»   » ఐశ్వర్యరాయ్ ‘సిండ్రెల్లా’ లుక్ అదుర్స్...(కాన్స్ ఫిల్మ్‌ఫెస్ట్‌ రెడ్ కార్పెట్ ఫోటోస్)

ఐశ్వర్యరాయ్ ‘సిండ్రెల్లా’ లుక్ అదుర్స్...(కాన్స్ ఫిల్మ్‌ఫెస్ట్‌ రెడ్ కార్పెట్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాన్స్: నాలుగు పదుల వయసు దాటినా వన్నెతరగని అందంతో వెలిగిపోతున్న ఐశ్వర్యరాయ్ ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సిండ్రెల్లా లుక్ తో అభిమానుల మతి పోగొట్టింది. కాన్స్ రెడ్ కార్పెట్ మీద ఐశ్వర్యరాయ్ నడుస్తుంటే.... రియల్ క్వీన్ నడిచొచ్చినట్లే ఉందని అంటున్నారు అభిమానులు.

ప్రతి సంవత్సరం కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐశ్వర్యరాయ్ మెరుస్తున్నా.... ఈ సారి ఆమె ఇలా సిండ్రెల్లా లుక్ తో కనిపిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆమెను ఇలా చూసిన వారంతా నిజమైన క్వీన్ నడిచినట్లే ఉందని అంటున్నారు.

Aishwarya Rai Bachchan Turns Cinderella, Walks The Red Carpet For Cannes Like A Queen!
ఐశ్వర్యరాయ్

ఐశ్వర్యరాయ్

ఐశ్వర్యరాయ్ ధరించిన ఈ గౌను ప్రముఖ డిజైనర్ మైఖేల్ సిన్కో ప్రత్యేకంగా డిజైన్ చేసారు. ఈ డ్రెస్ వల్ల వేడుక మొత్తంలో ప్రత్యేకంగా కనిపించింది ఐష్.

హలో సిండ్రెల్లా

హలో సిండ్రెల్లా

ఎల్ ఓరియల్ బ్రాండ్ తరుపున ఐశ్వర్యరాయ్ కాన్స్ ఫిల్మ్ ఫెస్ట్ లో పాల్గొంది. ఎల్ ఓరియల్ ఇండియా అఫీషియల్ పేజీలో ‘హలో సిండ్రెల్లా.... కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎంతో అందంగా కనిపిస్తున్నావు' అంటూ ఆమెను ఉద్దేశించి ట్వీట్ చేసారు.

15 సంవత్సరాల నుండి

15 సంవత్సరాల నుండి

ప్రపంచంలో సినిమా రంగానికి సంబంధించి జరిగే అతిపెద్ద వేడుక ‘కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్'. ఇందులో రెడ్ కార్పెట్ మీద నడిచే అవకావం దక్కడమే ఎంతో గొప్పగా భావిస్తారు. ఇలాంటి ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్ట్ లో 15 సంవత్సరాల క్రితమే ఎంట్రీ ఇచ్చారు ఐష్. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఏడాది ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరుస్తూనే ఉన్నారు.

ప్రత్యేక గుర్తింపు

ప్రత్యేక గుర్తింపు

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గతకొన్నేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన ఐశ్వర్యరాయ్..... ఇండియాకు కూడా ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చారు. నిజమే ఇలాంటి అందగత్తె మన దేశ పౌరురాలు కావడం గర్వించే విషయమే.

వన్నె తరగని అందం

వన్నె తరగని అందం

ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ వయసు 43 సవత్సరాలు. ఈ వయసులోనూ ఆమె వన్నెతరగని అందంతో బ్యూటీ క్వీన్ లా కనిపిస్తుండటం విశేషం.

కొత్తదనమే

కొత్తదనమే

గత 15 ఏళ్లుగా ఆమె కాన్స్ రెడ్ కార్పెట్ మీద దర్శనమిస్తున్నా ఎప్పుడూ కొత్త‌ద‌న‌మే.. వ‌న్నే త‌ర‌గ‌ని అంద‌మే.

అభిమానులు

అభిమానులు

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎంత మంది విదేశీ తారలు వచ్చినా ఐశ్వర్యరాయ్ కోసం ఎదురు చూసే అభిమానులు ఎందరో... ముఖ్యంగా యూరఫ్ లో ఆమెకు చాలా మంది అభిమానులు ఉన్నారు.

English summary
This moment is one of the most important time for all the Aishwarya Rai Bachchan fans out there. It's that time of the year, when Aishwarya Rai Bachchan, in her 'oh-so-gorgeous' avatar walks the red carpet for Cannes and the entire world go crazy over her. This year, Aishwarya Rai Bachchan appeared at Cannes red carpet in the most unexpected avatar and boy oh boy; she looks like a real Queen!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu