»   » ఐశ్వర్య రాయ్ రజనీకాంత్ కాళ్ళ మీద ఎందుకు పడినట్టు?

ఐశ్వర్య రాయ్ రజనీకాంత్ కాళ్ళ మీద ఎందుకు పడినట్టు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందాల రాశి ఐశ్వర్య రాయ్, దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ జంటగా నటించిన "రోబో" చిత్రం షూటింగ్ ఇటీవల ముగిసిన తర్వాత ఐష్ రజనీకాంత్ కు పాదాభివందనం చేసిందట. మన తరం మహానటుడు, ప్రతిభలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉండే అమితాబ్ బచ్చన్ కోడలైన ఐష్ ఇలా రజనీకాంత్ కాళ్ళు పట్టుకోవడం రోబో యూనిట్ ను ఆశ్చర్యపరిచింది. అందుకుకారణం రజనీకాంత్ లో గొప్పనటుడినే కాక దైవ లక్షణాలను కూడా చూడడమేనని కొందరు సీనియర్లు చెప్పుకుంటున్నారు.

ఐశ్వర్య రాయ్ తనకు పాదాభివందనం చేయడం చూసి రజనీకాంత్ వేగంగా స్పందించింది ఆమెను పైకి లేవనెత్తారట. రజనీకాంత్ నటనను, దక్షిణాదిలో ఆయనకున్న ఫాలోయింగ్ ను అనేక సందర్భాల్లో అమితాబ్ బచ్చన్ మెచ్చుకున్న విషయం తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu