»   » గోల్డెన్ టెంపుల్ లో వంట చేసిన ఐశ్వర్యరాయ్ (ఫోటోస్)

గోల్డెన్ టెంపుల్ లో వంట చేసిన ఐశ్వర్యరాయ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్ సెకండ్ ఇన్నింగ్స్ లో రొటీన్ పాత్రలు కాకుండా వైవిధ్యమైన పాత్రలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కొన్ని రోజు క్రితం రిలీజైన ‘జజ్బా' చిత్రంలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఐష్.....తాజా నటిస్తున్న ‘సరబ్జీత్' చిత్రం మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయబోతున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్వర్ణదేవాలయంలో జరుగుతోంది. షూటింగులో భాగంగా ఆమె స్వర్ణ దేవాలయంలో వంట చేయడం, దేవాలయ ప్రాంగణాన్ని శుభ్రపరచడం, పాత్రలు క్లీన్ చేయడం లాంటివి చేసారు. అందుకు సంబంధించిన ఫోటోస్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Also Read: ఐశ్వర్యరాయ్, రణబీర్ మధ్య ముద్దు సీన్ ఉంది కానీ, తీసేసారు!

పాకిస్థాన్ జైల్లో ఇరవైమూడు సంవత్సరాల పాటు బందీగా వుండి హత్యకు గురైన భారతీయ ఖైదీ సరబ్జీత్‌సింగ్ నిజ జీవితకథతో దర్శకుడు ఓమంగ్‌కుమార్ (మేరీకోమ్ ఫేమ్) 'సరబ్జీత్‌' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో సరబ్జీత్‌సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా నటిస్తున్నాడు. ఆమె సోదరి దల్బీర్‌కౌర్ పాత్రలో ఐశ్వర్యరాయ్ మెయిన్ రోల్ చేస్తోంది. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ పూర్తి దేశీ అవతారంలో పంజాబి మహిళగా డీగ్లామరస్ పాత్రలో కనిపించబోతున్నారు. బహుషా ఐశ్వర్యరాయ్ ని ఇప్పటి వరకు ఇలాంటి లుక్ లో ప్రేక్షకులు ఏ సినిమాలోనూ చూసి ఉండరు.

Also Read: నలభయ్యేళ్ల వయసులోనూ నాజూకు ఐష్ (ఫోటోస్)

1990 సంవత్సరంలో మద్యం మత్తులో పాకిస్థాన్ భూభాగంలోకి ప్రశేశించిన సరబ్జీత్‌సింగ్ ను భారతీయ గూఢచారిగా అనుమానించిన పాక్‌సైన్యం జైల్లో నిర్భందించింది. లాహోర్ జైల్లో 23 సంవత్సరాల పాటు వున్న సరబ్జిత్‌ను భారత పార్లమెంట్‌పై దాడిచేసిన అఫ్జల్‌గురు మరణశిక్షకు ప్రతీకారంగా సహచర ఖైదీలు మూడేళ్ల క్రితం జైల్లోనే హత్య చేశారు. సరబ్జీత్‌సింగ్ జైల్లో ఉండగా కలిసి వచ్చిన ఆయన సోదరి దల్బీర్‌కౌర్ అక్కడ జైల్లో తన సోదరుడు పడ్డ నరకయాతనను స్వయంగా చూసింది. ఆమె అనుభవాలే కథాంశంగా సినిమా రాబోతోంది.

ఐశ్వర్యరాయ్

ఐశ్వర్యరాయ్

సరబ్జీత్ షూటింగులో భాగంగా స్వర్ణదేవాలయంలో వంట చేస్తున్న ఐశ్వర్యరాయ్.

సరబ్జీత్

సరబ్జీత్

పాక్ హత్యకు గురైన భారతీయ ఖైదీ సరబ్జీత్‌సింగ్ నిజ జీవితకథతో ఈసినిమా తెరకెక్కుతోంది.

రణదీప్, ఐష్

రణదీప్, ఐష్

సరబ్జీత్‌సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా నటిస్తున్నాడు. ఆమె సోదరి దల్బీర్‌కౌర్ పాత్రలో ఐశ్వర్యరాయ్ మెయిన్ రోల్ చేస్తోంది.

రిలీజ్

రిలీజ్

మే 9, 2016లొ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
Aishwarya Rai Bachchan, who created a sensation in B-town with her amazing acting skills in her comeback film, Jazbaa, is all set to win the hearts of the audiences once again with her upcoming biopic film, Sarbjit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu