»   » ఫస్ట్‌లుక్ : ఐశ్వర్యరాయ్‌ని ఇలా చూస్తే మీరూ ఫిదా అయిపోతారు.. (ఫోటోస్)

ఫస్ట్‌లుక్ : ఐశ్వర్యరాయ్‌ని ఇలా చూస్తే మీరూ ఫిదా అయిపోతారు.. (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఐశ్వర్యరాయ్ మరోసారి ట్రెండింగ్ అయ్యారు. ఆమె నటిస్తున్న 'ఫన్నే ఖాన్' అనే చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల అవ్వడమే ఇందుకు కారణం. 40 ప్లస్ వయసులోనూ ఐష్ ఇంత హాట్ అండ్ సెక్సీ లుక్‌లో కనిపించడం అభిమానులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఫోటో చూస్తే ఆమె భర్త అభిషేక్ బచ్చన్ మరోసారి సుందరాంగి ప్రేమలో పడిపోవడం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఫస్ట్ లుక్ ఇదే...

‘ఫన్నే ఖాన్' చిత్రాన్ని నిర్మిస్తున్న కెఏ ఎంటర్టెన్మెంట్స్ వారు ప్రేమికుల రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది.

 అభిషేక్ బచ్చన్ లక్కీ మ్యాన్

అభిషేక్ బచ్చన్ లక్కీ మ్యాన్

ఫన్నేఖాన్ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత ఐష్ అభిమానులంతా మరోసారి అభిషేక్ మీద ఈర్ష్య పడుతున్నారు. ఈ ప్రపంచంలో అభిషేక్ బచ్చన్ అంతటి లక్కీ మ్యాన్ ఎవరూ లేరని, ఇంతటి అందాన్ని తన సొంతం చేసుకున్న అదృష్టవంతుడు అంటూ జెలస్ ఫీలవుతున్నారు.

 అందమైన మనసు కూడా

అందమైన మనసు కూడా

ఐశ్వర్యరాయ్ కేవలం అందగత్తె మాత్రమే కాదని, అందమైన మనసు ఉన్న వ్యక్తి అని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రేరణ అరోరా వ్యాఖ్యానించారు. ఆమెకు ఇంత స్టార్ ఇమేజ్ ఉన్నా ఎప్పుడూ గర్వం, అహంకారం చూపించలేదని తెలిపారు.

ఫన్నే ఖాన్ గురించి మరిన్ని...

ఫన్నే ఖాన్ గురించి మరిన్ని...

ఫన్నే ఖాన్ గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే... ఇదో లవ్లీ మ్యూజికల్ మూవీ. సినిమాలో చాలా పాటలుండబోతున్నాయి. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ తో పాటు అనిల్ కపూర్ కూడా నటిస్తున్నారు. అనిల్ కపూర్ మ్యూజిషియన్ పాత్రలో కనిపించబోతున్నారు.

English summary
Aishwarya Rai Bachchan is trending again, all thanks to her first look from her upcoming film Fanne Khan. The actress is looking so hot in the picture that even her hubby Abhishek Bachchan would fall in love with her again after seeing it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu