»   » ఐశ్వర్యకు షాకిచ్చిన జయ... అత్త కోడళ్ల మధ్య నలిగిన అమితాబ్..

ఐశ్వర్యకు షాకిచ్చిన జయ... అత్త కోడళ్ల మధ్య నలిగిన అమితాబ్..

Written By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ అక్టోబర్ 11న 75వ పుట్టిన రోజును జరుపుకొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు బిగ్‌బీకి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ ఏడాది తాను జన్మదినాన్ని జరుపుకోవడం లేదు అని ఇటీవల మీడియాకు చెప్పడం గమనార్హం. సీన్ కట్ చేస్తే బిగ్‌బీ అమితాబ్ తన కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవుల్లో బర్త్ డే జరుపుకోవడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ఈ ఘటన వెనుక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది.

  ముంబైలోనే ఐశ్వర్య ప్లాన్

  ముంబైలోనే ఐశ్వర్య ప్లాన్

  వాస్తవానికి బిగ్‌బీ జన్మదినాన్ని ముంబైలోనే జరుపడానికి కోడలు ఐశ్వర్యరాయ్, ప్రముఖ జర్నలిస్టు సుభాష్ కే ఝా ప్లాన్ చేశారు. అందుకు తగినట్టు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో కోడలుకు షాకిస్తూ ప్లాన్ మార్చేసింది బిగ్‌బీ సతీమణి జయబచ్చన్.

  బిగ్‌బీ 75 జన్మదినాన్ని

  బిగ్‌బీ 75 జన్మదినాన్ని

  గత మార్చిలో ఐశ్వర్యరాయ్ తన తండ్రిని కోల్పోయింది. ఆ విషాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నించే క్రమంలో బిగ్‌బీ 75 జన్మదినాన్ని నిర్వహించాలని అనుకొందట.

  చెప్పకుండా ప్లాన్‌ను మార్చేసిన జయ

  చెప్పకుండా ప్లాన్‌ను మార్చేసిన జయ


  బిగ్ బీ బర్త్‌డే ఏర్పాట్లలో ఐశ్వర్య ఉండగానే ఆమెకు చెప్పకుండా పార్టీ ప్లాన్‌ను మార్చేశారట. తాను తన జన్మదినాన్ని జరుపుకోవాలని బిగ్ బీ సడెన్‌గా నిర్ణయం తీసుకొన్నారట. దాంతో ముంబై నుంచి బర్త్ డే వేడుక మాల్దీవులకు మారిందట.

  ఐశ్వర్యకు జయ చెప్పకుండా

  ఐశ్వర్యకు జయ చెప్పకుండా


  బిగ్ బీ నిర్ణయానికి జయ బచ్చన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కుటుంబ సభ్యులంతా ముంబై నుంచి మాల్దీవులకు బయలుదేరాల్సి వచ్చిందట. మాల్దీవులకు వెళ్లే విషయాన్ని ఐశ్వర్యకు జయ కూడా చెప్పకుండా గోప్యంగా ఉంచి షాక్ ఇచ్చిందని బాలీవుడ్‌కు చెందిన పత్రిక వెల్లడించింది.

  ముంబైలో ఉంటే స్నేహితులు

  ముంబైలో ఉంటే స్నేహితులు

  బిగ్ బీ తన నిర్ణయాన్ని మార్చుకోవడం ఓ కారణం ఉందట. ముంబైలో ఉంటే స్నేహితులు, సన్నిహితులు బలవంతంగా తన పుట్టిన రోజును జరుపుతారు అని బిగ్ బీ ప్లాన్ మార్చేశారట.

  అభిషేక్ ఆశ్చర్యకరమైన రీతిలో

  అభిషేక్ ఆశ్చర్యకరమైన రీతిలో

  అభిషేక్ ఆశ్చర్యకరమైన రీతిలో
  మాల్దీవుల్లో బిగ్ బీకి తన కుమారుడు అభిషేక్ బచ్చన్ ఆశ్చర్యకరమైన రీతిలో బర్త్ డే వేడుకలు నిర్వహించారని అమితాబ్ తన సోషల్ మీడియా అకౌంట్లలో వెల్లడించారు. నాన్న హ్యాపీ బర్త్ డే. 75 ఏళ్లు నిండినా చెక్కుచెదరని వ్యక్తి అని అభిషేక్ పెట్టిన పోస్టును ఆయన షేర్ చేశారు.

  English summary
  Amitabh Bachchan turned 75 recently. From well-wishers to colleagues, everyone wanted to celebrate this day but Big B told them that he has no plans to party this year. Now, a source recently told famous journalist Subhash K Jha that Aishwarya Rai Bachchan wanted to organise a birthday party for Amitabh in Mumbai but later the plan was changed.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more