»   » ట్రైలర్ రిలీజైంది: ఐశ్వర్య రాయ్ సెన్సేషనల్ లుక్ (ఫోటోస్)

ట్రైలర్ రిలీజైంది: ఐశ్వర్య రాయ్ సెన్సేషనల్ లుక్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: కరణ్ జోహార్ దర్శకత్వంలో ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'యే దిల్ హై ముష్కిల్'. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, వీడియో సాంగ్ రిలీజైన తర్వాత సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ట్రైలర్ ఎప్పుడొస్తుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు ట్రైలర్ రిలీజైంది. ఇటీవల విడుదలైన బుల్లయ్యా సాంగులో ఎక్కువగా ఐశ్వర్యరాయ్ నే ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ట్రైలర్లో మేజర్ పోర్షన్ అనుష్క శర్మ ఫోకస్ చేసినా... చివర్ల కొంత సేపు కనిపించే ఐశ్వర్యరాయ్ లుక్ ఎక్కువగా ఆకట్టుకుందని ట్రైలర్ చూసిన వారి అభిప్రాయ పడుతున్నారు.

ఐశ్వర్యరాయ్ ఇంత హాటుగా ఎప్పుడూ లేదని, ఈ సినిమాలో ఆమె తన సెన్సేషనల్ రొమాంటిక్ లుక్ తో అభిమానుల మనసు దోచుకోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా ఐశ్వర్యరాయ్-రణబీర్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు సినిమాలో హైలెట్ కానున్నాయి.

ఐశ్వర్యరాయ్-రణబీర్

ఐశ్వర్యరాయ్-రణబీర్

ఐశ్వర్యరాయ్-రణబీర్ కపూర్ గతంలో ఎప్పుడూ కలిసి రొమాంటిక్ గా నటించలేదు. సినిమాలో అసలు ఏం చూపిస్తారో తెలియదు కానీ... ప్రేక్షకులంతా ఈ హాట్ పెయిర్ రొమాన్స్ చూడటానికి ఆసక్తి చూపుతున్నారు.

సూపర్ కెమిస్ట్రీ

సూపర్ కెమిస్ట్రీ

ఇటీవల విడుదలైన సాంగ్, తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే సినిమాలో మేజర్ హైలెట్ వీరి మధ్య సాంగే రొమాంటిక్ సీన్లే అని స్పష్టం అవుతుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అందుకు ఈ ఫోటోలే సాక్ష్యం.

అతడికంటే వయసులో పెద్ద

అతడికంటే వయసులో పెద్ద

చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఐశ్వర్య రాయ్ ఇలా తెరపై హాట్ లుక్ లో కనిపిస్తోంది. చాన్నాళ్ల తర్వాత తాము కోరుకునే విధంగా... అందాల సుందరి కనువిందు చేస్తోందని, సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అభిమానులు అంటున్నారు. 42 ఏళ్ల వయసున్న ఐష్ తనకంటే దాదాపు 9 సంవత్సరాల చిన్నవాడైన రణబీర్ తో రొమాన్స్ చేస్తుండటం సినిమాకు మరో హైలెట్.

ఆమె కళ్లలో మెరుపు

ఆమె కళ్లలో మెరుపు

ఐశ్వర్యరాయ్ లో చాలా మంది ఇష్టపడేది ఆమె కళ్లే. ఆ చూపుల్లో మెరుపు ఎక్కడో హార్ట్ ను టచ్ చేస్తున్నట్లు ఉంటుంది. బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ కంటే అందమైన కళ్లు మరే హీరోయిన్ కు లేవనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రెట్టీ సైడ్

ప్రెట్టీ సైడ్

ఐశ్వర్యరాయ్ కెరీర్లో చాలా సినిమాలు చేసింది కానీ....ఆమెలోని ఇలాంటి ప్రెట్రీ యాంగిల్ ఏ సినిమాలోనూ చూపించలేదు. ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో, అభిమానుల్లో సినిమాపై అంచనాలు భారీగా పెరగడానికి కారణం అదే.

వయసు అనేది కేవలం నంబర్

వయసు అనేది కేవలం నంబర్

ఐశ్వర్యరాయ్ ని చూసిన ఎవరికైనా ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే... అనే భావన కలుగక మానదు. ఈ వయసులోనూ తన అందాన్ని ఏ మాత్రం చెక్కు చెదరకుండా మెయింటేన్ చేయడం కేవలం ఐశ్వర్యరాయ్ కి మాత్రమే చెల్లింది.

ఫావ్లెస్ బ్యూటీ అనే పదానికి అర్థం..

ఫావ్లెస్ బ్యూటీ అనే పదానికి అర్థం..

చాలా మంది అందమైన అమ్మాయిలను పొగడటానికి పావ్లెస్ బ్యూటీ అనే పదం వాడుతుంటారు. దానికి సరైన అర్థం ఎవరికైనా వివరించాలంటే.... ఐశ్వర్య రాయ్ ని చూపిస్తే చాలు.

ఐశ్వర్యరాయ్ గురించి రణబీర్ మాట్లాడుతూ..

ఐశ్వర్యరాయ్ గురించి రణబీర్ మాట్లాడుతూ..

‘ఐశ్వర్యరాయ్ తో కలిసి నటించడం అనేది నా డ్రీమ్. మా నాన్న మూవీ ‘ఆ అబ్ లౌత్' (ఈ సినిమాలో ఐశ్వర్య నటించింది) సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాను. అప్పుడు ఆమెను చూసినపుడు ఎంతో నచ్చింది. కేవలం ఆమె లుక్ గురించి నేను మాట్లాడటం లేదు. ఆమె బిహేవియర్, క్రమశిక్షణ అన్నీ నాకు బాగా నచ్చాయి. అప్పుడే నాతో ఒక మంచి ఫ్రెండ్ లా మాట్లాడింది. అప్పటి నుండి మా మధ్య స్నేహం ఉంది అని రణబీర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఏమీ మారలేదు

ఏమీ మారలేదు

అప్పటికీ ఇప్పటికీ ఐశ్వర్యలో ఏమీ మార్పు రాలేదు. ఆమె అందం గురించి, ఆమె అచీవ్మెంట్స్ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆ విషయాల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అని రణబీర్ చెప్పుకొచ్చారు.

రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

‘యే దిల్ హై ముష్కిల్ ' చిత్రాన్ని అక్టోబర్ 28న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్, రణబీర్, అనుష్క శర్మ, ఫవాద్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ట్రైలర్

యే దిల్ హై ముష్కిల్ మూవీ ట్రైలర్ సెప్టెంబర్ 22న రిలీజైంది. మీరూ ఓ లుక్కేయండి మరి.

English summary
Finally, the much awaited trailer of Aishwarya Rai Bachchan's upcoming film, Ae Dil Hai Mushkil, is here and her super stunning avatar has left us gasping for breath! While, the major portion of the trailer is shared by Ranbir Kapoor and Anushka Sharma, even in the little trailer space, Aishwarya has stolen all the thunder from Anushka!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu