»   »  లండన్ నుంచి వస్తూ కెమెరాకు చిక్కిన ఐశ్వర్యరాయ్

లండన్ నుంచి వస్తూ కెమెరాకు చిక్కిన ఐశ్వర్యరాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : బాలీవుడ్ అందాల సుందరి ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ లండన్‌లో జరిగిన 'చిమ్ ఫర్ చేంజ్' అనే కార్యక్రమానికి హాజరై వస్తూ ముంబై ఎయిర్ పోర్టులో కెమెరాలకు చిక్కారు. వీరితో పాటు ఐశ్వర్య కూతురు ఆరాధ్య కూడా ఉన్నారు. ఐశ్వర్యరాయ్ బ్లాక్ డ్రెస్‌లో కనిపించగా, ఆరాధ్య క్యూట్ పింక్ డ్రెస్‌లో కనిపించింది.

'చిమ్ ఫర్ చేంజ్' అనే కార్యక్రమం జూన్ 1న లండన్లో జరుగా....ఐశ్వర్య, అభిషేక్ ప్రత్చేక అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్ లెజెండరీ హాలీవుడ్ యాక్టర్ ఆల్ పాసినోను కలిసారు. గత కొన్ని రోజులుగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఐష్-అభిషేక్ విదేశీ టూర్లకు వెలుతున్న సంగతి తెలిసిందే.

ముఖ్యంగా ఐశ్వర్య ఎక్కడికెళ్లినా....కూతురు ఆరాధ్యను తన వెంటే తీసుకెలుతోంది. ఇటీవల జరిగిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా కూతురు వెంటే తీసుకుని వెళ్లి ఐష్. దీన్ని బట్టి ఆమె తన కూతురు పట్ల ఎంత కేర్ తీసుకుంటున్నారో అర్థమవుతోంది. బచ్చన్ ఫ్యామిలీ ఫోటోలను స్లైడ్ షోలో వీక్షించండి.

ముంబై ఎయిర్ పోర్టులో ఐశ్వర్యరాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి దర్శనమిచ్చింది.


లండన్లో ఓ కార్యక్రమానికి హాజరైన బచ్చన్ ఫ్యామిలీ, తిరిగి వస్తూ ముంబై ఎయిర్ పోర్టులో కెమెరాలకు చిక్కారు


ఎయిర్ పోర్టులో ఐశ్వర్య బ్లాక్ డ్రెస్ లో కనిపించగా, ఆరాధ్య పింక్ కలర్ డ్రెస్ వేసుకుంది.


అమ్మ ఐశ్వర్య ఒడిలో...ఆరాధ్య బచ్చన్ ఎంతో సంతోషంగా కనిపించింది.


అభిషేక్ బచ్చన్ క్యాజువల్ డ్రెస్సులో చాలా సింపుల్‌గా కనిపించారు.


చిమ్ ఫర్ చేంజ్ అనే కార్యక్రమంలో పాల్గొనడానికి ఐశ్వర్య, అభిషేక్ లండన్ వెళ్లారు.


ఇక్కడ కనిపిస్తున్న ఫోటో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ లండన్లో చిమ్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో పాల్గొన్నప్పటిది


చిమ్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో పాల్గొనడానికి లండన్ వెళ్లిన అభిషేక్ బచ్చన్ హాలీవుడ్ లెజండరీ యాక్టర్ ఆల్ పాసినోను కలిసే అవకాశం దక్కించుకున్నారు.


లండన్లో జరిగిన ‘ఎ ఈవినింగ్ విత్ పాసినో' కార్యక్రమానికి...ఆల్ పాసినోను కలిసేందుకే ప్రత్యేకంగా వెళ్లారు అభిషేక్


‘ఎ ఈవినింగ్ విత్ పాసినో' కార్యక్రమానికి హాజరైన అభిషేక్ అక్కడ పాసినోతో దిగిన ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేసాడు.

English summary
Mumbai: Aishwarya Rai Bachchan was spotted with daughter Aaradhya Bachchan and hubby Abhishek Bachchan at Mumbai airport recently. At the airport Aishwarya was dressed in black, as usual, and baby Aaradhya was seen dressed up in a cute pink dress. On the other hand, Abhishek chose to wear casual clothes
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu