»   » కుర్ర వయసులో ఉన్నపుడు ఐశ్వర్య రాయ్, బికినీలో హాట్ హాట్ గా..... ఫోటోస్ వైరల్!

కుర్ర వయసులో ఉన్నపుడు ఐశ్వర్య రాయ్, బికినీలో హాట్ హాట్ గా..... ఫోటోస్ వైరల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ వయసు ఇపుడు 40 ప్లస్. ఈ వయసులోనూ ఆమె వన్నె తరగని అందంతో అందరినీ ఆకట్టుకుంటోంది. మరి ఆమె కుర్ర వయసు (టీనేజ్)లో ఉన్నపుడు ఇంకెంత అందంగా ఉండేదో.... ఊహించుకోవడానికే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది కదూ.

ఈ జనరేషన్ కుర్రాళ్లకు చాలా మందికి ఐశ్వర్యరాయ్ అప్పట్లో ఎలా ఉండేదో తెలియదు. వారందరినీ ఆశ్చర్య పరుస్తూ ఐశ్వర్యరాయ్ కి చెందిన టీనేజ్ ఫోటోస్ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. అప్పట్లో ఐశ్వర్యరాయ్ అందం చూసి ఈతరం కుర్రాళ్లు ముగ్దులయిపోతున్నారు.

ఎంత క్యూట్ గా ఉందో...

ఎంత క్యూట్ గా ఉందో...

ఈ ఫోటోలు చూసారుగా... ఐశ్వర్యరాయ్ అప్పట్లో ఎంత క్యూట్ గా ఉందో.... టీనేజీ వయసులోనే ఐశ్వర్యరాయ్ మోడలింగ్ మీద ఆసక్తితో ఈ రంగం వైపు అడుగులు వేసింది.

మోడలింగ్ రోజుల్లో బికినీలో...

మోడలింగ్ రోజుల్లో బికినీలో...

ఐశ్వర్యరాయ్ మోడలింగ్ రోజుల్లో బికినీ లుక్. అప్పట్లోనే ఐశ్వర్యరాయ్ పలు లీడింగ్ బ్రాండ్ల తరుపున ప్రచారం చేసింది. మెరుపు తీగలాంటి అందంతో అమెను మించిన అంగత్తె ఇంకెవరూ ఉండరేమో అనేలా ఉండేది ఐష్ అందం.

అందాల పోటీల్లో...

అందాల పోటీల్లో...

ఐశ్వర్యరాయ్ కాలేజీలో చదువుకునేప్పటినుంచే మోడలింగ్ చేసేవారు. కొన్ని టీవీ ప్రకటనల్లోనూ నటించిన ఆమె, మిస్ ఇండియా పోటీల్లో రెండో స్థానాన్ని సంపాదించుకున్నారు. 1994లో మిస్ వరల్డ్ పోటీల్లో విజేత అయ్యి విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నారు.

ఐశ్వర్యరాయ్

ఐశ్వర్యరాయ్

కర్ణాటకలోని మంగళూరులో తుళు మాతృభాషగా గల బంట్ కుటుంబంలో ఐశ్వర్యరాయ్ జన్మించారు. ఆమె త్రండ్రి కృష్ణరాజ్ సైన్యంలో పనిచేసేవారు. ఆమె తల్లి బృంద గృహిణి. ఆమె చిన్నతనంలోనే వారి కుటుంబం ముంబైకు మారిపోయింది.

సుస్మితా సేన్‌తో పోటీ

సుస్మితా సేన్‌తో పోటీ

1994 మిస్ ఇండియా పోటీల్లో సుస్మితా సేన్ మొదటి స్థానం పొందగా, ఐశ్వర్య రెండో స్థానం సంపాదించుకున్నారు. అదే ఏడాది జరిగిన విశ్వసుందరి పోటీల్లో విజేతగా నిలిచారు ఐశ్వర్య. మిస్ వరల్డ్ టైటిల్ తో పాటు మిస్ కాట్ వాక్, మిస్ మిరాకులస్, మిస్ ఫోటోజెనిక్, మిస్ పర్ఫెక్ట్ టెన్, మిస్ పాపులర్ టైటిళ్ళు కూడా గెలుచుకున్నారు.

మెడలింగ్‌లో టాప్

మెడలింగ్‌లో టాప్

మోడలింగ్ చేసే రోజుల్లో తన అందం, యాటిట్యూడ్ తో టాప్ మోడల్ గా పేరు తెచ్చుకున్న ఐశ్వర్యరాయ్ కోసం ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు పోటీ పడేవట.

చదువులో చురుకుగా

చదువులో చురుకుగా

ముంబైలోని ఆర్య విద్యా మందిర్ హై స్కూల్ లో ఐశ్వర్యరాయ్ చదువుకున్నారు. చదువులో చాలా చురుకుగా ఉండేవారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జై హింద్ కళాశాలలోనూ, తరువాత మొత్తం మతుంగాలోని డిజి రుపరెల్ కళాశాలలోనూ చదువుకున్నారు ఐశ్వర్య. ఆమె హెచ్.ఎస్.సి పరీక్షల్లో 90శాతం మార్కులు సాధించారు. టీనేజ్ లో ఉండగా ఐదేళ్ళ పాటు శాస్త్రీయ సంగీతం, నృత్యం నేర్చుకున్నారు.

డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యింది

డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యింది

ఐశ్వర్యరాయ్‌కు ఇష్టమైన సబ్జెక్టు జువాలజీ కావడంతో డాక్టరవ్వాలని అనుకునేవారట. ఆ తరువాత ఆర్కిటెక్ట్ అవ్వాలని రచనా సంసంద్ అకాడమీ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో చేరారు. కానీ మోడలింగ్ వైపే ఇష్టం ఉండటంతో చదువు వదిలిపెట్టి అటువైపు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే సినిమాల వైపు అడుగులు వేసారు.

సూపర్ మోడల్ కాంటెస్ట్

సూపర్ మోడల్ కాంటెస్ట్

991లో ఫోర్డ్ సంస్థ నిర్వహించిన అంతర్జాతీయ సూపర్ మోడల్ కాంటెస్ట్ లో గెలిచిన ఐశ్వర్య గురించి ప్రఖ్యాత అమెరికన్ పత్రిక వోగ్ లో వచ్చింది. 1993లో నటుడు ఆమిర్ ఖాన్, మహిమా చౌదరితో కలసి ఆమె నటించిన పెప్సీ యాడ్ పెద్ద హిట్ అయింది. "హాయ్ అయాం సంజన" అని ఆమె చెప్పే ఒక్క డైలాగ్ చాలా ప్రఖ్యాతి పొందింది.

సినిమాలు

సినిమాలు

1994లో మిస్ వరల్డ్ పోటీల్లో విజేత అయిన తర్వాత క్రమ క్రమంగా ఆమె సినిమా వైపు అడుగులు వేసారు. 1997లో తమిళ సినిమా ఇరువర్ (ఇద్దరు) తో తెరంగేట్రం చేశారు. అదే సంవత్సరం హిందీలో ఔర్ ప్యార్ హో గయా సినిమాలో నటించారు. తమిళ్ లో నటించిన జీన్స్ (1998) సినిమాతో మొదటి హిట్ అందుకున్నారు ఐశ్వర్య. హమ్ దిల్ దే చుకే సనమ్ (1999), దేవదాస్ సినిమాల్లోని నటనకుగానూ ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాలు అందుకున్నారు.

హిట్ చిత్రాలు

హిట్ చిత్రాలు

ఆమె నటించిన బెంగాలీ సినిమా చొఖెర్ బలి (2003), రెయిన్ కోట్ (2004), బ్రిటిష్ చిత్రం ప్రొవొక్డ్ (2006) సినిమాల్లోని నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. మొహొబ్బతె (2000), ధూమ్2 (2006), జోధా అక్బర్ (2008), ఎంథిరన్ (2010 (రోబో) ) సినిమాలు ఆమె కెరీర్ లోనే అతిపెద్ద హిట్ లుగా నిలిచాయి. గుజారిష్ (2010) సినిమాలో నటనకు కూడా మంచి ప్రశంసలు లభించాయి. ఆ తరువాత ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. తిరిగి 2015లో జజ్బా సినిమాతో తిరిగి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.

అభిషేక్ తో వివాహం

అభిషేక్ తో వివాహం

2007లో ఐశ్వర్య ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకున్నారు. వారికి ఒక పాప ఆరాధ్య. ధూమ్2 సినిమా షూటింగ్ సమయంలో అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యతో ప్రేమలో పడ్డారు. 14 జనవరి 2007న నిశ్చితార్థం జరిగింది. 20 ఏప్రిల్ 2007న బంట్ సంప్రదాయం వివాహం చేసుకున్నారు.

English summary
We can never have enough of the gorgeousness of Aishwarya Rai Bachchan. Ever since the actress has crowned as the Miss World, her unmatched beauty has always grabbed eyeballs. Recently, the official Instagram page of Miss India shared her rare picture in a golden swimsuit and boy, she is looking sensational in those pictures.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu