For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఐశ్వర్యరాయ్ ఇలా రెచ్చిపోవడం చూసి అంతా షాక్ (ఫోటోస్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: బచ్చన్ ఇంటి కోడలు... బాలీవుడ్ అందాల తార, మాజీ ప్రపంచ సుందరి సెకండ్ ఇన్నింగ్స్ మొదట్లో మహిళ ప్రధానమైన సబ్జెక్టులు ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా సక్సెస్ కాక పోవడంతో ఆమె రూటు మార్చారు.

  ప్రస్తుతం ఆమె కరణ్ జోహార్ దర్శకత్వంలో 'యే దిల్ హై ముష్కిల్' అనే రొమాంటిక్ ఎంటర్టెనర్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తనకంటే చిన్నవాడైన రణబీర్ కపూర్ తో ఐష్ ఇందులో హాట్ హాట్ రొమాంటిక్ సీన్లు చేయడమే ఇందుకు కారణం.

  మరో వైపు ఈ పుకార్లూ మొదలయ్యాయి. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ ఇంత హాటుగా, ఘాటుగా రొమాన్స్ చేయడం బచ్చన్ కుటుంబానికి నచ్చలేదని, ఆ సీన్లపై అభిషేక్ తో పాటు అత్తమామలు ఐష్ పై గుర్రుగా ఉన్నారని వదంతులు వ్యాపించాయి.

  ఆ పుకార్లు వర్షం ఇంకా వెలువక ముందే... 'యే దిల్ మై ముష్కిల్' సినిమా నుండి మరో ఘాటైన సాంగ్ రిలీజ్ చేసారు దర్శక నిర్మాతలు. ఈ సీన్లు సినిమాపై యువతలో మరింత అంచనాలు పెంచాయి.

  సీన్లు మామూలుగా లేవు

  సీన్లు మామూలుగా లేవు

  ఇంటిమేట్ సీన్లు వల్గర్ అనే భావన రాకుండా రొమాంటిక్ గా చిత్రీకరించడం అంటే మామూలు విషయం కాదు. నటీనటుల్లో ఎంతో అనుభవం, దర్శకుడిలో ఎంతో నైపుణ్యం ఉంటే తప్ప అది సాధ్యం కాదు. కరణ్ జోహార్ లాంటి ప్రొఫెషనల్ డైరెక్టర్ కి ఇది పెద్ద విషయం ఏమీ కాదు.

  ఐస్ క్రీం కిస్సింగ్ సీన్

  ఐస్ క్రీం కిస్సింగ్ సీన్

  సాంగులో వచ్చే ఈ ఐస్ క్రీమ్ కిస్సింగ్ సీన్ మరింత రొమాంటిక్ గా ఉంది. 40 ఏళ్ల వయసులో ఐశ్వర్యరాయ్ ఇంత అందంగా, ఇంత రొమాంటిక్ గా ఈ సీన్ పండించడ సూపర్బ్ అంటున్నారు ఫ్యాన్స్.

  ప్రశంసల వర్షం

  ప్రశంసల వర్షం

  ఐశ్వర్యరాయ్ చాలా కాలం తర్వాత మళ్లీ తెరపై ఇంత హాట్ గా, ఏ మాత్రం తీసిపోకుండా ప్రొఫెషనల్ గా కనిపించడంతో బాలీవుడ్ ప్రముఖుల నుండి కూడా ప్రశంసలు వుల్లువెత్తుతున్నాయి.

  సెక్సీ లుక్ అదుర్స్

  సెక్సీ లుక్ అదుర్స్

  ముఖ్యంగా ఇందులో ఐశ్వర్యరాయ్ కాస్ట్యూమ్స్, మేకప్ విషయంలో చాలా కేర్ తీసకున్నారు. అందుకే ఆమె తన గత రెండు సినిమాల కంటే మరింత సెక్సీ లుక్ తో కనిపించారు.

  సెక్సీ లుక్ అదుర్స్

  సెక్సీ లుక్ అదుర్స్

  ముఖ్యంగా ఇందులో ఐశ్వర్యరాయ్ కాస్ట్యూమ్స్, మేకప్ విషయంలో చాలా కేర్ తీసకున్నారు. అందుకే ఆమె తన గత రెండు సినిమాల కంటే మరింత సెక్సీ లుక్ తో కనిపించారు.

  ఎవర్ గ్రీన్ బ్యూటీ

  ఎవర్ గ్రీన్ బ్యూటీ

  ఐశ్వర్యరాయ్ విషయంలో ఎవర్‌గ్రీన్ అనే పదాన్ని ప్రయోగించడంలో ఎలాంటి అతిశయోక్తి కాదేమో. గత 20 ఏళ్లుగా ఆమె వెండితెరపై వన్నెతరగని అందంతో మెరిసిపోతున్నారు.

  హాట్ కెమిస్ట్రీ

  హాట్ కెమిస్ట్రీ

  సినిమాలో ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్ మధ్య సాగే హాట్ సీన్లు సినిమాకే హైలెట్ అయ్యేలా ఉన్నాయి. వీరి మధ్య కెమెస్ట్రి ఇంత బాగా వర్కౌట్ అవుతుందని బహుషా ఈ సీన్లు చూసే వరకు ఎవరూ ఊహించి ఉండరు.

  కరణ్ జోహార్

  కరణ్ జోహార్

  బాలీవుడ్లో సెన్సేషన్ బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ సినిమాలకు కరణ్ జోహార్ పెట్టింది పేరు. ఈ సినిమాతో ఆయన భారీ బ్లాక్ బస్టర్ ప్లాన్ చేసారు. ఈ మధ్య కాలంలో అసలు బాలీవుడ్లో రాని ఒక కొత్త ప్రేమ కథను, రొమాంటిక్ యాంగిల్ ను ప్రేక్షకులకు ఈ సినిమా ద్వారా పరిచయం చేయబోతున్నారు.

  బుల్లెయా సాంగ్

  ఈ పాటపై మీరూ ఓ లుక్కేయండి. ఈ చిత్రాన్ని అక్టోబర్ 28న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

  English summary
  A few days ago, the title track of Ae Dil Hai Mushkil has been released and it took the Bollywood by storm! From Bollywood stars to film critics, everyone was found drooling over the track. And now, the second song of Ae Dil Hai Mushkil, Bulleya is released by the team and all we can say is 'Oh My God!'
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X