర్యరాయ్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ‘జాజ్బా' చిత్రం ద్వారా ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా.

దీని తర్వాత ఆమె ఓ రియల్ లైఫ్ కథాంశంతో తెరకెక్కే చిత్రంలో నటించబోతోంది. పాకిస్థాన్ జైల్లో ఇరవైమూడు సంవత్సరాల పాటు బందీగా వుండి హత్యకు గురైన భారతీయ ఖైదీ సరబ్జీత్‌సింగ్ నిజ జీవితకథతో దర్శకుడు ఓమంగ్‌కుమార్ (మేరీకోమ్ ఫేమ్) ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఇందులో సరబ్జీత్‌సింగ్ సోదరి దల్జీత్ కౌర్ పాత్రలో ఐశ్వర్యరాయ్ నటించబోతుంది.

Aishwarya Rai Bachchan Gets Legal Notice From Sarabjit Singh's Sister

అయితే ఈ సినిమా ఇంకా మొదలు కాక ముందే ఆటంకాలు ఎదురైంది. సరబ్జీత్ సింగ్ మరో సోదరి బల్జిందర్ సింగ్ ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో తన సోదరుడు సరబ్జీత్ సింగ్‌ను నెగెటివ్ షేడ్స్ లో చూపిస్తారని ఆమె భయపడుతోంది. ఈ మేరకు సినిమాను ఆడ్డుకోవడానికి సిద్ధమైంది. దర్శకుడు ఓమంగ్ కుమార్ ఆమెను ఒప్పిస్తారా? లేక కోర్టులో తేల్చుకుంటారా? అనేది తేలాల్సి ఉంది.

1990 సంవత్సరంలో మద్యం మత్తులో పాకిస్థాన్ భూభాగంలోకి ప్రశేశించిన సరబ్జీత్‌సింగ్ ను భారతీయ గూఢచారిగా అనుమానించిన పాక్‌సైన్యం జైల్లో నిర్భందించింది. లాహోర్ జైల్లో 23 సంవత్సరాల పాటు వున్న సరబ్జిత్‌ను భారత పార్లమెంట్‌పై దాడిచేసిన అఫ్జల్‌గురు మరణశిక్షకు ప్రతీకారంగా సహచర ఖైదీలు రెండేళ్ల క్రితం జైల్లోనే హత్య చేశారు. సరబ్జీత్‌సింగ్ జైల్లో ఉండగా కలిసి వచ్చిన ఆయన సోదరి సరబ్జీత్ సింగ్ అక్కడ జైల్లో తన సోదరుడు పడ్డ నరకయాతనను స్వయంగా చూసింది. ఆమె అనుభవాలే కథాంశంగా సినిమాను ప్లాన్ చేస్తున్నారు.

English summary
Apart from her comeback film Jazbaa, Aishwarya Rai Bachchan will also be seen in Sarabjit Singh's biopic which will be directed by Omung Kumar. However, looks like the film will be delayed, if not shelved, as both Aishwarya and the director have got into a legal trouble; thanks to Sarabjit Singh's sister.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu